2
November, 2026

A News 365Times Venture

2
Monday
November, 2026

A News 365Times Venture

YS Jagan: ఓటు వేయకుండానే వెనుదిరిగిన మాజీ సీఎం జగన్.. పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత..

Date:

పులివెందుల నియోజకవర్గంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు, పోలింగ్ సరళి తీవ్ర ఉద్రిక్తతలకు, వివాదాలకు కేంద్ర బిందువుగా మారాయి. ఎన్నికలలో అధికార పక్షం భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడిందని, ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అపహాస్యం చేశారని ఆరోపిస్తూ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను స్వయంగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రానికి వెళ్లినప్పటికీ, అక్కడ జరుగుతున్న అక్రమాలను చూసి తీవ్ర మనస్తాపానికి గురై ఓటు వేయకుండానే వెనుదిరిగారు.

ఈ సందర్భంగా వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పులివెందులలో జరుగుతున్న తతంగం చూస్తుంటే, ఒక ఓటరుగా తాను కూడా ఇప్పుడు ఓటు వేస్తే అది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినట్లే అవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం తన ఓటు వేసి వెళ్లిపోవడం కంటే, అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని తీవ్రంగా వ్యతిరేకించడమే ముఖ్యమని భావించినట్లు తెలిపారు. ఎన్నికల సంఘం పూర్తిగా ప్రభుత్వ కనుసన్నల్లో పనిచేస్తోందని, ఎస్‌ఈసీ తీరు చూస్తుంటే చంద్రబాబు మనిషిలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అలాగే అధికారులు సైతం అధికార పార్టీ చేతిలో తోలుబొమ్మలుగా మారి నిబంధనలను గాలికి వదిలేశారని ధ్వజమెత్తారు.

పులివెందులలో జరిగిన దాడులు, దొంగ ఓట్ల నమోదు, రిగ్గింగ్‌పై తాము ఇప్పటికే అధికారులకు, రిటర్నింగ్ ఆఫీసర్‌కు స్పష్టమైన ఫిర్యాదులు అందజేసినట్లు జగన్ గుర్తుచేశారు. ఎన్నికల అధికారుల నుంచి సరైన స్పందన రాకపోవడంతో పాటు అక్రమాలు నిరాటంకంగా కొనసాగినందునే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తాము ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఎన్నికల సంఘం స్పందించి పులివెందులలో తక్షణమే రీ-పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. రీ-పోలింగ్ తేదీని ప్రకటించిన తర్వాతే తాను వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకుంటానని స్పష్టం చేశారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Municipal Elections: కర్నూల్ జిల్లాలో పోటెత్తిన ఓటర్లు.. రాష్ట్రవ్యాప్తంగా 3 గంటల సమయానికి 48.03 శాతం ఓటింగ్ నమోదు..

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఉత్సాహంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం...

NASA Swift Telescope: నాసా రెస్క్యూ విఫలం.. భూమిపై కూలిపోనున్న స్విఫ్ట్ అబ్జర్వేటరీ.!

NASA Swift Telescope: అంతరిక్ష పరిశోధనలో 22 ఏళ్ల పాటు సేవలందించిన...

Ind Vs NZ: భారత్‌పై న్యూజిలాండ్ ఘన విజయం.. సిరీస్ కైవసం చేసుకున్న ఇండియా..

హామిల్టన్‌లోని సెడ్డన్ పార్క్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన...

Mallikarjun Kharge: జ్ఞానేష్ కుమార్ ఎక్కడ దాక్కున్నా వదలం.. మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు..

ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఇండియా కూటమి ఆధ్వర్యంలో ‘ఓట్ బచావో.. దేశ్...