29
July, 2026

A News 365Times Venture

29
Wednesday
July, 2026

A News 365Times Venture

Hyderabad: డ్రగ్స్ మత్తులో పోలీసులపైకి కారు దూసుకెళ్లిన యువకుడు.. కానిస్టేబుల్‌కు కాలు ఫ్రాక్చర్.!

Date:

Hyderabad Drugs: డ్రగ్స్ కేసును ఛేదించేందుకు వెళ్లిన పోలీసులపై ఓ యువకుడు కారుతో దాడికి పాల్పడిన ఘటన హైదరాబాద్‌లో కలకలం రేపింది. డ్రగ్స్ కొనుగోలు జరుగుతోందన్న సమాచారంతో నిఘా పెట్టిన హెచ్-న్యూ (Hyderabad Narcotics Enforcement Wing) పోలీసులపై నిందితుడు కారును దూసుకెళ్లడంతో ఓ కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో మరో కానిస్టేబుల్, ఓ సీఐ కూడా గాయపడగా.. నిందితుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం.. హెచ్-న్యూ కానిస్టేబుల్ మహేందర్ యాదవ్‌కు అబిడ్స్‌లో డ్రగ్స్ కొనుగోలు జరుగుతోందన్న సమాచారం అందింది. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చిన ఆయన.. హెచ్-న్యూ ఇన్‌స్పెక్టర్ శ్రీకాంత్‌తో పాటు ప్రత్యేక బృందంతో కలిసి అబిడ్స్ ప్రాంతంలో నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో బ్లూ కలర్ బెలెనో కారు అబిడ్స్‌లోని పాయల్ ఫుట్‌వేర్ సమీపానికి చేరుకోగా.. ఓ వ్యక్తి కారులో ఉన్న వ్యక్తికి అనుమానాస్పద ప్యాకెట్ అందజేశాడు. వెంటనే అక్కడే ఉన్న పోలీసులు ప్యాకెట్ ఇచ్చిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

కారులో ఉన్న హుస్సేనీ ఆలం ప్రాంతానికి చెందిన సైఫ్‌కు పోలీసులు తమ ఐడీ కార్డులు చూపించి వాహనం నుంచి దిగాలని సూచించారు. అయితే కారు పక్కకు ఆపుతున్నట్లు నటించిన సైఫ్ ఒక్కసారిగా వాహనాన్ని రివర్స్‌లో వేగంగా నడిపాడు. ఈ సమయంలో అడ్డుకునేందుకు ప్రయత్నించిన కానిస్టేబుల్ మహేందర్ యాదవ్ కాలిపై నుంచి కారు వెళ్లడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు.

నిందితుడిని వెంబడించిన ఇన్‌స్పెక్టర్ శ్రీకాంత్ బృందం అఫ్జల్‌గంజ్ వద్ద కారును అడ్డుకుని సైఫ్‌ను అదుపులోకి తీసుకుంది. ఈ క్రమంలో ఇన్‌స్పెక్టర్ శ్రీకాంత్, కానిస్టేబుల్ వంశీధర్‌ లకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. కాలిపై నుంచి కారు వెళ్లడంతో కానిస్టేబుల్ మహేందర్ యాదవ్‌కు కాలు ఫ్రాక్చర్ కావడంతో వెంటనే ఆయనను సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మహేందర్ యాదవ్ ఫిర్యాదు మేరకు.. నిందితుడు సైఫ్‌పై అబిడ్స్, అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్లలో హత్యాయత్నం (Attempt to Murder) సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం సైఫ్‌ను హెచ్-న్యూ పోలీసులు అదుపులోకి తీసుకుని డ్రగ్స్ వ్యవహారంపై, ఘటనకు సంబంధించిన ఇతర కోణాలపై విచారణ కొనసాగిస్తున్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..

IPL Value: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ప్రపంచ క్రీడా రంగంలో...

JP Nadda: “ఉద్యమాల్లో పాల్గొంటే పోలీసు దెబ్బలకు సిద్ధపడాల్సిందే”.. సీజేపీ నిరసనపై జేపీ నడ్డా ఫైర్

JP Nadda: విద్యార్థి ఉద్యమాలు, పోలీస్ చర్యలు, పార్లమెంట్‌లో ప్రతిపక్షాల ఆందోళనలతో...

EPFO: పీఎఫ్ చందాదారులకు భారీ ఊరట.. అప్లై చేయకుండానే నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు!

EPFO: బ్యాంకులు, ఎల్ఐసీ (LIC), ఈపీఎఫ్‌ఓ (EPFO)లలో వేల కోట్ల రూపాయల...

7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!

OnePlus N6x: వన్‌ప్లస్ (OnePlus) తన N-సిరీస్‌లో మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్...