7
November, 2026

A News 365Times Venture

7
Saturday
November, 2026

A News 365Times Venture

Hyderabad: ప్రజాప్రతినిధులకే ‘టోకరా’.. నిత్య కిలాడీ బాలాజీ నాయుడు అరెస్ట్‌!

Date:

Hyderabad: సామాన్యులను బురిడీ కొట్టించే మోసగాళ్లను చూశాం.. కానీ ఏకంగా చట్టసభల ప్రతినిధులకే కుచ్చుటోపీ పెట్టిన అంతర్రాష్ట్ర కిలాడీ ఎట్టకేలకు పోలీసుల చిక్కాడు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన, సీఎం నిరుద్యోగ భృతి వంటి పథకాల కింద నియోజకవర్గాలకు భారీగా నిధులు మంజూరు చేయిస్తానంటూ రెండు తెలుగు రాష్ట్రాల్లోని సుమారు 50 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలను మోసగించిన పాత నేరస్థుడు తోట బాలాజీ నాయుడు అలియాస్ అనిల్ కుమార్ అలియాస్ మల్లారెడ్డిని హైదరాబాద్ కమిషనర్స్ టాస్క్‌ఫోర్స్ (గోల్కొండ టీమ్), ఫిలింనగర్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

ఎన్టీపీసీ ఇంజినీర్ టు ‘హైటెక్’ మోసగాడు
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలానికి చెందిన తోట బాలాజీ నాయుడు (53) జేఎన్‌టీయూ కాకినాడలో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. అనంతరం రామగుండం ఎన్టీపీసీలో జూనియర్ ఇంజినీర్‌గా చేరి, అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) స్థాయికి ఎదిగాడు. విలాసవంతమైన జీవితానికి అలవాటుపడిన అతడు 2008లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి చిక్కడంతో ఉద్యోగం నుంచి సస్పెండయ్యాడు. అధికారులు కేసును సీబీఐకి అప్పగించారు. ప్రభుత్వ ఉద్యోగం పోవడంతో సులభంగా డబ్బు సంపాదించేందుకు మోసాల బాట పట్టాడు. తన అసలు పేరు బయటకు రాకుండా నాయుడు, నాయుడు బాబు, అనిల్ కుమార్, మల్లారెడ్డి పేర్లతో రంగంలోకి దిగాడు.

మోసాల రూట్ ఇదే..
అధికారిక వెబ్‌సైట్ల నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ముఖ్య ప్రజాప్రతినిధుల వ్యక్తిగత ఫోన్ నంబర్లు సేకరించడం ఇతడి తొలి వ్యూహం. ఆ తర్వాత ట్రూకాలర్ లేదా ఇతర యాప్‌లలో నంబర్ డిస్‌ప్లే ‘సచివాలయ అడిషనల్ సెక్రటరీ’ అని కనిపించేలా సాంకేతిక మార్పులు చేసుకునేవాడు. నేరుగా ప్రజాప్రతినిధులకే ఫోన్ చేసి.. “నేను సచివాలయం ఆర్థిక శాఖ నుంచి అదనపు కార్యదర్శిని మాట్లాడుతున్నాను. మీ నియోజకవర్గానికి ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన’ కింద ఇళ్లు, ‘పీఎం వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన’, ‘సీఎం నిరుద్యోగ పథకం’ కింద ప్రత్యేక కోటా నిధులు కేటాయిస్తున్నాం” అని నమ్మబలికేవాడు.

ప్రాసెసింగ్ ఫీజు పేరిట నయా దందా
కోట్లాది రూపాయల నిధులు తమ నియోజకవర్గానికి వస్తున్నాయన్న ఉత్సాహంతో ప్రజాప్రతినిధులు ఇతడి వలలో పడేవారు. ఆ వెంటనే.. నిధుల మంజూరు ప్రక్రియ వేగవంతం కావడానికి, ప్రత్యేక జీవో జారీ చేయడానికి ప్రాసెసింగ్ ఫీజు లేదా కంట్రిబ్యూషన్ ఫండ్ కింద కొంత మొత్తం తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేసేవాడు. ఇతడి మాటలు నిజమని నమ్మి పలువురు ప్రజాప్రతినిధులు, వారి ముఖ్య అనుచరులు నిందితుడు సూచించిన బ్యాంకు ఖాతాల్లోకి లక్షలాది రూపాయలు బదిలీ చేసేవారు. నగదు జమకాగానే సిమ్ కార్డులు మార్చేసి పరారయ్యేవాడు. ఇలా ఇప్పటివరకు రెండు రాష్ట్రాల్లో దాదాపు 50 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలకు టోకరా వేసి భారీగా నగదు దండుకున్నట్లు విచారణలో తేలింది.

50కి పైగా కేసులు.. పీడీ యాక్ట్ పెట్టినా మారని తీరు
నిందితుడిపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే 50కి పైగా చీటింగ్, ఐటీ చట్టం కేసులు నమోదయ్యాయి. ఇతడి నేర చరిత్రను పరిగణనలోకి తీసుకుని 2016లోనే బంజారాహిల్స్ పోలీసులు పీడీ (పీడీ) యాక్ట్ కూడా ప్రయోగించారు. జైలు నుంచి బయటకు వచ్చిన ప్రతిసారీ కొత్త పథకాల పేర్లతో మళ్లీ ప్రజాప్రతినిధులనే లక్ష్యంగా చేసుకుని దందాను కొనసాగిస్తున్నాడు. ఇటీవల ఫిలింనగర్ పీఎస్ పరిధిలో నమోదైన కేసు (క్రైమ్ నెం. 505/2026), మంచిర్యాల టౌన్ పీఎస్ కేసుల దర్యాప్తులో భాగంగా కాల్ డేటా రికార్డులు, బ్యాంక్ లావాదేవీల ఆధారంగా పక్కా నిఘా పెట్టిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి పలు మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు, నకిలీ గుర్తింపు కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ప్రజాప్రతినిధులు, ప్రజలు ఇలాంటి అపరిచిత కాల్స్‌ను నమ్మి ఆర్థిక లావాదేవీలు జరపవద్దని పోలీసు ఉన్నతాధికారులు విజ్ఞప్తి చేశారు.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Karnataka: పెళ్లాం పుట్టింటికి వెళ్తోందని కక్ష.. భార్య, అత్తతో పాటు అత్తగారింటికి చెందిన ఏడుగురి హత్య

Karnataka: బెంగళూరులో (Bengaluru) కలకలం రేపిన దారుణం వెలుగులోకి వచ్చింది. భార్య...

Reliance Foundation: తుఫాన్ బాధిత మత్స్యకారులకు అండగా రిలయన్స్ ఫౌండేషన్.. పడవల వెలికితీతకు చర్యలు..

ఆర్నబ్ తుఫాన్ భారతదేశ తూర్పు తీరంలో తీవ్ర విధ్వంసాన్ని మిగిల్చి, వేలాది...

Diwali Bonus Rules: మీ కంపెనీ దీపావళికి బోనస్ ఇవ్వడం లేదా? చర్యలు తీసుకోవచ్చని మీకు తెలుసా?

Diwali Bonus Rules: రెండ్రోజుల్లో దీపావళి పండగ వచ్చేస్తోంది. ఈ పండగకు...