7
November, 2026

A News 365Times Venture

7
Saturday
November, 2026

A News 365Times Venture

Diwali Bonus Rules: మీ కంపెనీ దీపావళికి బోనస్ ఇవ్వడం లేదా? చర్యలు తీసుకోవచ్చని మీకు తెలుసా?

Date:

Diwali Bonus Rules: రెండ్రోజుల్లో దీపావళి పండగ వచ్చేస్తోంది. ఈ పండగకు ముందే షాపింగ్, సన్నాహాలు మొదలైపోతాయి. ఉద్యోగులైతే కంపెనీలు ఇచ్చే గిఫ్ట్‌లు, స్వీట్లు, బోనస్‌ల కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటారు. ఈ పండగ ఖర్చులన్నీ బోనస్‌తోనే సర్దుబాటు చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటుంటారు. కానీ, అర్హులైన ఉద్యోగులకు బోనస్ ఇవ్వడం చట్టపరంగా తప్పనిసరి అనే విషయం మీకు తెలుసా? నిబంధనలు ఉన్నప్పటికీ కంపెనీ బోనస్ ఇవ్వకపోతే, ఆ సంస్థపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అసలు ఈ నిబంధనలు ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం?

భారత్‌లో ఉద్యోగుల బోనస్‌కు సంబంధించి గతంలో ‘పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్ట్, 1965’ (Payment of Bonus Act, 1965) ఉండేది. దీని ప్రకారమే అర్హులైన ఉద్యోగులకు నిబంధనల ప్రకారం బోనస్ చెల్లించడం కంపెనీలకు విధిగా ఉండేది. అయితే, కొత్త లేబర్ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత, బోనస్‌కు సంబంధించిన నిబంధనలన్నీ ‘కోడ్ ఆన్ వేజెస్, 2019’ (Code on Wages, 2019) పరిధిలోకి వచ్చాయి. అందువల్ల ప్రస్తుత పరిస్థితుల్లో బోనస్‌కు సంబంధించిన చట్టపరమైన నిబంధనలను సరిగ్గా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.

అయితే కంపెనీలో పనిచేసే ప్రతి ఒక్కరికీ ఆటోమేటిక్‌గా బోనస్ వచ్చేస్తుందనుకోవడం పొరపాటే. ఉద్యోగి జీతం (Salary), పనిచేసిన కాలం (Work Duration), కంపెనీ అర్హత ప్రమాణాలు, లేబర్ రూల్స్ ఆధారంగానే బోనస్ వర్తిస్తుంది. అర్హత ఉన్న ఉద్యోగులకు చట్టప్రకారం నిర్ణీత నిబంధనల మేరకు కనీస బోనస్ (Minimum Bonus) అందించాల్సి ఉంటుంది. పాత చట్టం ప్రకారం అర్హులైన ఉద్యోగులకు కనీసం 8.33 శాతం నుంచి గరిష్టంగా 20 శాతం వరకు బోనస్ ఇచ్చేలా నిబంధన ఉండేది. కొత్త చట్టం ప్రకారం వేతన పరిమితి (Wage Ceiling) ఆధారంగా అర్హతలు మారుతుంటాయి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. దీపావళికి ప్రత్యేకంగా అదనపు బోనస్ ఇవ్వాలని ఏ చట్టమూ ప్రతి కంపెనీని కచ్చితంగా ఆదేశించదు. దీపావళి పండుగ బోనస్ అనేది పూర్తిగా కంపెనీ హెచ్‌ఆర్ (HR) పాలసీ, మీ నియామక పత్రంలో పేర్కొన్న షరతులపై ఆధారపడి ఉంటుంది. చట్టపరంగా వచ్చే వార్షిక బోనస్‌కు, కంపెనీలు పండగ సమయంలో ఇచ్చే అదనపు బోనస్‌కు చాలా తేడా ఉంటుంది.

ఒకవేళ చట్టపరంగా అర్హత ఉన్న ఉద్యోగికి కంపెనీ విధిగా ఇవ్వాల్సిన బోనస్ ఇవ్వకపోతే, సదరు సంస్థపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. ఈ అంశంపై పూర్తి విచారణ జరిపిన తర్వాత కంపెనీకి జరిమానా (Fine) విధించడంతో పాటు ఇతర చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో బాధ్యులైన అధికారులపై శిక్షాత్మక చర్యలు ఉండే అవకాశం కూడా ఉంది. అయితే, బోనస్ ఇవ్వలేదన్నంత మాత్రాన వెంటనే బాస్‌ను నేరుగా జైలుకు పంపించేస్తారని అనుకోవడం పొరపాటు. ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది ఆయా పరిస్థితులు, లేబర్ లా (Labor Laws) నిబంధనలపై పూర్తిగా ఆధారపడి ఉంటుంది. ఇక, అర్హత ఉన్నప్పటికీ కంపెనీ మీకు బోనస్ ఇవ్వకపోతే ఉద్యోగులు ముందుగా హెచ్‌ఆర్ డిపార్ట్‌మెంట్ (HR Department) లేదా కంపెనీ మేనేజ్‌మెంట్‌ను సంప్రందించి రాతపూర్వకంగా (Written Request) సమాచారం కోరాలి. ఒకవేళ అక్కడి నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాకపోతే, సంబంధిత లేబర్ డిపార్ట్‌మెంట్ (Labor Department) లేదా లేబర్ ఆఫీసర్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేయవచ్చు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: ప్రజాప్రతినిధులకే ‘టోకరా’.. నిత్య కిలాడీ బాలాజీ నాయుడు అరెస్ట్‌!

Hyderabad: సామాన్యులను బురిడీ కొట్టించే మోసగాళ్లను చూశాం.. కానీ ఏకంగా చట్టసభల...

Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి బంపర్ ఆఫర్.. ఆ సీనియర్ జట్టు కెప్టెన్‌గా బుడ్డోడి నియామకం

యువ సంచలనం, బ్యాటర్ వైభవ్ సూర్యవంశీని (Vaibhav Sooryavanshi) బీహార్ సీనియర్...

CM Chandrababu: “తక్షణమే ఆదుకోండి”.. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు సీఎం చంద్రబాబు లేఖ

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో సంభవించిన వరుస తుఫాన్ల విధ్వంసంపై ముఖ్యమంత్రి నారా...