7
November, 2026

A News 365Times Venture

7
Saturday
November, 2026

A News 365Times Venture

Reliance Foundation: తుఫాన్ బాధిత మత్స్యకారులకు అండగా రిలయన్స్ ఫౌండేషన్.. పడవల వెలికితీతకు చర్యలు..

Date:

ఆర్నబ్ తుఫాన్ భారతదేశ తూర్పు తీరంలో తీవ్ర విధ్వంసాన్ని మిగిల్చి, వేలాది మంది జీవనోపాధిపై దెబ్బకొట్టింది. ఈ విపత్తుకు స్పందిస్తూ రిలయన్స్ ఫౌండేషన్ తన ‘వి కేర్’ తక్షణమే క్షేత్రస్థాయి పరిశీలన జరిపి, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో కొట్టుకుపోయిన 180కి పైగా పడవలను వెలికితీసేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ తుఫాన్ కారణంగా జిల్లాలోని అల్లావరం మండలం ఓడలరేవు, సఖినేటిపల్లి ఫిషింగ్ ల్యాండింగ్ కేంద్రాలలో మత్స్యకార వర్గాల జీవనోపాధి  దెబ్బతింది.

ప్రతికూల వాతావరణం వల్ల దాదాపు 186 చేపల వేట పడవలు లంగరు స్థానాల నుంచి కొట్టుకుపోయాయి. వీటిలో అనేక పడవలు కాలువలు, బురద ప్రాంతాలు, సమీప ల్యాండింగ్ స్థలాలలో చిక్కుకున్నాయి. కొన్ని పడవలు పాక్షికంగా లేదా పూర్తిగా మునిగిపోగా, మరికొన్ని ఒండ్రులో ఇరుక్కుపోయాయి, ఇంకొన్ని ఒకదానిపై ఒకటి పడిపోయాయి. సుమారు 5 నుంచి 10 టన్నుల బరువున్న ఈ పడవలు సరియైన దారి లేని బురద ప్రాంతాలలో ఉండటంతో చేతులతో వెలికితీయడం కష్టంగా, ప్రమాదకరంగా మారింది.

దీంతో రిలయన్స్ ఫౌండేషన్ నిపుణులు, బృందాలు.. అల్లావరం మండల మత్స్యశాఖ, ప్రభుత్వ అధికారులతో కలిసి సరైన క్రేన్లు, యాంత్రిక పరికరాల ద్వారా ప్రభావితమైన పడవలను సురక్షితంగా వెలికితీయడానికి చర్యలు చేపట్టాయి. స్థానిక మత్స్యకారులతో కలిసి పడవల లొకేషన్లను గుర్తించి, క్రేన్ ఆపరేటర్ల సహాయంతో ప్రత్యేక భద్రతా ప్రమాణాలకు లోబడి ప్రణాళికాబద్ధంగా వాటిని యథాస్థానానికి చేరుస్తున్నారు.

ఈ కార్యక్రమం ద్వారా ఈ ప్రాంతంలోని దాదాపు 10,000 మంది మత్స్యకారులకు నేరుగా, పరోక్షంగా లబ్ధి చేకూరనుంది. పడవలను సురక్షితంగా వెలికితీయడం వల్ల నీటిలోనే ఉండటం వలన జరిగే అదనపు నష్టం తగ్గడమే కాకుండా, మరమ్మతు అంచనా వేసుకోవడానికి యజమానులకు వీలు కలుగుతుంది. దీని ద్వారా మరమ్మతులు పూర్తి చేసుకుని మత్స్యకార కుటుంబాలు త్వరగా తమ వేటను పునఃప్రారంభించవచ్చు. దేశవ్యాప్తంగా విపత్తుల సమయంలో ఎల్లప్పుడూ ముందుండే రిలయన్స్ ఫౌండేషన్, భవిష్యత్తులో కూడా సహాయ, పునరావాస చర్యల ద్వారా ప్రజలకు అండగా నిలుస్తుంది.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Karnataka: పెళ్లాం పుట్టింటికి వెళ్తోందని కక్ష.. భార్య, అత్తతో పాటు అత్తగారింటికి చెందిన ఏడుగురి హత్య

Karnataka: బెంగళూరులో (Bengaluru) కలకలం రేపిన దారుణం వెలుగులోకి వచ్చింది. భార్య...

Diwali Bonus Rules: మీ కంపెనీ దీపావళికి బోనస్ ఇవ్వడం లేదా? చర్యలు తీసుకోవచ్చని మీకు తెలుసా?

Diwali Bonus Rules: రెండ్రోజుల్లో దీపావళి పండగ వచ్చేస్తోంది. ఈ పండగకు...

Hyderabad: ప్రజాప్రతినిధులకే ‘టోకరా’.. నిత్య కిలాడీ బాలాజీ నాయుడు అరెస్ట్‌!

Hyderabad: సామాన్యులను బురిడీ కొట్టించే మోసగాళ్లను చూశాం.. కానీ ఏకంగా చట్టసభల...