21
July, 2026

A News 365Times Venture

21
Tuesday
July, 2026

A News 365Times Venture

Hair Fall Causes: జుట్టు రాలడానికి షాంపూనే కారణమా? అసలు సమస్య వేరే ఉండొచ్చు

Date:

Hair Fall Causes: జుట్టు ఎక్కువగా రాలడం ప్రారంభమైతే చాలా మంది ముందుగా తమ షాంపూనే కారణమని భావిస్తారు. వెంటనే కొత్త బ్రాండ్‌కు మారడం లేదా తరచూ షాంపూ మార్చడం చేస్తుంటారు. అయితే చర్మవ్యాధి నిపుణుల అభిప్రాయం ప్రకారం, జుట్టు రాలడానికి చాలా సందర్భాల్లో షాంపూ ప్రత్యక్ష కారణం కాదు. షాంపూ ప్రధానంగా తల చర్మం, జుట్టుపై పేరుకుపోయిన మురికి, చెమట, నూనె, దుమ్మును శుభ్రం చేసే క్లెన్సర్ మాత్రమే. ఇది జుట్టు కుదుళ్లలోకి వెళ్లి వాటిని దెబ్బతీసేలా పనిచేయదని నిపుణులు వివరిస్తున్నారు.

జుట్టు రాలడం వేరు.. విరగడం వేరు..
చాలా మంది జుట్టు రాలడాన్ని, జుట్టు విరగడాన్ని ఒకటిగానే భావిస్తారు. కానీ ఈ రెండింటి మధ్య తేడా ఉంది. కొన్నిసార్లు షాంపూలోని కొన్ని పదార్థాల వల్ల లేదా జుట్టు ఎక్కువగా పొడిబారడం వల్ల వెంట్రుకలు మధ్యలోనే విరిగిపోతాయి. దీనినే హెయిర్ బ్రేకేజ్ అంటారు. ఇది జుట్టు కుదుళ్ల నుంచి రాలిపోవడం కాదు. కాబట్టి షాంపూ మార్చినంత మాత్రాన అసలు సమస్య పరిష్కారమవుతుందని అనుకోవడం సరైంది కాదు.

జుట్టు రాలడం వెనుక అంతర్గత కారణాలు..!
నిపుణుల ప్రకారం జుట్టు రాలడానికి అనేక అంతర్గత కారణాలు ఉండొచ్చు. జన్యుపరమైన అంశాలు, హార్మోన్ల అసమతుల్యత, అధిక ఒత్తిడి, పోషకాహార లోపాలు, ఐరన్ లేదా విటమిన్‌ల కొరత, థైరాయిడ్ సమస్యలు వంటి వైద్యపరమైన కారణాలు జుట్టు రాలడానికి దారితీయవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో సమస్యకు మూల కారణాన్ని గుర్తించడం చాలా ముఖ్యం.

ఎలాంటి షాంపూ ఎంచుకోవాలి..?
షాంపూ ఎంపికలో కూడా జాగ్రత్త అవసరం. తల చర్మం పొడిగా ఉంటే ఒక రకం షాంపూ, జిడ్డుగా ఉంటే మరో రకం షాంపూ ఉపయోగించడం మంచిది. అయితే షాంపూను తల చర్మానికి మాత్రమే అప్లై చేయాలి. జుట్టు మొత్తం పొడవునా ఎక్కువగా రుద్దాల్సిన అవసరం లేదు. తల చర్మాన్ని వేళ్లతో మెల్లగా మసాజ్ చేసి, తర్వాత శుభ్రమైన నీటితో బాగా కడగాలి. గోళ్లతో బలంగా గోకడం లేదా ఎక్కువగా రుద్దడం వల్ల తల చర్మానికి చికాకు, చిన్న గాయాలు ఏర్పడి సమస్య మరింత పెరగవచ్చు.

షాంపూ ఒక్కటే పరిష్కారం కాదు..!
జుట్టు సంరక్షణలో షాంపూ ఒక్కటే పరిష్కారం కాదని గుర్తుంచుకోవాలి. సమతుల్య ఆహారం తీసుకోవడం, తగినంత నిద్రపోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం, అవసరమైన పోషకాలు అందేలా చూసుకోవడం కూడా జుట్టు ఆరోగ్యానికి కీలకం. షాంపూ మారుస్తున్నా జుట్టు రాలడం కొనసాగితే స్వయంగా నిర్ణయాలు తీసుకునే బదులు చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించడం మంచిది. అవసరమైతే వైద్యులు రక్తపరీక్షలు లేదా ఇతర పరీక్షల ద్వారా అసలు కారణాన్ని గుర్తించి తగిన చికిత్స సూచిస్తారు. అందువల్ల జుట్టు రాలిన ప్రతిసారీ షాంపూనే కారణమని భావించడం కంటే, దాని వెనుక ఉన్న అసలు కారణాన్ని తెలుసుకోవడం ముఖ్యం. సరైన హెయిర్ కేర్, ఆరోగ్యకరమైన జీవనశైలి, అవసరమైతే వైద్యుల సలహాతోనే ఈ సమస్యను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు.

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!

Paneer Tikka Recipe: సాధారణంగా రెస్టారెంట్లలో దొరికే పన్నీర్ టిక్కాని చూసి...

Towel Cleaning Tips: టవల్ ఉతికినా దుర్వాసన పోవట్లేదా? ఈ చిట్కాలతో సమస్యకు చెక్

Towel Cleaning Tips: టవల్‌ను ఉతికిన తర్వాత కూడా దుర్వాసన వస్తుండటం...

PM Modi: వాదనలు బలంగా ఉండాలి.. శబ్దం కాదు.. వర్షాకాల సమావేశాలపై ప్రధాని కీలక వ్యాఖ్యలు

PM Modi: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభానికి ముందు ప్రధానమంత్రి నరేంద్ర...

Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?

Mahindra New SUV: భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కొత్త వాహనాలను...