21
July, 2026

A News 365Times Venture

21
Tuesday
July, 2026

A News 365Times Venture

Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్‌కార్ లాంచ్.. ధర ఎంతంటే?

Date:

Ferrari Amalfi Spider: ఇటాలియన్ లగ్జరీ స్పోర్ట్స్ కార్ల తయారీ సంస్థ ఫెరారీ భారత మార్కెట్లో కొత్తగా అమాల్ఫీ స్పైడర్ (Amalfi Spider) కన్వర్టిబుల్ సూపర్‌కార్‌ను విడుదల చేసింది. ఇందులో 3.9 లీటర్ ట్విన్-టర్బో V8 పెట్రోల్ ఇంజిన్ ను అందించారు. ఈ ఇంజిన్ 640 HP పవర్, 760 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 8-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ జత చేశారు. ఈ సూపర్‌కార్ కేవలం 3.3 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గంట వేగాన్ని అందుకోగలదు. దీని గరిష్ట వేగం 320 కిమీ/గంటగా ఉంది.

అమాల్ఫీ స్పైడర్ ప్రధాన ఆకర్షణ దాని ఫోల్డింగ్ ఫ్యాబ్రిక్ రూఫ్. ఈ రూఫ్ 13.5 సెకన్లలో తెరుచుకుంటుంది లేదా మూసుకుపోతుంది. గంటకు 60 కిమీ వేగంతో ప్రయాణిస్తున్నప్పటికీ ఈ ఫీచర్‌ను ఉపయోగించవచ్చు. నాలుగు రంగులలో రూఫ్‌ను ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. ప్రత్యేకమైన రోస్సో ట్రామోంటో (Rosso Tramonto) ఎక్స్‌టీరియర్ కలర్ కూడా అందుబాటులో ఉంది.

కారులో 2+2 సీటింగ్ లేఅవుట్ తో పాటు డ్రైవర్-ఫోకస్డ్ క్యాబిన్‌ను అందించారు. ఇందులో 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 15.6 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 8.8 అంగుళాల ప్యాసింజర్ డిస్‌ప్లే, పవర్డ్ స్పోర్ట్స్ సీట్లు, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, వైర్‌లెస్ ఛార్జింగ్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ADAS వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి.

సూపర్‌కార్ అయినప్పటికీ ఉపయోగకరతను దృష్టిలో పెట్టుకుని బూట్ స్పేస్‌ను కూడా అందించారు. రూఫ్ మూసి ఉన్నప్పుడు 255 లీటర్ల బూట్ స్పేస్, రూఫ్ తెరిచినప్పుడు 172 లీటర్ల లగేజ్ సామర్థ్యం లభిస్తుంది. ఈ ఓపెన్-టాప్ గ్రాండ్ టూరర్ ప్రారంభ ధర రూ.4.60 కోట్లు (ఎక్స్-షోరూమ్, ఆప్షన్లు మినహా)గా నిర్ణయించింది. ప్రపంచవ్యాప్తంగా మార్చి 2026లో అరంగేట్రం చేసిన కొద్ది నెలల్లోనే ఈ మోడల్‌ను భారత్‌కు తీసుకురావడం విశేషం.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Towel Cleaning Tips: టవల్ ఉతికినా దుర్వాసన పోవట్లేదా? ఈ చిట్కాలతో సమస్యకు చెక్

Towel Cleaning Tips: టవల్‌ను ఉతికిన తర్వాత కూడా దుర్వాసన వస్తుండటం...

PM Modi: వాదనలు బలంగా ఉండాలి.. శబ్దం కాదు.. వర్షాకాల సమావేశాలపై ప్రధాని కీలక వ్యాఖ్యలు

PM Modi: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభానికి ముందు ప్రధానమంత్రి నరేంద్ర...

Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?

Mahindra New SUV: భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కొత్త వాహనాలను...

Uday Krishna Reddy: లైంగిక వేధింపుల కేసులో ట్విస్ట్.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణ రెడ్డి ఆత్మహత్య యత్నం..!

Uday Krishna Reddy: హైదరాబాద్‌లో ఉన్న జాతీయ పోలీస్ అకాడమీలో తోటి...