22
July, 2026

A News 365Times Venture

22
Wednesday
July, 2026

A News 365Times Venture

Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?

Date:

Mahindra New SUV: భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కొత్త వాహనాలను ఆవిష్కరించడం మహీంద్రా & మహీంద్రా సంప్రదాయంగా కొనసాగిస్తోంది. అదే సంప్రదాయాన్ని 2026లోనూ కొనసాగించేందుకు కంపెనీ సిద్ధమైంది. ఈ ఏడాది ఆగస్టు 15న కొత్త మోడల్‌ను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు సంకేతాలు ఇస్తోంది.

ప్రస్తుతం మహీంద్రా స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్, విజన్ S, BE 07 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ వంటి మోడళ్లను టెస్టింగ్ చేస్తోంది. వీటిలో స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు ఆటోమొబైల్ వర్గాలు భావిస్తున్నాయి. 2022లో విడుదలైన స్కార్పియో Nకు ఇప్పటివరకు స్వల్ప మార్పులు మాత్రమే రావడంతో ఇప్పుడు మిడ్-లైఫ్ ఫేస్‌లిఫ్ట్ తీసుకురావడానికి ఇదే సరైన సమయంగా మారింది.

ప్రీమియం లుక్:

కొత్త స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్‌లో ఫ్రంట్ డిజైన్‌లో పలు మార్పులు కనిపించనున్నాయి. కొత్త గ్రిల్, రీడిజైన్ చేసిన బంపర్, అప్‌డేటెడ్ హెడ్‌ల్యాంప్స్‌తో పాటు కొత్త డిజైన్ అలాయ్ వీల్స్‌ను అందించే అవకాశం ఉంది. వెనుక భాగంలో కూడా స్వల్ప కాస్మెటిక్ మార్పులు ఉండే అవకాశముంది.

మరోవైపు క్యాబిన్‌లో మరింత ప్రీమియం అనుభూతిని అందించేలా పలు అప్‌డేట్స్ వచ్చే అవకాశముంది. పెద్ద 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు వంటి ఫీచర్లు అందించవచ్చని సమాచారం. అలాగే ప్రస్తుతం టాప్ వేరియంట్లలో మాత్రమే ఉన్న ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) ఫీచర్లను మరిన్ని వేరియంట్లకు విస్తరించే అవకాశం ఉంది.

ఇంజిన్‌లో మార్పులు:

మెకానికల్‌గా మాత్రం ఎలాంటి మార్పులు ఉండే అవకాశం లేదు. ప్రస్తుతం ఉన్న 2.2-లీటర్ టర్బో డీజిల్, 2.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్లే కొనసాగనున్నాయి. ఈ ఇంజిన్లకు మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. ఎంపిక చేసిన వేరియంట్లలో ఫోర్-వీల్ డ్రైవ్ (4WD) వ్యవస్థ కూడా కొనసాగనుంది. అలాగే మహీంద్రా విజన్ S ఇంకా మార్కెట్‌కు రావడానికి సమయం పట్టే అవకాశం ఉన్నప్పటికీ.. కంపెనీ BE 07 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఆగస్టు 15న ఆవిష్కరించే అవకాశం కూడా ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే కంపెనీ అధికారిక టీజర్లు విడుదల చేసిన తర్వాతే ఏ మోడల్ వస్తుందనే దానిపై స్పష్టత రానుంది. ఆగస్టు 15న మహీంద్రా ఏ సర్‌ప్రైజ్ ఇవ్వబోతోందో తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Bhatti Vikramarka: రాహుల్ గాంధీ అరెస్టు.. రాజ్యాంగాన్ని అవమానించడమే..!

Bhatti Vikramarka: ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద నీట్ అక్రమాలపై శాంతియుతంగా నిరసన...

NEET Abolition: నీట్‌పై ‘దళపతి’ సంచలన డిమాండ్.. అసలు నీట్ పరీక్షను రాష్ట్రాలు రద్దు చేయగలవా?

NEET Abolition: జోసెఫ్ విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పుడు, ఢిల్లీతో తమిళనాడు జరుపుతున్న...

Bengaluru Crime: త్రిపుల్ మర్డర్ కేసులో షాకింగ్ ట్విస్ట్.. AI సాయంతో ముగ్గురిని లేపేశాడు!

Bengaluru Crime: “ప్రతి నేరం వెనకా ఒక మాస్టర్‌మైండ్ ఉంటాడు.. కానీ...