11
September, 2026

A News 365Times Venture

11
Friday
September, 2026

A News 365Times Venture

Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు

Date:

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. SIR ప్రక్రియలో ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించడంపై వచ్చిన ఫిర్యాదులను వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి 110 శాతం పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. గుజరాత్‌లో రెండు రోజుల పర్యటనలో ఉన్న జ్ఞానేశ్ కుమార్.. గురువారం అహ్మదాబాద్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా SIR, ఓటర్ల జాబితా, ఎన్నికల వ్యవస్థ, ఈవీఎంలపై పలు అంశాలపై స్పందించారు.

‘110 శాతం పరిష్కరిస్తాం’

SIR ప్రక్రియలో వేలాది ఫిర్యాదులు వస్తే వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి వాటిని పరిష్కరించగలరా? అని ప్రశ్నించగా.. “110 శాతం” అని జ్ఞానేశ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. SIR ప్రక్రియ గతంలో కూడా 2003-04లో నిర్వహించినట్లు తెలిపారు. ఓటర్ల జాబితాలో గైర్హాజరైన వారు, వేరే ప్రాంతాలకు వెళ్లిపోయిన వారు, మరణించిన వారు, డూప్లికేట్ ఓటర్లు, విదేశీయుల పేర్లను తొలగించి జాబితాను ప్రక్షాళన చేయడమే తమ ప్రధాన ఉద్దేశమని చెప్పారు.

పౌరసత్వానికి పత్రాలే ఆధారం

విదేశీయుల అంశంలో ఎన్నికల సంఘం పత్రాల ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటుందని జ్ఞానేశ్ కుమార్ తెలిపారు. భారతీయులమని నిరూపించుకోవడానికి సంబంధిత పత్రాలు లేదా తల్లిదండ్రుల పత్రాలు సమర్పించాల్సి ఉంటుందని చెప్పారు. అర్హతకు సంబంధించిన విషయంలో ప్రధానంగా రెండు పరిస్థితులు ఉండొచ్చని అన్నారు. ఒకరికి అవసరమైన పత్రాలు లేకపోవడం లేదా వారు విదేశీయులు కావడం వంటి అంశాలను పరిశీలించాల్సి ఉంటుందని వివరించారు.

పేరు లేకపోతే ఏం చేయాలి?

ఓటర్ల జాబితాలో పేరు లేకపోతే సంబంధిత వ్యక్తి SDM (సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్) ను సంప్రదించి ఫిర్యాదు చేయవచ్చని CEC తెలిపారు. అక్కడ ఫిర్యాదు తిరస్కరణకు గురైతే జిల్లా కలెక్టర్ దగ్గర అప్పీల్ చేసుకోవచ్చని చెప్పారు. ఆ తర్వాత రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ దగ్గర రెండో అప్పీల్ చేసుకునే అవకాశం ఉందని, అవసరమైతే చివరికి కోర్టును కూడా ఆశ్రయించవచ్చని వివరించారు. ఇప్పటికే సుమారు 12 రాష్ట్రాల్లో SIR ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో పేర్ల తొలగింపుపై ఒక్క అప్పీల్ కూడా రాలేదని జ్ఞానేశ్ కుమార్ పేర్కొన్నారు. ఈ ప్రక్రియను తాను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తున్నానని తెలిపారు.

విమర్శలను స్వీకరించాల్సిందే..

ఎన్నికల సంఘంపై వస్తున్న తీవ్ర విమర్శలపై కూడా CEC స్పందించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ విమర్శించే హక్కు ఉందని అన్నారు. “ప్రతిరోజూ వచ్చే విమర్శలను స్వీకరించేందుకు మనం మరింత బలమైన భుజాలను కలిగి ఉండాలి” అని వ్యాఖ్యానించారు. ఎన్నికల సంఘంపై విమర్శలకు ఏదైనా పరిమితి విధించాలా? అనే ప్రశ్నకు.. దానికి గీత గీయడం సాధ్యం కాదని చెప్పారు. ఎన్ని గీతలు గీసినా వాటిని ఎవరైనా దాటుతారని, విమర్శలను స్వీకరించడంలో తప్పేమీ లేదని అన్నారు.

ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికలు

భారత్‌ ఎన్నికల వ్యవస్థ అత్యంత విస్తృతమైన, పారదర్శకమైన వ్యవస్థ అని జ్ఞానేశ్ కుమార్ పేర్కొన్నారు. రాజ్యాంగం, ఎన్నికల చట్టాలు, ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సుమారు 90 కోట్ల మంది ఓటర్లతో లోక్‌సభ ఎన్నికలను నిర్వహించడం ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల ప్రక్రియ అని చెప్పారు. సాధారణ ఎన్నికల సమయంలో సుమారు 1.8 కోట్ల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటారని తెలిపారు. ఓటర్ల జాబితా తయారీ నుంచి పోలింగ్, ఓట్ల లెక్కింపు వరకు వివిధ దశల్లో రాజకీయ పార్టీలు, అభ్యర్థుల ప్రతినిధులు పాల్గొనడం భారత ఎన్నికల వ్యవస్థ ప్రత్యేకత అని ఆయన పేర్కొన్నారు.

EVMలను హ్యాక్ చేయడం సాధ్యం కాదు

EVMలపై ప్రశ్నకు కూడా CEC స్పందించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు కాలిక్యులేటర్ల మాదిరిగా పనిచేస్తాయని, అవి ఇంటర్నెట్, వై-ఫై లేదా బ్లూటూత్‌కు అనుసంధానం కావని తెలిపారు. అందువల్ల వాటిని హ్యాక్ చేయడం సాధ్యం కాదని జ్ఞానేశ్ కుమార్ స్పష్టం చేశారు.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Raghav Chadha: ఆప్ నా “ఎక్స్-గర్ల్‌ఫ్రెండ్”.. రాఘవ్ చద్దా ఫైర్..

Raghav Chadha: రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)పై...

Osama Bin Laden: రేపటితో 9/11 ఘటనకి 25 ఏళ్లు.. బిన్‌ లాడెన్ ఎలా హతమయ్యాడు.. కుటుంబం ఎక్కడుంది?

2001 సెప్టెంబర్ 11, అమెరికన్ల జీవితాల్లో ఒక పీడకల. అంతేకాదు ప్రపంచమంతా...

IndiGo Flight: టిష్యూ పేపర్‌పై ‘బాంబు’ బెదిరింపు.. అహ్మదాబాద్‌లో ఇండిగో ఎమర్జెన్సీ ల్యాండింగ్

లక్నో నుంచి దమ్మామ్ వెళ్తున్న ఇండిగో విమానంలో కలకలం రేగింది. విమానంలో...

Russia Aircraft Deal: భారత్‌కు రష్యా బిగ్ ఆఫర్.. 105 విమానాలు, దేశంలోనే SJ-100 తయారీ!

Russia Aircraft Deal: భారత్‌కు రష్యా బంపర్ ఆఫర్ ఇచ్చింది. భారత...