11
September, 2026

A News 365Times Venture

11
Friday
September, 2026

A News 365Times Venture

IndiGo Flight: టిష్యూ పేపర్‌పై ‘బాంబు’ బెదిరింపు.. అహ్మదాబాద్‌లో ఇండిగో ఎమర్జెన్సీ ల్యాండింగ్

Date:

లక్నో నుంచి దమ్మామ్ వెళ్తున్న ఇండిగో విమానంలో కలకలం రేగింది. విమానంలో ‘బాంబు’ అని రాసి ఉన్న టిష్యూ పేపర్ కనిపించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో విమానాన్ని అహ్మదాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. గురువారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ఘటనపై పోలీసులు, విమానాశ్రయ భద్రతా సిబ్బంది, బాంబ్ స్క్వాడ్ సహా పలు దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టాయి.

133 మందితో అహ్మదాబాద్‌లో ల్యాండింగ్

లక్నో-దమ్మామ్ మార్గంలో ప్రయాణిస్తున్న ఇండిగో విమానం గురువారం సాయంత్రం సుమారు 5:55 గంటలకు అహ్మదాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. విమానంలో సిబ్బందితో కలిపి మొత్తం 133 మంది ఉన్నారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ అనంతరం ప్రయాణికులందరినీ సురక్షితంగా విమానం నుంచి దించేశారు. విమానంలో ‘BOMB’ అనే పదం ఉన్న టిష్యూ పేపర్ కనిపించడంతోనే అత్యవసర ల్యాండింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయడానికి గల పూర్తి కారణం ఇంకా అధికారికంగా నిర్ధారించలేదని పోలీసులు తెలిపారు.

టిష్యూపై రాసింది ఎవరో తేల్చేందుకు..

ఘటనపై దర్యాప్తులో భాగంగా ప్రయాణికుల నుంచి హ్యాండ్‌రైటింగ్ శాంపిల్స్ సేకరిస్తున్నారు. ప్రయాణికులను టిష్యూ పేపర్‌పై రాయమని కోరుతున్నట్లు పోలీసులు తెలిపారు. విమానంలో లభించిన ‘BOMB’ సందేశంతో వారి చేతిరాతను పోల్చి చూసే ప్రయత్నం చేస్తున్నారు. విమానాశ్రయ భద్రతా సిబ్బంది, ఫైర్ సిబ్బంది, బాంబ్ స్క్వాడ్ సహా పలు విభాగాలు ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. ఈ సందేశం ఎవరు రాశారు? అది నిజమైన బాంబు బెదిరింపా? లేక ఆకతాయి చర్యా? అనే అంశాలపై అధికారులు దృష్టి సారించారు.

10 రోజుల్లో రెండో ఎమర్జెన్సీ ల్యాండింగ్

అహ్మదాబాద్ విమానాశ్రయంలో 10 రోజుల వ్యవధిలోనే ఇది రెండో అత్యవసర ల్యాండింగ్ ఘటన కావడం గమనార్హం. గతంలో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం కూడా అహ్మదాబాద్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఆ ఘటనకు సంబంధించిన దర్యాప్తులో ఓ సిబ్బంది పేరుపై కూడా చర్చ జరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇండిగో విమానంలో లభించిన ‘BOMB’ సందేశం వెనుక అసలు కారణాన్ని గుర్తించేందుకు దర్యాప్తు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Raghav Chadha: ఆప్ నా “ఎక్స్-గర్ల్‌ఫ్రెండ్”.. రాఘవ్ చద్దా ఫైర్..

Raghav Chadha: రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)పై...

Osama Bin Laden: రేపటితో 9/11 ఘటనకి 25 ఏళ్లు.. బిన్‌ లాడెన్ ఎలా హతమయ్యాడు.. కుటుంబం ఎక్కడుంది?

2001 సెప్టెంబర్ 11, అమెరికన్ల జీవితాల్లో ఒక పీడకల. అంతేకాదు ప్రపంచమంతా...

Russia Aircraft Deal: భారత్‌కు రష్యా బిగ్ ఆఫర్.. 105 విమానాలు, దేశంలోనే SJ-100 తయారీ!

Russia Aircraft Deal: భారత్‌కు రష్యా బంపర్ ఆఫర్ ఇచ్చింది. భారత...

Maharashtra: నాందేడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు-టాటా మ్యాజిక్‌ ఢీ.. 9 మంది మృతి

మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న ట్రక్కు.....