24
October, 2026

A News 365Times Venture

24
Saturday
October, 2026

A News 365Times Venture

Flying Car: ఇంజినీరింగ్ డిగ్రీ లేదు..13 ఏళ్ల కష్టంతో ‘‘ఫ్లయింగ్ కార్’’ తయారీ..

Date:

Flying Car: ప్రతిభకు చదువుతో సంబంధం లేదని మరోసారి నిరూపితమైంది. ఇంజనీరింగ్ డిగ్రీ లేదు, కేవలం BA చదువుతో ఉత్తరాఖండ్‌కు చెందిన రవి తమ్తా ‘‘ఫ్లయింగ్ కార్’’ను తయారు చేశారు. ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కార్ ప్రోటో టైప్ తయారు కావడానికి 13 ఏళ్ల కష్టం ఉంది. ఇన్ని సంవత్సరాలు ఆన్‌లైన్‌లో నేర్చుకుంటూ, ప్రయోగాలు చేస్తూ చివరకు విజ.యం సాధించారు. అల్మోరా జిల్లాకు చెందిన ఆయన తయారు చేసిన సింగిల్ సీటర్ HAPIDA SKYNeX ఆగస్టులో టెస్ట్ ఫ్లైట్ పూర్తి చేసింది.

ప్రయాణ కష్టాలే స్పూర్తిగా..

బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (BA) డిగ్రీ పొందిన రవి తమ్తాకు అధికారికంగా సైన్స్ లేదా ఇంజినీరింగ్ విద్యలో శిక్షణ లేదు. ఇంటర్నెట్‌లో లభించిన సమాచారం, నిరంతర ప్రయోగాలు, కుటుంబ సభ్యుల సహకారంతో ఫ్లయింగ్ వెహికల్‌ను అభివృద్ధి చేశారు. ఉత్తరాఖండ్‌లోని జాగేశ్వర్ ధామ్ సమీపంలోని కఫ్లీఖాన్ గ్రామానికి చెందిన రవి తమ్తాకు కొండ ప్రాంతాల్లో ప్రయాణ కష్టాలే ప్రేరణగా నిలిచాయి. ముఖ్యంగా ఆస్పత్రులకు వెళ్లాంటే ఘాట్ రోడ్డులో గంటల కొద్దీ ప్రయాణించాల్సిన పరిస్థితుల్లో రవి ఆలోచనకు బీజం వేసేలా చేశాయి. 2015లో ఫ్లయింగ్ కార్ తయారు చేయాలనే ఆలోచనకు శ్రీకారం చుట్టారు. తన సంస్థ ‘‘హాపిడా స్కై ప్రైవేట్ లిమిటెడ్’’ ద్వారా ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేశారు.

రన్ వే లేకుండా టేకాఫ్ , ల్యాండింగ్..

ఈ ఫ్లయింగ్ కార్ నిలువుగా పైకి ఎగిరి, నిలువుగా కిందకు దిగేలా రూపొందించారు. దీనికి ప్రత్యేకంగా ఎలాంటి రన్ వే అవసరం లేదు. దీంట్లో ఎలక్ట్రిక్ మోటార్లు, ప్రొపెల్లర్లు నింగిలోకి ఎగిరేలా శక్తిని ఇస్తాయి. ఈ ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కారు మల్టీరోలర్ డ్రోన్ల టెక్నాలజీని పోలి ఉంటుంది. తేలికపాటి ఫ్రేమ్, ఒకరే కూర్చునే కాక్‌పిట్, బ్యాటరీతో పనిచేస్తుంది.

ఒక్క ఫ్లయింగ్ కారే కాదు..

రవి తమ్తా కేవలం ఫ్లైయింగ్ కారును మాత్రమే తయారు చేయలేదు. మొబైల్ ఫోన్‌ను ఛార్జ్ చేసే షూలు, దృష్టిలోపం ఉన్నవారికి ఉపయోగపడే స్మార్ట్ వాకింగ్ స్టిక్, వెదురును చీల్చే యంత్రం, మొబైల్ ఛార్జింగ్ కోసం ప్రత్యేక కర్ర, అగ్నిమాపక పరికరాలను తయారు చేశారు.

మరిన్ని పరీక్షలు అవసరం..

తక్కువ దూరం దూరాల కోసం, అత్యవసర వైద్య సేవల కోసం ఫ్లయింగ్ కార్‌ను ఉపయోగించాలనేది ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం. దీనిని వినియోగించాలనే మరిన్ని సాంకేతిక పరీక్షలు, భద్రతా ధ్రువీకరణలు, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) నుంచి అవసరమైన అనుమతులు పొందాల్సి ఉంది.

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

CM Revanth Reddy : జూలై నాటికి కరువు తీవ్రం.. నష్టపోవద్దంటూ రైతులకు రేవంత్ హెచ్చరిక

రాష్ట్రంలో రాబోయే రోజుల్లో కరువు పరిస్థితులు తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని,...

Vaibhav Sooryavanshi: న్యూజిలాండ్ గడ్డపై వైభవ్ అరుదైన ఘనత.. సచిన్‌తోపాటు పాక్, బంగ్లా ఆటగాళ్ల రికార్డులు బ్రేక్..

Vaibhav Sooryavanshi: న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా యువ...

CM Revanth Reddy : విద్యుత్ కొరత వేళ సీఎం కీలక ఆదేశాలు.. నేతలకు పల్లెబాట పిలుపు

సన్న వడ్లు సాగు చేయాలని తాము ముందే చెప్పినప్పటికీ, బీఆర్ఎస్ నేతలు...

India-China Border: భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత.. విదేశాంగ శాఖ కీలక ప్రకటన.!

India-China Border: అరుణాచల్ ప్రదేశ్‌లో భారత్‌-చైనా వాస్తవ నియంత్రణ రేఖ (LAC)...