24
October, 2026

A News 365Times Venture

24
Saturday
October, 2026

A News 365Times Venture

Vaibhav Sooryavanshi: న్యూజిలాండ్ గడ్డపై వైభవ్ అరుదైన ఘనత.. సచిన్‌తోపాటు పాక్, బంగ్లా ఆటగాళ్ల రికార్డులు బ్రేక్..

Date:

Vaibhav Sooryavanshi: న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం చేయడంతోనే సరికొత్త చరిత్ర సృష్టించాడు. కేవలం 15 సంవత్సరాల 211 రోజుల వ్రయస్సులోనే న్యూజిలాండ్ గడ్డపై అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడిన అతి పిన్న వయస్కుడిగా రికార్డులకెక్కాడు. ఈ అరుదైన ఘనత సాధించడం ద్వారా వైభవ్ బంగ్లాదేశ్, పాకిస్థాన్ ఆటగాళ్ల రికార్డులను వెనక్కి నెట్టాడు. ఇప్పటివరకు ఈ రికార్డు బంగ్లాదేశ్ ఆటగాడు మొహమ్మద్ షరీఫ్ పేరిట ఉండేది. అతడు డిసెంబర్ 18, 2001న 16 సంవత్సరాల 6 రోజుల వయసులో హామిల్టన్‌లో టెస్ట్ మ్యాచ్ ఆడారు. అలాగే పాకిస్థాన్‌కు చెందిన ఆకిబ్ జావేద్ 16 సంవత్సరాల 185 రోజుల వయసులో ఈ జాబితాలో చేరారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 16 సంవత్సరాల 284 రోజుల వయసులో ఈ మైలురాయిని చేరుకున్నారు.

ఇక, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. టాస్ సమయంలో కెప్టెన్ శ్రేయస్ మాట్లాడుతూ.. వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ గాయపడటంతో అతడి స్థానంలో వైభవ్ సూర్యవంశీకి ప్లేయింగ్ ఎలెవన్‌లో అవకాశం ఇచ్చినట్లు తెలిపాడు. అంతేకాకుండా వైభవ్ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడని వెల్లడించాడు. ఇక మయంక్ స్థానంలో ప్రిన్స్ యాదవ్‌కు జట్టులో చోటు దక్కిందని, ఇది కేవలం వ్యూహాత్మక మార్పు మాత్రమేనని కెప్టెన్ స్పష్టం చేశాడు.

టీమిండియా ప్లేయింగ్ XI: అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), వైభవ్ సూర్యవంశీ, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, నమన్ ధీర్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్ , అర్ష్దీప్ సింగ్ మరియు ప్రిన్స్ యాదవ్.

న్యూజిలాండ్ తుది జట్టు: ఫిన్ అలెన్, టిమ్ సీఫెర్ట్ (వికెట్ కీపర్), డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, బెవాన్ జాకబ్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), నాథన్ స్మిత్, జాకబ్ డఫీ, మాట్ హెన్రీ మరియు లాకీ ఫెర్గూసన్.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

CM Revanth Reddy : విద్యుత్ కొరత వేళ సీఎం కీలక ఆదేశాలు.. నేతలకు పల్లెబాట పిలుపు

సన్న వడ్లు సాగు చేయాలని తాము ముందే చెప్పినప్పటికీ, బీఆర్ఎస్ నేతలు...

India-China Border: భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత.. విదేశాంగ శాఖ కీలక ప్రకటన.!

India-China Border: అరుణాచల్ ప్రదేశ్‌లో భారత్‌-చైనా వాస్తవ నియంత్రణ రేఖ (LAC)...

OTR: తెలంగాణ బీజేపీలో ఆ నేతలెవరు?

OTR: వాళ్ళ పేరు పక్కన… స్టేట్‌ తెలంగాణ అని ఉందిగానీ…. ఇక్కడి...