24
October, 2026

A News 365Times Venture

24
Saturday
October, 2026

A News 365Times Venture

India-China Border: భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత.. విదేశాంగ శాఖ కీలక ప్రకటన.!

Date:

India-China Border: అరుణాచల్ ప్రదేశ్‌లో భారత్‌-చైనా వాస్తవ నియంత్రణ రేఖ (LAC) వెంబడి ఉద్రిక్తత కొనసాగుతోందని ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) డైరెక్టర్ జనరల్ శత్రుజీత్ సింగ్ కపూర్ చేసిన వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రిత్వ శాఖ(MEA) స్పందించింది. చైనా సైనికులు గతంలో అంగీకరించిన గస్తీ విధానాల నుంచి తప్పుకున్నప్పుడు సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితులు అప్పుడప్పుడు ఉద్రిక్తంగా మారుతున్నయని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.

సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, స్థిరత్వాన్ని కాపాడుకునేందుకు భారత్-చైనా ద్వైపాక్షిక సంబంధాలు అత్యంత అవసరమని ఆయన స్పష్టం చేశారు. ఎల్ఏసీ వెంబడి ఉన్న సమస్యల్ని పరిష్కరించుకోవడానికి, అపార్థాలను, తప్పుడు అంచనాలను నివారించేందుకు ఇరు దేశాలు ఇప్పటికే ఉన్న దౌత్య, సైనిక వ్యవస్థల ద్వారా చర్చలు కనొసాగిస్తున్నట్లు వివరించారు. ఇదే సమయంలో అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా సైనికులతో ఘర్షణ పరిస్థితులు కొనసాగుతున్నాయన్న ఐటీబీపీ డీజీ వ్యాఖ్యలపై మరింత సమాచారం కోరగా సంబంధిత వివరాల కోసం రక్షణ మంత్రిత్వ శాఖను సంప్రదించాలని జైస్వాల్ సూచించారు. సరిహద్దు నిర్వహణను మెరుగుపరిచేందుకు LACపై ఇరు దేశాల అవగాహనను పెంచే మార్గాలపై చర్చించేందుకు భారత్‌, చైనా అంగీకరించాయని తెలిపారు.

రాజస్థాన్ అల్వార్‌లో గురువారం జరిగిన కార్యక్రమంలో ఐటీబీపీ డీజీ శత్రుజీత్ సింగ్ కపూర్ మాట్లాడుతూ.. సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా సామర్థ్యాలను పెంచేందుకు అన్ని సరిహద్దు యూనిట్లలో డ్రోన్ ఫ్లాటూన్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గల్వాన్ వంటి పరిస్థితులను మరింత సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కొత్త స్ట్రైక్ శిక్షణ కోర్సుల్ని రూపొందించినట్లు పేర్కొన్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

OTR: తెలంగాణ బీజేపీలో ఆ నేతలెవరు?

OTR: వాళ్ళ పేరు పక్కన… స్టేట్‌ తెలంగాణ అని ఉందిగానీ…. ఇక్కడి...

OTR: కూటమి కంచుకోటలో అలజడి రేగుతోందా

OTR: కూటమి కంచుకోటలో అలజడి రేగుతోందా? మున్సిపల్‌ కార్పొరేషన్‌ సీట్ల సర్దుబాటు...

Anti-SIR Protest: నేహా బోరాకు ఢిల్లీ హైకోర్టు షాక్..

Anti-SIR Protest: ఆల్ ఇండియా స్టూడెంట్ యూనియన్(AISA) అధ్యక్షురాలు నేహా బోరాకు...