26
September, 2026

A News 365Times Venture

26
Saturday
September, 2026

A News 365Times Venture

Ethanol Car: పెట్రోల్‌తో పని లేదు.. 100 శాతం ఇథనాల్‌తో నడిచే కారు.. అక్టోబర్‌లోనే లాంచ్..

Date:

భోపాల్‌లో నిర్వహించిన ఒక రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు. దేశంలో ఈ-20 ఇంధన వాడకంపై చర్చ జరుగుతున్న తరుణంలో.. వంద శాతం ఇథనాల్‌తో నడిచే ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజిన్ వాహనాలను భారత్‌లో త్వరలోనే ప్రవేశపెట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే దీనిలో ముఖ్యంగా ఇథనాల్ తో నడిచే టయోటా ఇన్నోవా కారును అక్టోబర్‌లో లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కారు రన్నింగ్ సమయంలో విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుందని గడ్కరీ పేర్కొన్నారు.

ఈ సరికొత్త విధానం ద్వారా దేశంలో ఇంధన దిగుమతి ఖర్చులు భారీగా తగ్గడంతో పాటు, కాలుష్యం అదుపులోకి వస్తుందని, రైతుల ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. దేశంలోని రైతులు ఇకపై మొక్కజొన్నల ద్వారా ఇథనాల్‌ను ఉత్పత్తి చేస్తారని, దీనివల్ల అన్నదాతలు కేవలం ఆహార ఉత్పత్తిదారులుగానే కాకుండా ఇంధనం అందించే దాతలుగా మారుతున్నారని గడ్కరీ కొనియాడారు.

ప్రస్తుతం భారత్ ఏటా సుమారు రూ. 22 లక్షల కోట్ల విలువైన పెట్రోల్, డీజిల్, గ్యాస్‌ను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోందని ఆయన తెలిపారు. 2022లో ప్రవేశపెట్టిన ఇథనాల్ కలిపిన ఇంధనాన్ని ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు నాలుగు కోట్ల నాలుగు చక్రాల వాహనాలు, 20 కోట్ల రెండు చక్రాల వాహనాలు వాడుతున్నాయని వెల్లడించారు. ఇదే వేడుకలో మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ముఖ్యమంత్రి సుగమ్ రవాణా సేవ, పీఎం ఈ-బస్ సేవలను నితిన్ గడ్కరీ ప్రారంభించారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, రవాణా మంత్రి ఉదయ్ ప్రతాప్ సింగ్‌లతో కలిసి ఏడు నగరాల కోసం 351 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్రంలో సుమారు 21 సంవత్సరాల తర్వాత తిరిగి ప్రభుత్వ రవాణా సేవలు అందుబాటులోకి రావడం విశేషం.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మాట్లాడుతూ.. ప్రజా సేవ పట్ల ప్రభుత్వ నిబద్ధతకు ఈ ప్రారంభోత్సవం ఒక కొత్త అధ్యాయం అని అన్నారు. మారుమూల గిరిజన ప్రాంతాల ప్రజలకు కూడా ఈ ప్రజా రవాణా సేవలు ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయని తెలిపారు. పేదలు, మధ్యతరగతి ప్రజల కోసం అత్యాధునిక రవాణా సౌకర్యాలను తీసుకువచ్చినట్లు చెప్పారు. ఈ కొత్త బస్సుల్లో సీసీటీవీ కెమెరాలు, పానిక్ బటన్లు, అత్యవసర ద్వారాలు, జీపీఎస్ మానిటరింగ్, ఆన్‌లైన్ టికెటింగ్ వంటి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు ఉన్నాయని తెలిపారు. రవాణా మంత్రి ఉదయ్ ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ.. రెండు దశాబ్దాల తర్వాత పునరుద్ధరించబడిన ఈ సేవలు ప్రజలకు రవాణాను మరింత సురక్షితంగా, ఆధునికంగా మారుస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

World Cup 2027: వన్డే వరల్డ్ కప్ 2027పై గంభీర్ మాస్టర్ ప్లాన్.. హార్దిక్, బుమ్రా కష్టమే..!

భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ 2027 వన్డే...

Houthi War: సౌదీకి పాకిస్తాన్ దూరం.. అండగా నిలుస్తున్న ఫ్రాన్స్!

Houthi War: యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాకు చుక్కలు చూపిస్తున్నారు....

Bill Gates: ఏఐతో బిలియన్ మంది ప్రాణాలు పోయే ప్రమాదం! బిల్ గేట్స్ తీవ్ర హెచ్చరిక

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ రోజురోజుకూ మరింత శక్తివంతంగా మారుతున్న నేపథ్యంలో...

Jaishankar: జైశంకర్ మళ్లీ వేసేశాడు.. పాక్ జర్నలిస్ట్‌కు ఘాటు కౌంటర్!

Jaishankar: భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో...