26
September, 2026

A News 365Times Venture

26
Saturday
September, 2026

A News 365Times Venture

Houthi War: సౌదీకి పాకిస్తాన్ దూరం.. అండగా నిలుస్తున్న ఫ్రాన్స్!

Date:

Houthi War: యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాకు చుక్కలు చూపిస్తున్నారు. వరసగా సౌదీ పట్టణాలు, ఆయిల్ మౌలిక సదుపాయాలపై దాడులకు తెగబడుతున్నారు. మరోవైపు, తన రక్షణ కోసం ఏర్పాటు చేసుకున్న ‘‘సౌదీ అరేబియా-పాకిస్తాన్-టర్కీ’’ల ‘‘మక్కా జాయింట్ అగ్రిమెంట్’’ సహాయపడటం లేదు. సౌదీ దాడులకు గురవుతున్నా కేవలం పాకిస్తాన్ మాటలకు మాత్రమే పరిమితమైంది.

అండగా నిలుస్తున్న ఫ్రాన్స్..

ఇదిలా ఉంటే, కష్టకాలంలో సౌదీ అరేబియాకు ఫ్రాన్స్ అండగా నిలుస్తోంది. మక్కా కూటమి, అమెరికా దూరంగా ఉన్న ఈ సమయంలో ఫ్రాన్స్ సైనిక సహాయాన్ని ప్రకటించింది. తమ దేశ సైనికులు, రాడార్లు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ పంపనున్నట్లు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్ తెలిపారు. హౌతీలోత ప్రత్యక్ష పోరాటంలో పాల్గొనడం ఫ్రాన్స్ లక్ష్యం కాదని, సౌదీ అరేబియా ఇంధన మౌలిక సదుపాయాలను రక్షించడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

యాన్బు రక్షణకే మొదటి ప్రాధాన్యం..

యాన్బును రక్షించడమే తమ ప్రాధాన్యమని ఫ్రాన్స్ అధ్యక్షుడు చెప్పారు. యాన్బు సౌదీఅరేబియాలోని కీలక ఓడరేవు. సౌదీ ఇంధన వ్యవస్థలో అత్యంత కీలకమైంది. ఎర్ర సముద్రం ఒడ్డున ఉన్న ఈ నగరంలో పెద్ద చమురు నిల్వ, చమురు శుద్ది కర్మాగారాలు ఉన్నాయి. తూర్పు-పశ్చిమ పైప్‌లైన్ కూడా ఇక్కడే అనుసంధానించబడి ఉంటుంది. ఈ పైప్‌లైన్ పర్షియన్ గల్ఫ్, హార్ముజ్ జలసంధికి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతోంది. ఎర్ర సముద్రం మీదుగా తన చమురును ప్రపంచ దేశాలకు పంపుతోంది. ఈ పైప్ లైన్ సామర్థ్యం రోజుకు 7 మిలియన్ బ్యారెళ్లు. యాన్బును లక్ష్యంగా చేసుకుని హౌతీలు దాడుకలు ప్రయత్నిస్తున్నారు.

టర్కీ, పాక్ తీరుతో సౌదీ అసంతృప్తి..

తమకు ఎంతో అండగా నిలుస్తాయని భావించిన పాక్, టర్కీలు ఆపద సమయంలో సౌదీకి దెబ్బేశాయి. ఈ రెండు దేశాలు ఇప్పటి వరకు మాటలకు మాత్రమే పరిమితమయ్యాయి. ప్రత్యక్షంగా సైనిక సహాయాన్ని చేయలేదు. హౌతీల దాడుల తర్వాత మూడు దేశాల విదేశాంగ మంత్రులు, సైనిక అధిపతుల మధ్య చర్చలు జరిగినా కూడా పెద్దగా సౌదీకి ఒరిగింది ఏమీ లేదు. ఈ సమయంలోనే తమకు మద్దతుగా హౌతీలపై దాడులు చేయాలని సౌదీ అమెరికాను కోరింది. సౌదీ కోరికను అమెరికా పట్టించుకోలేదు. ఇలాంటి క్లిష్ట సమయంలో ఎంతో కొంత ఫ్రాన్స్ అండగా నిలుస్తోంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Bill Gates: ఏఐతో బిలియన్ మంది ప్రాణాలు పోయే ప్రమాదం! బిల్ గేట్స్ తీవ్ర హెచ్చరిక

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ రోజురోజుకూ మరింత శక్తివంతంగా మారుతున్న నేపథ్యంలో...

Jaishankar: జైశంకర్ మళ్లీ వేసేశాడు.. పాక్ జర్నలిస్ట్‌కు ఘాటు కౌంటర్!

Jaishankar: భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో...

New Scheme: NPS పెన్షన్‌లో ఇప్పుడు ఆరోగ్య బీమా కూడా.. ఫ్యామిలీ మొత్తానికి వర్తింపు.. అక్టోబర్ 1 నుంచే అమల్లోకి..

నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)లో కొత్తగా ‘NPS స్వాస్థ్య’ పేరుతో ఓ...

Trump-Jinping: ఇరాన్‌కు సాయపడడం భావ్యం కాదు.. జిన్‌పింగ్‌కు ట్రంప్ హితవు

అమెరికాలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పర్యటన కొనసాగుతోంది. ట్రంప్ దంపతులు దగ్గరుండి...