19
September, 2026

A News 365Times Venture

19
Saturday
September, 2026

A News 365Times Venture

CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..

Date:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలందరికీ సొంత ఇంటిని కల్పించాలనే లక్ష్యంతో ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఈ నెల 19వ తేదీన విశాఖపట్నంలో భారీఎత్తున ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా తన చేతుల మీదుగా అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను అందజేయనున్నారు. ఈ విడతలో విశాఖ నగర పరిధిలోని సుమారు 25,880 పేద కుటుంబాలకు శాశ్వత ప్రాతిపదికన ఇళ్ల స్థలాలు అందనున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికార యంత్రాంగం ఇప్పటికే పూర్తి చేసింది.

ఈ సంక్షేమ కార్యక్రమం విశాఖకే పరిమితం కాకుండా రాష్ట్రంలోని ఇతర ప్రధాన నగరాలకు కూడా విస్తరించనుంది. త్వరలోనే విజయవాడ నగరంలోనూ మరో 24 వేల పేద కుటుంబాలకు ఇళ్ల పట్టాలు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిర్ణయం తీసుకుంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ పారదర్శక పద్ధతిలో ఇళ్ల స్థలాలు దక్కేలా అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు, ఇళ్ల స్థలాలకు సంబంధించి ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న వివిధ సమస్యలను ప్రభుత్వం వేగంగా పరిష్కరిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే సుమారు 12 వేల ఇళ్ల స్థలాలను విజయవంతంగా క్రమబద్ధీకరించినట్లు రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు.

పేద ప్రజల సొంతింటి కల సాకారం చేయడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల స్థలాల పేరుతో జరిగిన నాన్చివేత ధోరణులకు స్వస్తి పలికి, అర్హులైన లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా త్వరితగతిన పట్టాలు అందజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలోని వేలాది నిరుపేద కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుందని, ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చొరవపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విశాఖలో జరగనున్న ఈ కార్యక్రమానికి స్థానిక అధికార వర్గాలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Mamata Banerjee: అభ్యర్థి ఔట్.. కాంగ్రెస్‌కు మమత మద్దతు: బెంగాల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్..

Mamata Banerjee:  పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో వరస ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. నందిగ్రామ్...

NSE IPO: రెండో రోజే NSE ఐపీఓ 100 శాతం సబ్‌స్క్రైబ్.. ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ ప్రక్రియ ప్రారంభమైన రెండో...

Online Shopping: ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..

ఆన్‌లైన్ షాపింగ్ చేసే వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం రాబోయే రోజుల్లో మరింత...

Tata Sons: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్‌‌కే.. లొల్లి తప్పదా?

టాటా గ్రూప్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా...