7
August, 2026

A News 365Times Venture

7
Friday
August, 2026

A News 365Times Venture

boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!

Date:

boltt Ace 5G, Evo 4G: దేశీయ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ boltt (Fire-boltt అనుబంధ సంస్థ) నుండి కొత్త స్మార్ట్‌ఫోన్‌లు Ace 5G, Evo 4G డిజైన్‌ను అధికారికంగా వెల్లడించింది. ప్రీమియం ఫ్లాగ్‌షిప్ ఫోన్లను తలపించే స్టైలిష్ లుక్‌తో రూపొందించిన ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు ఆగస్టు 25న భారత మార్కెట్లో లాంచ్ కానున్నాయి. ముఖ్యంగా 7.95 మిల్లీమీటర్ల అల్ట్రా-స్లిమ్ డిజైన్ ఈ ఫోన్ల ప్రధాన ఆకర్షణ.

boltt Ace 5G, Evo 4G స్మార్ట్‌ఫోన్‌లను కేవలం 7.95mm మందంతో రూపొందించారు. సన్నని డిజైన్ ఉన్నప్పటికీ బలమైన నిర్మాణాన్ని అందించేందుకు కంపెనీ ప్రత్యేక త్రి-లేయర్ ఆర్కిటెక్చర్ను ఉపయోగించింది. ఈ నిర్మాణంలో ఫ్రంట్ షెల్ (డిస్‌ప్లేను రక్షించే ముందు భాగం), మిడిల్ ఫ్రేమ్ (ఫోన్‌కు బలం, మన్నికను అందించేలా), రియర్ కవర్ (చేతిలో సౌకర్యవంతమైన గ్రిప్‌ను అందించే వెనుక ప్యానెల్) అనే మూడు భాగాలు ఉంటాయి. ఈ డిజైన్ వల్ల ఫోన్ తక్కువ బరువుతో పాటు ఎక్కువ మన్నికను కూడా అందిస్తుందని కంపెనీ తెలిపింది.

బోల్ట్ ఏస్ 5G ప్రత్యేక Wine Red కలర్‌లో, బోల్ట్ Evo 4G స్టైలిష్ ఆర్కిటిక్ వైట్ రంగుల్లో అందుబాటులోకి రానున్నాయి. సింపుల్, మినిమలిస్టిక్ డిజైన్‌తో పాటు ప్రీమియం ఫినిష్ ఈ ఫోన్లకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని కంపెనీ పేర్కొంది. బోల్ట్ ఇప్పటికే ఆగస్టు 25న స్మార్ట్‌ఫోన్‌లను అధికారికంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అయితే ప్రస్తుతం డిజైన్ మాత్రమే వెల్లడించగా, ప్రాసెసర్, కెమెరా, డిస్‌ప్లే, బ్యాటరీ, ధర, విక్రయ వివరాలు లాంచ్ ఈవెంట్‌లో ప్రకటించనుంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

YCP vs TDP: బెజవాడలో ఉద్రిక్తత.. వైసీపీ దీక్షా శిబిరం టెంట్ తొలగించిన టీడీపీ శ్రేణులు!

విజయవాడలో డీఎస్సీ-2025 నియామకాల వ్యవహారం రాజకీయంగా మరోసారి వేడెక్కింది. డీఎస్సీలో జరిగినట్లు...

AIIMS: మరో రెండు ఎయిమ్స్‌లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!

ఆంధ్రప్రదేశ్‌లో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను మరింత విస్తరించేందుకు రాష్ట్రానికి మరో...