28
September, 2026

A News 365Times Venture

28
Monday
September, 2026

A News 365Times Venture

Singareni Naini Coal Mine: సింగరేణి చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం.. నైనీ గని నుంచి తెలంగాణకు చేరిన తొలి బొగ్గు రైలు

Date:

Singareni Naini Coal Mine: తెలంగాణ రాష్ట్ర ఇంధన అవసరాలను తీర్చే దిశగా సింగరేణి చరిత్రలోనే ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ఏళ్ల తరబడి కాగితాలకే పరిమితమైన ఒడిశాలోని ‘నైనీ’ బొగ్గు బ్లాక్, ప్రజా ప్రభుత్వ చిత్తశుద్ధితో ఎట్టకేలకు కార్యరూపం దాల్చింది. రాష్ట్ర ప్రజల విద్యుత్ అవసరాలను తీర్చడమే లక్ష్యంగా ఒడిశాలోని నైనీ గని నుంచి తెలంగాణలోని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి తొలి బొగ్గు రైలు విజయవంతంగా చేరుకుంది. ఇది తెలంగాణ ఇంధన భద్రతలో ఒక అద్భుతమైన మైలురాయిగా నిలిచింది.

ఈ ప్రాజెక్టు విజయవంతం కావడం వెనుక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అలుపెరగని కృషి, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. అనుమతుల సాధనలో ఎదురైన ఎన్నో అడ్డంకులను పటాపంచలు చేస్తూ ఈ విజయాన్ని సొంతం చేసుకున్నారని పేర్కొంది. అనుమతుల కోసం భట్టి విక్రమార్క స్వయంగా రెండుసార్లు ఒడిశా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. 2024 జులైలో ఒడిశా ముఖ్యమంత్రి, ఉన్నతాధికారులతో సానుకూల వాతావరణంలో చర్చలు జరిపి, ఆటంకాలన్నీ తొలగించారని సర్కార్ స్పష్టం చేసింది. అనంతరం 2025 ఏప్రిల్ 16న నైనీ గనిలో బొగ్గు ఉత్పత్తిని వర్చువల్ విధానంలో డిప్యూటీ సీఎం ప్రారంభించారు.

ఆ శ్రమ ఫలితంగా నైనీ గని నుంచి బయలుదేరిన తొలి రైలు 1,131 కిలోమీటర్లు ప్రయాణించి తెలంగాణ గడ్డపైకి చేరుకుంది. 59 బాక్స్ వ్యాగన్ల ద్వారా ఏకంగా 4 వేల టన్నుల అత్యుత్తమ జీ-10 (G-10) గ్రేడ్ నాణ్యమైన బొగ్గు సింగరేణి థర్మల్ కేంద్రానికి చేరింది. కేంద్ర బొగ్గు శాఖ 2015 ఆగస్టు 13న సింగరేణికి కేటాయించిన ఈ నైనీ గని, మొత్తం 340.78 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ గని జీవితకాలం 36 సంవత్సరాలు కాగా, ఏడాదికి కోటి టన్నుల (10 మిలియన్ టన్నులు) ఉత్పత్తి సామర్థ్యంతో నడవనుంది. నైనీ నుంచి నాణ్యమైన బొగ్గు రాకతో తెలంగాణ విద్యుత్ ఉత్పత్తిలో ఇకపై ఎలాంటి ఆటంకాలు ఉండవని, భవిష్యత్తు తరాలకు నిరంతర ఉచిత, నాణ్యమైన విద్యుత్ అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని స్పష్టమవుతోంది. సింగరేణి కీర్తి కిరీటంలో ఈ నైనీ బొగ్గు గని మరో వజ్రంగా నిలిచిపోనుంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!

The Paradise Shankaranna: హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో...

AP Govt: ఏపీలో మున్సిపల్ కమిషనర్ల బదిలీ.. జీవో జారీ చేసిన ప్రభుత్వం..

ఏపీలో మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ...

CJP: కాక్రోచ్‌లంతా అస్సామేనా..? రాంకా అరెస్ట్.. దీప్కే కూడా అరెస్ట్ చేస్తారా?

CJP:  అస్సాంలో కాక్రోచ్ జనతా పార్టీ(CJP)కి భారీ ఎదురుదెబ్బ తాకింది. ఆ...

Rothit Sharma: రోహిత్ శర్మ కట్ అవుట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాల్సిందే డూడ్..

తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి వన్డే...