24
September, 2026

A News 365Times Venture

24
Thursday
September, 2026

A News 365Times Venture

AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!

Date:

AP Liquor Shops: ఆంధ్రప్రదేశ్‌లో 2026–27 ఎక్సైజ్ సంవత్సరానికి ఏ4 మద్యం షాపుల లైసెన్సుల రెన్యువల్ ప్రక్రియకు గడువు ముగిసింది. ఇకపై గడువు పొడిగించకూడదని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. రెన్యువల్ ప్రక్రియలో భాగంగా ఇవాళ అర్ధరాత్రి వరకు చెల్లింపులు చేసేందుకు అవకాశం కల్పించారు. గడువులోగా రెన్యువల్ రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ (RET) మొత్తాన్ని 100 శాతం చెల్లించిన షాపులను మాత్రమే రెన్యువల్‌కు పరిగణించనున్నారు.

3,650 షాపులు రెన్యువల్‌కు నోటిఫై
సెప్టెంబర్ 23 వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,650 ఏ4 మద్యం షాపులను రెన్యువల్‌కు నోటిఫై చేశారు. వీటిలో 3,236 షాపులు రెన్యువల్‌కు ముందుకు వచ్చాయి. మొత్తం 2,906 షాపులకు సంబంధించి చెల్లింపులు నమోదయ్యాయి. ఇందులో 2,873 షాపులు రెన్యువల్ RET మొత్తాన్ని పూర్తిగా చెల్లించగా, మరో 33 షాపులు పాక్షికంగా చెల్లింపులు చేశాయి. అయితే, రాష్ట్రవ్యాప్తంగా నోటిఫై చేసిన మొత్తం షాపుల్లో 88.7 శాతం రెన్యువల్‌కు దరఖాస్తు చేసుకున్నాయి. దాదాపు 80 శాతం షాపులకు సంబంధించి చెల్లింపులు నమోదయ్యాయి. చెల్లింపుల శాతంలో తూర్పుగోదావరి జిల్లా 97.1 శాతంతో ముందంజలో ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 94.7 శాతం, శ్రీ సత్యసాయి జిల్లాలో 91.8 శాతం, కోనసీమ జిల్లాలో 91.1 శాతం, ఏలూరు జిల్లాలో 91 శాతం చెల్లింపులు నమోదయ్యాయి. మరోవైపు గుంటూరు జిల్లాలో 64.5 శాతం, బాపట్ల జిల్లాలో 68.8 శాతం, విశాఖపట్నం జిల్లాలో 69 శాతం చెల్లింపులు నమోదయ్యాయి. ఇవాళ అర్ధరాత్రి వరకు రెన్యువల్ RETలో 100 శాతం చెల్లింపులు పూర్తి చేసిన షాపులను రెన్యువల్‌కు పరిగణించనున్నారు.

మిగిలిన షాపులకు తాజా దరఖాస్తులు
రెన్యువల్ ప్రక్రియ పూర్తయిన తర్వాత మిగిలిపోయే ఏ4 మద్యం షాపులతో పాటు ఇప్పటివరకు నోటిఫై చేయని ఏ4 షాపులకు తాజా దరఖాస్తుల ద్వారా లైసెన్సులు కేటాయించనున్నారు. ఇందుకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌ను రేపు విడుదల చేయనున్నట్లు ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. మరోవైపు.. తాజా దరఖాస్తుల సమర్పణకు అక్టోబర్ 1 అర్ధరాత్రి వరకు గడువు ఉంటుంది. అక్టోబర్ 2న దరఖాస్తులను పరిశీలిస్తారు. అనంతరం అక్టోబర్ 3న లాటరీ నిర్వహించి ఏ4 మద్యం షాపులను కేటాయించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ తదుపరి ప్రక్రియను కొనసాగించనుంది.

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Turkey-UN: టర్కీ బుద్ధి మారలేదు.. యూఎన్‌లో పాక్‌కు మద్దతుగా కాశ్మీర్ ప్రస్తావన

టర్కీ బుద్ధి మారలేదు. డీజిల్ కోసం భారత్‌పై ఆధారపడుతున్న టర్కీ.. మళ్లీ...

BJP: ‘‘ఓట్ చోరీ జరిగితే మేం ఎలా ఓడిపోయాం’’.. కాంగ్రెస్‌కు బీజేపీ కౌంటర్..

BJP: కేంద్రం ఎన్నికల సంఘంపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో బీజేపీ ప్రతిపక్షాలపై...

IP66+IP68+IP69 రేటింగ్స్‌, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!

OPPO Find X10: ఒప్పో (OPPO) నుండి ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ లైనప్‌లోకి...

Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..

జపాన్‌తో జరిగిన చారిత్రాత్మక తొలి పురుషుల టీ20 మ్యాచ్‌లో భారత్ తరఫున...