24
September, 2026

A News 365Times Venture

24
Thursday
September, 2026

A News 365Times Venture

IP66+IP68+IP69 రేటింగ్స్‌, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!

Date:

OPPO Find X10: ఒప్పో (OPPO) నుండి ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ లైనప్‌లోకి మరో రెండు కొత్త ఫోన్లను తీసుకొచ్చింది. OPPO Find X10, OPPO Find X10 E పేర్లతో ఈ రెండు మోడళ్లను అధికారికంగా ప్రకటించింది. అధిక సామర్థ్యం కలిగిన సిలికాన్-కార్బన్ బ్యాటరీలు, మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్లు, హ్యాస్‌ల్‌బ్లాడ్ ట్యూన్డ్ కెమెరాలు ఈ ఫోన్లలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

OPPO Find X10..

స్టాండర్డ్ Find X10లో MediaTek Dimensity 9600M ప్రాసెసర్‌ను అందించారు. 3nm ప్రాసెస్‌పై తయారైన ఈ చిప్‌సెట్ గరిష్ఠంగా 4.21GHz క్లాక్ స్పీడ్‌తో పనిచేస్తుంది. ఎక్కువసేపు గేమింగ్, ఇతర పనులు చేసినా ఫ్రేమ్‌రేట్లు స్థిరంగా ఉండేలా ఓపో కొత్త Tide Engineను ఉపయోగించింది. ఫోన్‌ ఆండ్రాయిడ్ 17 ఆధారిత ColorOS 17తో పనిచేస్తుంది. ఇందులో AI ఆధారిత ప్రొడక్టివిటీ టూల్స్‌, Fluid Cloudలో ట్రాన్సిట్ అరైవల్ రిమైండర్లు ఉన్నాయి.

ఇందులో 6.59 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లేను అందించారు. 2760×1256 పిక్సెల్‌ రిజల్యూషన్‌, 144Hz వరకు రిఫ్రెష్ రేట్‌, 2000 నిట్స్‌ పీక్ బ్రైట్‌నెస్‌, డాల్బీ విజన్‌ సపోర్ట్‌ ఉన్నాయి. 3840Hz హై-ఫ్రీక్వెన్సీ PWM డిమ్మింగ్‌తో పాటు కేవలం 1 నిట్‌ వరకు బ్రైట్‌నెస్‌ను తగ్గించుకునే సదుపాయం ఉంది. స్క్రీన్‌ చుట్టూ 0.99mm అల్ట్రా-నారో బెజెల్స్‌ను అందించారు.

కెమెరాల విషయానికి వస్తే Find X10లో హ్యాస్‌ల్‌బ్లాడ్ Ultra HD Original Camera సిస్టమ్‌ను అందించారు. ఇందులో 200MP మెయిన్ కెమెరా, 200MP పెరిస్కోప్ టెలిఫొటో కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. 200MP మెయిన్ కెమెరాకు 1/1.4 అంగుళాల సెన్సార్‌, ఎఫ్/1.6 అపెర్చర్‌, OIS సపోర్ట్‌ ఉన్నాయి. 200MP పెరిస్కోప్ కెమెరా 2.8x ఆప్టికల్ జూమ్‌, 1/1.56 అంగుళాల సెన్సార్‌, ఎఫ్/2.6 అపెర్చర్‌తో వస్తుంది.

అల్ట్రా-వైడ్ కెమెరా 120 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూను అందిస్తుంది. LUMO నేటివ్ లైట్ అండ్ షాడో ఇంజిన్ ద్వారా ఒక్క ఫ్రేమ్‌లో 17 స్టాప్స్ డైనమిక్ రేంజ్‌ను అందించేలా కెమెరా వ్యవస్థను రూపొందించారు. హ్యాస్‌ల్‌బ్లాడ్ పోర్ట్రెయిట్ మోడ్‌తో పాటు ప్రత్యేక టెలికన్వర్టర్ కిట్‌కు కూడా సపోర్ట్‌ ఉంది.

ఈ స్మార్ట్ ఫోన్ లో 8000mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీని ఉపయోగించారు. దీనికి 80W SuperVOOC వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌ సపోర్ట్‌ ఉన్నాయి. IP66, IP68, IP69 రేటింగ్స్‌తో నీరు, దుమ్ము నుంచి రక్షణ కల్పించారు. ఈ మొబైల్ 12GB+256GB వేరియంట్‌ ధర 5,499 యువాన్లు (సుమారు రూ.78,510)గా ఉంది. 12GB+512GB ధర 5,999 యువాన్లు (సుమారు రూ.85,650), 16GB+512GB ధర 6,499 యువాన్లు (సుమారు రూ.92,790), 16GB+1TB వేరియంట్‌ ధర 7,499 యువాన్లు (సుమారు రూ.1,07,070)గా నిర్ణయించారు.

OPPO Find X10 E..

Find X10తో పాటు ఓపో Find X10 Eని కూడా పరిచయం చేసింది ఒప్పో. ఫ్లాట్ ఫ్రేమ్ డిజైన్‌తో వచ్చిన ఈ ఫోన్‌ 6.59 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఐస్ బ్లూ, లైట్ టైటానియం రంగుల్లో లభిస్తుంది. ఈ ఫోన్‌లో MediaTek Dimensity 9500s 3nm ప్రాసెసర్‌ను ఉపయోగించారు. దీనికి 12GB/16GB LPDDR5X RAM, 256GB/512GB UFS 4.1 స్టోరేజ్‌ ఆప్షన్లు ఉన్నాయి. Android 17 ఆధారిత ColorOS 17తో పనిచేస్తుంది.

ఇందులో కెమెరాల విషయానికి వస్తే Find X10 Eలో వెనుకవైపు మూడు 50MP కెమెరాలు ఉన్నాయి. 1/1.4 అంగుళాల సెన్సార్‌, ఎఫ్/1.6 అపెర్చర్‌, OISతో 50MP మెయిన్ కెమెరా, 50MP టెలిఫొటో కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. హ్యాస్‌ల్‌బ్లాడ్ Natural Colors, Professional Portrait Mode, XPAN Mode వంటి ఫీచర్లు అందించారు. సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

Find X10 Eలో 7025mAh బ్యాటరీ ఉంది. దీనికి 80W SuperVOOC వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌ సపోర్ట్‌ ఉన్నాయి. 6.59 అంగుళాల 120Hz AMOLED డిస్‌ప్లే, 3840Hz PWM డిమ్మింగ్‌, డాల్బీ విజన్‌ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ ఫోన్‌ కూడా IP66, IP68, IP69 రేటింగ్స్‌తో వస్తుంది. చైనాలో OPPO Find X10 E 12GB+256GB వేరియంట్‌ ధర 4,999 యువాన్లు (సుమారు రూ.71,370)గా ఉంది. 16GB+512GB వేరియంట్‌ ధర 5,499 యువాన్లు (సుమారు రూ.78,510). ఇక రెండు ఫోన్ల అమ్మకాలు చైనాలో సెప్టెంబర్ 24 నుంచి ప్రారంభం కానున్నాయి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..

జపాన్‌తో జరిగిన చారిత్రాత్మక తొలి పురుషుల టీ20 మ్యాచ్‌లో భారత్ తరఫున...

AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు

AP Severe Depression Landfall: తీవ్ర వాయుగుండం ఆంధ్రప్రదేశ్‌ తీరాన్ని తాకడం...

Trump: ఒప్పందం కుదుర్చుకోండి.. లేదంటే నరకానికి పంపిస్తాం.. ప్రపంచ నేతల ముందు ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్

ఐక్యరాజ్యసమితి వేదికగా ఇరాన్‌కు ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఒప్పందం...

RBI New FD Rules: FD నిబంధనల్లో కీలక మార్పులు.. వడ్డీపై ప్రభావం ఎంత..?

RBI New FD Rules: ఇవాళ్టి పొదుపే.. రేపు మీకు తోడుగా...