24
September, 2026

A News 365Times Venture

24
Thursday
September, 2026

A News 365Times Venture

AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు

Date:

AP Severe Depression Landfall: తీవ్ర వాయుగుండం ఆంధ్రప్రదేశ్‌ తీరాన్ని తాకడం ప్రారంభించింది. కళింగపట్నానికి నైరుతి సమీపంలో ల్యాండ్‌ఫాల్ ప్రక్రియ ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు. మరో రెండు గంటల్లో తీవ్ర వాయుగుండం పూర్తిగా తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించారు. శ్రీకాకుళం తీరానికి తుపాన్‌ చేరువ కావడంతో తీర ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. తీవ్ర వాయుగుండం వజ్రపుకొత్తూరు–భోగాపురం మధ్య తీరం దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.. అయితే, కళింగపట్నానికి నైరుతి సమీపంలో ల్యాండ్‌ఫాల్ ప్రక్రియ స్టార్ట్‌ అయ్యింది.. తీర ప్రాంతాల్లో గంటకు 60–70 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో గాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా యంత్రాంగం సూచించింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు.

ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దు
తీవ్ర వాయుగుండం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా యంత్రాంగం కోరింది. ఇక, తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఇవాళ రాత్రి శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. విశాఖపట్నం జిల్లాలో కూడా భారీ వర్ష సూచనతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. విశాఖపట్నం ప్రాంతంలో గంటకు 60–75 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. భారీ వర్షాలు, బలమైన గాలుల నేపథ్యంలో ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

గుంటూరు, పల్నాడులో మోస్తరు వర్షాలు
రానున్న మూడు గంటల్లో గుంటూరు, పల్నాడు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఆయా ప్రాంతాల ప్రజలు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Trump: ఒప్పందం కుదుర్చుకోండి.. లేదంటే నరకానికి పంపిస్తాం.. ప్రపంచ నేతల ముందు ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్

ఐక్యరాజ్యసమితి వేదికగా ఇరాన్‌కు ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఒప్పందం...

RBI New FD Rules: FD నిబంధనల్లో కీలక మార్పులు.. వడ్డీపై ప్రభావం ఎంత..?

RBI New FD Rules: ఇవాళ్టి పొదుపే.. రేపు మీకు తోడుగా...

Trump: ‘మీరు ఇక్కడ ఉండకూడదు’.. యూఎన్‌లో ఓ రిపోర్టర్‌పై ట్రంప్ ఫైర్

ప్రస్తుతం అమెరికాలో ట్రంప్ వర్సెస్ మీడియా యుద్ధం సాగుతోంది. ఇప్పటికే కొన్ని...

Meloni: యూఎన్‌కు మెలోనీ దూరం.. ట్రంప్‌ను కలవడం ఇష్టం లేకనేనా?

ఐక్యరాజ్యసమితి వేదికగా ప్రపంచ నేతలంతా సమావేశం కాబోతున్నారు. నేతలంతా న్యూయార్క్‌కు తరలివెళ్తున్నారు....