23
September, 2026

A News 365Times Venture

23
Wednesday
September, 2026

A News 365Times Venture

Meloni: యూఎన్‌కు మెలోనీ దూరం.. ట్రంప్‌ను కలవడం ఇష్టం లేకనేనా?

Date:

ఐక్యరాజ్యసమితి వేదికగా ప్రపంచ నేతలంతా సమావేశం కాబోతున్నారు. నేతలంతా న్యూయార్క్‌కు తరలివెళ్తున్నారు. ఆశ్చర్యంగా అమెరికా మిత్ర దేశమైన ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మాత్రం వెళ్లలేదు. దీనికి ట్రంప్‌తో ఏర్పడిన విభేదాలే కారణంగా తెలుస్తోంది. ఇటీవల ఫ్రాన్స్ వేదికగా జరిగిన జీ 7 సమావేశాల సందర్భంగా ట్రంప్-మెలోనీ మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. మెలోనీ తనతో ఫొటో దిగేందుకు బతిమాలిందని ట్రంప్ వ్యాఖ్యానించడంతో దుమారం చెలరేగింది. ఇటలీ ఎప్పుడూ ఎవరి ముందు తలవంచదని మెలోనీ కౌంటర్ ఇచ్చారు. ఆ మధ్య టర్కీ వేదికగా జరిగిన నాటో సదస్సులో కూడా ట్రంప్-మెలోనీ పలకరించుకోలేదు. ఇప్పుడు న్యూయార్క్ వేదికగా యూఎన్ సమావేశాలు జరుగుతున్నాయి. వెళ్తే ట్రంప్‌ను కలవాల్సి వస్తుందన్న కారణంగానే మెలోనీ అమెరికాకు వెళ్లలేదని వార్తలు వస్తున్నాయి.

వరుసగా మూడు వారాల వ్యవధిలో ఆరు శిఖరాగ్ర సమావేశాలకు హాజరైన నేపథ్యంలో.. దేశంలోనే ఉండి పలు కీలక అంశాలపై దృష్టి పెట్టాల్సి ఉందన్న కారణంగా మెలోనీ దూరంగా ఉన్నట్లు చెబుతున్నారు. అయితే మెలోనీ యూఎన్‌కు గైర్హాజరు కావడం మరో అంశంపై కూడా చర్చకు దారితీసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఇటీవల బహిరంగంగా విభేదించిన నేపథ్యంలోనే ముఖాముఖి భేటీ నుంచి తప్పించుకోవడం కూడా ఒక విషయంగా చెబుతున్నారు.

ఫాక్స్ న్యూస్ నివేదిక ప్రకారం.. గత మూడున్నర వారాల్లో తాను ఆరు శిఖరాగ్ర సమావేశాలకు హాజరయ్యానని.. ఇటలీలోనే ఉండి పరిష్కరించాల్సిన “అనేక కీలక అంశాలు” ఉన్నాయని మెలోనీ పేర్కొన్నట్లు ఓ అధికారి తెలిపారు.

15 ఏళ్ల సంప్రదాయానికి బ్రేక్

అసోసియేట్ మీడియా ప్రకారం.. దాదాపు 15 ఏళ్లుగా ఇటలీ ప్రధానమంత్రులు యూఎన్ వార్షిక సమావేశాలకు హాజరవుతూ వస్తున్నారు. మెలోనీ ఈసారి దూరంగా ఉండటంతో ఆ సంప్రదాయానికి విరామం ఏర్పడినట్లయింది.

ట్రంప్‌తో మెలోనీకి ఏం జరిగింది?

ఫ్రాన్స్‌లో జరిగిన G7 సదస్సు సందర్భంగా మెలోనీ తనతో ఫొటో దిగేందుకు “బతిమిలాడారని” ట్రంప్ వ్యాఖ్యానించడంతో వివాదం మరింత ముదిరింది. దీనిపై మెలోనీ కూడా ట్రంప్‌కు నేరుగా స్పందించారు. “మీ స్నేహితురాలిగా ఉండటం నా ప్రజాదరణకు ఉపయోగపడటం లేదు” అని మెలోనీ వ్యాఖ్యానించినట్లు సమాచారం. అంతేకాదు, “నేనుగానీ, ఇటలీగానీ ఎప్పుడూ బతిమాలుకోము” అని ఆమె స్పష్టం చేశారు. అంతకుముందే ఇరాన్‌పై అమెరికా చేపట్టిన సైనిక చర్య విషయంలోనూ ట్రంప్, మెలోనీ మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అంతర్జాతీయ చట్టాల పరిధికి వెలుపల జరుగుతున్న సైనిక జోక్యాలు పెరుగుతున్న ప్రమాదకర ధోరణిలో భాగమని మెలోనీ అమెరికా చర్యలను విమర్శించారు.

ఎందుకింత కీలకం?

ఇటలీ నాటోలో కీలక సభ్య దేశం. ఇటలీలో వేలాది మంది అమెరికా సైనిక సిబ్బంది ఉన్నారు. అంతేకాకుండా అమెరికాకు చెందిన ముఖ్యమైన సైనిక మౌలిక సదుపాయాలు కూడా ఇటలీలో ఉన్నాయి. వీటిలో అవియానో ఎయిర్ బేస్, నాపుల్స్‌లో ఉన్న అమెరికా నేవీకి చెందిన సిక్త్ ఫ్లీట్ ప్రధానమైనవి. ఈ నేపథ్యంలో ట్రంప్, మెలోనీ మధ్య ఇటీవల బహిరంగంగా వ్యక్తమైన విభేదాలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. నాటోతో పాటు ఇరు దేశాల భద్రతా భాగస్వామ్యం కొనసాగుతున్నప్పటికీ.. కొన్ని అంతర్జాతీయ అంశాలపై ఇద్దరు నేతల మధ్య అభిప్రాయ భేదాలు బయటపడ్డాయి. ప్రస్తుతం మెలోనీ ఇటలీలోనే ఉండాలని నిర్ణయించుకోవడంతో.. ఈ ఏడాది UNGA సమావేశాల సందర్భంగా ట్రంప్‌తో ఆమెకు ముఖాముఖి భేటీ జరిగే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఆమె గైర్హాజరు కేవలం బిజీ షెడ్యూల్ కారణంగానేనా? లేక ట్రంప్‌తో మరో ప్రత్యక్ష భేటీని నివారించేందుకు కూడా దోహదపడిందా? అనే చర్చ మొదలైంది.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Mamata Banerjee: బెంగాల్‌లో మళ్లీ ఎన్నికలు, జ్ఞానేశ్ కుమార్‌ అరెస్టు.. మమత సంచలన డిమాండ్..

Mamata Banerjee: కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)పై...

Success Story: యూపీఎస్సీ కోసం 16 ప్రభుత్వ ఉద్యోగాలను తిరస్కరించింది.. కట్ చేస్తే ఐపీఎస్..

సాధించాలనే బలమైన సంకల్పం, దేశ సేవ చేయాలనే తపన ఉంటే ఏ...

Minister Keerthana Health Controversy: మంత్రి కీర్తన లండన్ వెళ్లకపోవడంపై వివాదం.. అసలు కారణం ఇదేనా?

Minister Keerthana Health Controversy: తమిళనాడు మంత్రి కీర్తన చుట్టూ వివాదం...

Priyanka Gandhi: ‘మహిళలకు భద్రత లేకపోతే ఎన్ని పథకాలు పెడితే ఏం లాభం?’.. బీహార్, ఢిల్లీ ఘటనలపై ప్రియాంక గాంధీ ఆవేదన

దేశంలో మహిళలపై పెరుగుతున్న నేరాలపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా...