1
November, 2026

A News 365Times Venture

1
Sunday
November, 2026

A News 365Times Venture

Punjab elections: ఆప్ తొలి జాబితా విడుదల.. ధురి నుంచి సీఎం పోటీ, జైలులో ఉన్న ఎమ్మెల్యేకు టికెట్.

Date:

Punjab elections: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) తొలి అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. సీఎం భగవంత్ మాన్‌ ధురి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో దిగుతుున్నారు. జైలులో ఉన్న మంత్రి సంజీవ్ అరోరాకు కూడా పార్టీ టికెట్ కేటాయించింది. ఈయన లూథియానా వెస్ట్ నియోజకవర్గం నుంచి పోటీలో ఉంటున్నారు. ఫస్ట్ లిస్టులో ఇప్పటికే ఎమ్మెల్యేలుగా ఉన్న 40 మందికి పార్టీ మరోసారి అవకాశం ఇచ్చింది.

సీఎం పోటీలో ఉంటున్న ధురి ఆప్‌కు కంచుకోటగా పరిగణించబడుతుంది. 2022 అసెంబ్లీ ఎన్నికలలో, మాన్ ఈ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థి దల్వీర్ సింగ్ గోల్డీని 58,000 ఓట్ల తేడాతో ఓడించి ఘన విజయం సాధించారు. ఇటీవలి మున్సిపల్ ఎన్నికలలో కూడా ఈ పార్టీ బలమైన పనితీరును కనబరిచింది, ధూరి మున్సిపల్ కౌన్సిల్‌లోని 21 వార్డులలో 20 వార్డులను గెలుచుకుంది.

ఇదిలా ఉంటే, ధురి నుంచే జైలులో ఉన్న ఎంపీ, వారిస్ దే పంజాబ్ అధినేత అమృత్‌ పాల్ సింగ్ కూడా పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఖడూర్ సాహిబ్ ఎంపీగా ఉన్న ఈయన ధురితో పాటు ఖడూర్ సాహిబ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం. దీంతో ధురిలో పోటీ పంజాబ్‌లో మాత్రమే కాకుండా, దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కాబోతోంది.

పంజాబ్ శాసనసభలో మొత్తం 117 సీట్లు ఉన్నాయి. 2027లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధికారంలో ఉంది. మరోసారి అధికారంలోకి రావాలని భావిస్తోంది. ఇదిలా ఉంటే, కాంగ్రెస్ కూడా అధికారం కోసం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అకాలీదళ్, బీజేపీ కూడా  పోటీలో ఉన్నాయి. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో పంజాబ్‌లో ఈసారి ట్రయాంగిల్ ఫైట్ ఉండబోతోంది.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Raptadu School Attack: బాలికపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి ఘటన.. నిందితుడిని పట్టుకున్న పోలీసులు?

Raptadu School Attack: అనంతపురం జిల్లా రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత...

Raptadu School Attack: “కన్నీళ్లు ఆగడం లేదు”.. రాప్తాడు ఘటనపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌ సీరియస్

Raptadu School Attack: అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రంలోని ఉన్నత...

Nvidia: చైనాకు AI చిప్స్ అక్రమ రవాణా.? ఎన్విడియా సీఈఓ సన్నిహితురాలిపై అనుమానం..

Nvidia: అమెరికా నుంచి అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చిప్‌లను చైనాకు...

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ ఖాతాలో చెత్త రికార్డులు.. భారత క్రికెట్‌లో మరో కొత్త చర్చ..

భారత జట్టు న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో 87 పరుగుల...