26
September, 2026

A News 365Times Venture

26
Saturday
September, 2026

A News 365Times Venture

Nara Lokesh: నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్.. ఫార్మా దిగ్గజాలకు మంత్రి లోకేష్ ఆహ్వానం..

Date:

ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా  సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ 2026 – ఏపీ ఈడీబీ ఆధ్వర్యంలో అహ్మదాబాద్‌లో ఫార్మా రంగంపై  జరిగిన ప్రత్యేక రౌండ్‌టేబుల్ సమావేశంలో రాష్ట్ర ఐటీ, విద్యా, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ఉత్సాహంగా పాల్గొని, పారిశ్రామికవేత్తలను ఏపీకి సాదరంగా ఆహ్వానించారు. గుజరాత్‌ పర్యటనలో భాగంగా ఫార్మా దిగ్గజాలతో జరిగిన ఈ భేటీలో ఏపీలో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను ఆయన వివరించారు.

ఈ సందర్భంగా నక్కపల్లిలో అత్యాధునిక హంగులతో అభివృద్ధి చేస్తున్న ‘బల్క్ డ్రగ్ పార్క్’ ప్రాజెక్ట్ విశిష్టతలను మంత్రి లోకేష్ పారిశ్రామిక వర్గాలకు తెలిపారు. దేశంలోనే ఫార్మా రంగానికి కేంద్ర బిందువుగా మారుతున్న ఈ పార్కులో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. క్లస్టర్ మోడల్ ఆధారంగా ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేస్తున్నామని, తద్వారా తయారీ రంగం మరింత బలపడుతుందని ఆయన స్పష్టం చేశారు.

కేవలం ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ కాకుండా.. అత్యంత వేగంగా అనుమతులు మంజూరు చేసే ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ విధానాన్ని తమ ప్రభుత్వం అమలు చేస్తోందని లోకేష్ పేర్కొన్నారు. పారిశ్రామికవేత్తలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సింగిల్ విండో విధానంలో అతి తక్కువ సమయంలోనే అన్ని అనుమతులు ఇస్తామని భరోసా కల్పించారు. ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని, నిపుణలైన మానవ వనరులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ సమావేశానికి ఫార్మా రంగానికి చెందిన పలు ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హాజరై, ఏపీలో పెట్టుబడులపై సానుకూలంగా స్పందించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో మరిన్ని పరిశ్రమలు ఏర్పాటయ్యేలా ఈ పర్యటన దోహదపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Ethanol Car: పెట్రోల్‌తో పని లేదు.. 100 శాతం ఇథనాల్‌తో నడిచే కారు.. అక్టోబర్‌లోనే లాంచ్..

భోపాల్‌లో నిర్వహించిన ఒక రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో కేంద్ర రోడ్డు రవాణా,...

World Cup 2027: వన్డే వరల్డ్ కప్ 2027పై గంభీర్ మాస్టర్ ప్లాన్.. హార్దిక్, బుమ్రా కష్టమే..!

భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ 2027 వన్డే...

Houthi War: సౌదీకి పాకిస్తాన్ దూరం.. అండగా నిలుస్తున్న ఫ్రాన్స్!

Houthi War: యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాకు చుక్కలు చూపిస్తున్నారు....

Bill Gates: ఏఐతో బిలియన్ మంది ప్రాణాలు పోయే ప్రమాదం! బిల్ గేట్స్ తీవ్ర హెచ్చరిక

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ రోజురోజుకూ మరింత శక్తివంతంగా మారుతున్న నేపథ్యంలో...