18
September, 2026

A News 365Times Venture

18
Friday
September, 2026

A News 365Times Venture

Tata Sons: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్‌‌కే.. లొల్లి తప్పదా?

Date:

టాటా గ్రూప్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఎన్. చంద్రశేఖరన్‌ను మరో ఐదేళ్ల కాలానికి కొనసాగించాలని కంపెనీ బోర్డు నిర్ణయించింది. గురువారం జరిగిన బోర్డు సమావేశంలో మెజారిటీ ఓట్లతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాటా సన్స్ వెల్లడించింది. అయితే ఈ నిర్ణయంపై టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయెల్ టాటా మాత్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. టాటా ట్రస్ట్స్‌కు టాటా గ్రూప్‌లో 66 శాతం వాటా ఉంది.

బోర్డు నిర్ణయం

చంద్రశేఖరన్ గత నెలలో తన ప్రస్తుత పదవీకాలం ముగిసిన తర్వాత చైర్మన్‌గా కొనసాగేందుకు తనను తాను ప్రతిపాదించుకోబోనని ప్రకటించారు. అయితే గురువారం జరిగిన బోర్డు సమావేశంలో ఆయన తన నిర్ణయాన్ని పునఃపరిశీలించేందుకు బోర్డు చేసిన విజ్ఞప్తిని అంగీకరించినట్లు టాటా సన్స్ తెలిపింది. ఆ తర్వాత చంద్రశేఖరన్‌ను మరో ఐదేళ్ల కాలానికి ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా తిరిగి నియమించేందుకు బోర్డు మెజారిటీ ఓట్లతో తీర్మానం చేసినట్లు కంపెనీ పేర్కొంది. ఆయన ప్రస్తుత పదవీకాలం వచ్చే ఏడాది ఫిబ్రవరి 20తో ముగియనుంది.

గత ఏడాది నుంచే..

చంద్రశేఖరన్‌ను మరో ఐదేళ్లకు కొనసాగించే అంశంపై టాటా సన్స్ బోర్డు 2025 సెప్టెంబర్‌లోనే సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. అయితే చట్టపరమైన నిబంధనల ప్రకారం అవసరమైన అధికారిక అనుమతులు పొందేందుకు 2026 ఫిబ్రవరిలో తీర్మానాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. అయితే అప్పట్లో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో తీర్మానాన్ని వాయిదా వేశారు. అనంతరం మే, జూన్ నెలల్లో జరిగిన బోర్డు సమావేశాల్లోనూ ఈ అంశంపై చర్చ జరిగినప్పటికీ తుది నిర్ణయం తీసుకోలేకపోయారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆగస్టు 12న చంద్రశేఖరన్ తన ప్రస్తుత పదవీకాలం ముగిసిన తర్వాత తిరిగి నియామకానికి తనను తాను ప్రతిపాదించుకోబోనని నిర్ణయించుకున్నట్లు టాటా సన్స్ తెలిపింది.

ఒప్పించిన నామినేషన్ కమిటీ

సెప్టెంబర్ 3న టాటా సన్స్ బోర్డులోని నామినేషన్ అండ్ రెమ్యునరేషన్ కమిటీ (NRC) సమావేశమైంది. చంద్రశేఖరన్ కొనసాగకూడదన్న నిర్ణయం, ఆయనను తిరిగి నియమించే అంశంపై కమిటీ చర్చించింది. చంద్రశేఖరన్ టాటా గ్రూప్‌కు అందించిన సేవలు, సంస్థ ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం.. తన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని ఆయనను కోరాలని NRC ఏకగ్రీవంగా నిర్ణయించింది. తదుపరి బోర్డు సమావేశంలో ఆయనను మరోసారి ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా నియమించాలని సిఫారసు చేసింది.

RBI నిబంధనలపై కూడా చర్యలు

అమలులో ఉన్న RBI మార్గదర్శకాలకు అనుగుణంగా అవసరమైన చర్యలను ప్రారంభించాలని కూడా టాటా సన్స్ బోర్డు నిర్ణయించింది. ఇందుకోసం RBI, టాటా ట్రస్ట్స్, ఇతర సంబంధిత వాటాదారుల నుంచి మార్గదర్శకత్వం తీసుకోవాలని నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది.

నోయెల్ టాటా వ్యతిరేకం

మరోవైపు టాటా ట్రస్ట్స్ మాత్రం బోర్డు నిర్ణయాన్ని వ్యతిరేకించింది. చంద్రశేఖరన్‌ను మరోసారి నియమించేందుకు చేసిన ప్రతిపాదనకు టాటా ట్రస్ట్స్ తరఫున నామినీ డైరెక్టర్‌గా ఉన్న నోయెల్ టాటా వ్యతిరేకంగా ఓటు వేశారని ట్రస్ట్స్ తెలిపింది. ఈ కారణంగా బోర్డు తీర్మానం చట్టపరంగా చెల్లదని, దానికి ఎలాంటి ఆధారం లేదని టాటా ట్రస్ట్స్ ఒక ప్రకటనలో పేర్కొంది. చంద్రశేఖరన్ 2027 ఫిబ్రవరి 20న ప్రస్తుత పదవీకాలం ముగిసిన తర్వాత తిరిగి నియామకానికి తనను తాను ప్రతిపాదించుకోకూడదన్న నిర్ణయం ఇప్పటికే ఆమోదించబడిందని టాటా ట్రస్ట్స్ స్పష్టం చేసింది. ఆ నిర్ణయం తుది రూపం దాల్చిందని, మెజారిటీ వాటాదారుగా టాటా ట్రస్ట్స్ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని తెలిపింది. గురువారం జరిగిన బోర్డు సమావేశంలోనూ టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయెల్ టాటా ఇదే అభిప్రాయాన్ని పునరుద్ఘాటించినట్లు ట్రస్ట్స్ పేర్కొంది. దీంతో చంద్రశేఖరన్‌ను మరో ఐదేళ్లకు కొనసాగించాలన్న టాటా సన్స్ బోర్డు నిర్ణయంపై సంస్థలోని బోర్డు, టాటా ట్రస్ట్స్ మధ్య విభేదాలు బహిరంగంగా బయటపడినట్లైంది. మళ్లీ ఎలాంటి రగడ మొదలవుతుందో చూడాలి.

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Online Shopping: ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..

ఆన్‌లైన్ షాపింగ్ చేసే వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం రాబోయే రోజుల్లో మరింత...

Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు

Disha Salian Case:  దిశా సాలియన్ మృతిపై సీబీఐ విచారణ మహారాష్ట్ర...

Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..

ఏపీలో డ్వాక్రా మహిళల ఆర్థిక పురోగతి, జీవనోపాధుల విస్తరణే ప్రభుత్వ ప్రధాన...

UPI Charges: యూపీఐ చెల్లింపులపై 18% జీఎస్టీ? వ్యాపారులకు కొత్త ఛార్జీలు! నిపుణులు అంచనా ఇదే

ప్రస్తుతం దేశంలో యూపీఐ ఛార్జీలపై రగడ నడుస్తోంది. కొత్తగా కేంద్ర ప్రభుత్వం...