25
May, 2026

A News 365Times Venture

25
Monday
May, 2026

A News 365Times Venture

Killer Wife: ప్రియుడి మోజులో పడి ఏం మర్డర్ స్కెచ్ వేసింది.. భర్తను పొలానికి పిలిచి..!

Date:

వివాహేతర బంధం.. ప్రియుడితో కలిసి భర్తను చంపేయడం.. ఆ తర్వాత పోలీసులు అరెస్ట్ చేయడం.. ఇలాంటి కేసులు దేశవ్యాప్తంగా ఎన్నో వెలుగులోకి వస్తున్నా… కొంత మంది భార్యామణులు తీరు మార్చుకోవడం లేదు. సేమ్ ఓల్డ్ స్టోరీ అన్నట్టు.. అదే తరహాలో నేరం చేసి పోలీసులకు దొరికిపోతున్నారు. తాజాగా వివాహేతర సంబంధం కారణంగా భార్య చేతిలో భర్త బలైన సంఘటన సంగారెడ్డి జిల్లాలో సంచలనంగా మారింది. ప్రియుడితో కలిసి హత్య చేసి శవాన్ని పూడ్చేసింది ఆ ఇల్లాలు. పైగా ఏమి తెలియనట్టు పోలీసులకు తన భర్త కనిపించడం ఫిర్యాదు చేసింది. ఆమె తెలివికి పోలీసులే షాక్ అయ్యారు. కానీ చివరికి కాల్ డేటా ఆధారంగా బండారం బయటపడటంతో ప్రియుడితో కలిసి కటకటాల పాలయింది.

ఈవిడ పేరు కల్పన. కొన్నేళ్ల క్రితం ముత్యంరెడ్డి అనే వ్యక్తితో వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు. కల్పన నారాయణఖేడ్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తోంది. కొన్నేళ్ల క్రితం కల్పనకు గంగాపూర్ గ్రామానికి చెందిన పండరీ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త కల్పన, పండరీల మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం ఇంట్లో తెలవకుండా కొన్ని రోజులు కల్పన మేనేజ్ చేసినా ఆ తర్వాత విషయం బయటపడింది. దీంతో కల్పన, ముత్యంరెడ్డిల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఇద్దరు ఆడ పిల్లలున్నారాని వివాహేతర సంబంధం కరెక్ట్ కాదని ముత్యంరెడ్డి పలు మార్లు భార్యను హెచ్చరించినా కల్పన తీరు మార్చుకోలేదు. ఈ మధ్య ఈ గొడవలు మరింత ఎక్కువ కావడంతో విషయం ప్రియుడు పండరికి చెప్పింది కల్పన..

ఇంకేముంది.. చాలా స్టోరీల్లోలాగానే.. తమ వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్న ముత్యం రెడ్డిని వదిలించుకోవడానికి ఇద్దరూ కలిసి ప్లాన్ చేశారు. కల్పన ప్లాన్‌కి ప్రియుడు పండరి ఒకే చెప్పడంతో వెంటనే తమ మాస్టర్ ప్లాన్‌ని అమల్లోకి తెచ్చారు. ఎలాగైనా ముత్యంరెడ్డిని చంపేయాలని అనుకున్నారు కాబట్టి… పండరీ పొలంలో జేసీబీతో హత్య చేశాక శవాన్ని పూడ్చడానికి ముందుగానే ఓ గుంత తవ్వారు…

ఇక వెంటనే మే 16న ఇదే విషయంలో మాట్లాడుదామని కల్పన భర్తకి ప్రియుడు పండరీ ఫోన్ చేశాడు. మనూర్ మండలం ఎల్గోయికి వస్తే ఏదో ఒకటి తేల్చుకుందామని చెప్పడంతో ఎల్గోయికి వెళ్లాడు ముత్యంరెడ్డి. అక్కడికి వెళ్లే సరికి భార్య కల్పన పండరీ దగ్గరే ఉండటంతో భర్త జీర్ణించుకోలేక పోయాడు. ఇదే సమయంలో ముత్యంరెడ్డి, పండరీ మధ్య గొడవ జరిగింది. భార్య కల్పన, ప్రియుడు పండరీ ఇద్దరు కలిసి ముత్యంరెడ్డిని హత్య చేశారు. ముత్యంరెడ్డి చనిపోయాడని నిర్థారించుకున్న తర్వాత మృతదేహాన్ని అప్పటికే తీసిన గుంతలో వేసి పూడ్చేశారు…

ఇంట్లో ఇద్దరు పిల్లలు నాన్న ఎటు వెళ్లాడు అని అడుగుతుంటే తనకి తెలియదని నమ్మించే ప్రయత్నం చేసింది తల్లి. ఏమి ఎరగనట్టు మే 18న నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్‌లో తన భర్త కనిపించడం లేదని కూతుర్లతో కలిసి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. మొదట భార్యపైనే అనుమానం రాగా క్లారిటీ కోసం దర్యాప్తులో వేగం పెంచారు. అదే సమయంలో ముత్యంరెడ్డి, కల్పనల కాల్ హిస్టరీని పోలీసులు చెక్ చేశారు. కల్పన ఫోన్ నంబర్‌తో ఎక్కువసార్లు మాట్లాడినట్టు రికార్డ్ ఉండటంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆ నంబర్ పండరీదిగా గుర్తించారు. వెంటనే పండరీని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. మొదట తనకి ఏమి తెలియదని పండరీ చెప్పినా.. పోలీసులు తమదైన స్టైల్‌లో దర్యాప్తు చేసేసరికి నేరం ఒప్పుకున్నాడు.

నిందితుడు పండరి చెప్పిన వివరాలతో వెంటనే భార్య కల్పనని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిని కలిసి విచారించగా ముత్యంరెడ్డిని హత్య చేసి పూడ్చి పెట్టామని చెప్పడంతో ఘటన స్థలానికి పోలీసులు తీసుకువెళ్లారు. హత్య చేసి గుంతలో పూడ్చిపెట్టిన చోటు నుంచి ముత్యంరెడ్డి మృతదేహాన్ని పోలీసులు బయటికి తీసి మనూర్ తహశీల్దార్ సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. తండ్రి హత్యకు గురి కావడం, తల్లి ఈ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్లడంతో ఇద్దరు ఆడపిల్లలు దిక్కులేని వారయ్యారు. మొత్తంగా.. 9 రోజుల క్రితం అదృశ్యమైన ముత్యంరెడ్డి కేసు విషాదంగా ముగిసింది. భార్య వివాహేతర బంధానికి ముత్యం రెడ్డి బలయ్యాడు..

 

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Best Batting Pair: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ కాదు.. ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ బ్యాటింగ్ జోడి ఇదే..

ఐపీఎల్ 2026 లీగ్ దశ ముగిసి క్వాలిఫయర్ 1 పోరుకు తెరలేచింది....

Hyderabad: కంత్రీగాడి తాటతీసిన పోలీసులు.. వీడిన నార్సింగ్ మహిళపై వేధింపుల కేసు

ఆడపిల్ల బయట అడుగు పెట్టాలంటేనే భయపడే పరిస్థితులు మళ్లీ ముంచుకొస్తున్నాయి. అర్ధరాత్రి...

Bengal: 15 ఏళ్లు ఆలస్యమైన ప్రాజెక్ట్ 15 రోజుల్లో పూర్తి

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడగానే చకచకా పనులు జరిగిపోతున్నాయి. తాజాగా...

Master Plan: ఊరి జనాల్ని నమ్మించి.. మాస్టర్ స్కెచ్ వేశారు.. రూ.కోటితో పరార్..

జనం అత్యాశనే వారికి పెట్టుబడి.. అదే వారి ఆయుధం.. తక్కువ ధరకు...