25
May, 2026

A News 365Times Venture

25
Monday
May, 2026

A News 365Times Venture

Master Plan: ఊరి జనాల్ని నమ్మించి.. మాస్టర్ స్కెచ్ వేశారు.. రూ.కోటితో పరార్..

Date:

జనం అత్యాశనే వారికి పెట్టుబడి.. అదే వారి ఆయుధం.. తక్కువ ధరకు బంగారం వస్తుందన్న జనం ఆశను.. కాదు.. కాదు.. అత్యాశను సొమ్ము చేసుకున్నారు ఇద్దరు కేటుగాళ్లు. చక్కగా సాధువుల్లా తయారై ఊరి జనాన్ని 9 నెలల పాటు నమ్మించారు. వన్ ఫైన్ మార్నింగ్.. భారీగా డబ్బు తీసుకుని జంప్ అయ్యారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కామేపల్లిలో జరిగింది. డబ్బు పోగొట్టుకున్న బాధితులు ఇప్పుడు లబోదిబోమంటూ పోలీసుల ఆశ్రయించారు.

ఇక్కడ చూడండి ఈ ఫోటోలో ఉన్న వారి పేర్లు బోగా లక్ష్మీనారాయణ, సాయి కుమార్. భోగా లక్ష్మీనారాయణ స్వస్థలం ఎన్టీఆర్ జిల్లా నంద్యాల. కామేపల్లి మండలం భాసిత నగర్‌కు చెందిన సాయికుమార్‌తో కలిసి కెప్టెన్ బంజరలో మంచి చెడు కోసం పూజలు నిర్వహిస్తామని ఎంట్రీ ఇచ్చాడు. కెప్టెన్ బంజరలో కొంతమంది అయ్యప్ప స్వామి మాల వేశారు. బోగా లక్ష్మీనారాయణ, సాయికుమార్ కూడా మాలవేసి ఆ గ్రామంలో పూజలు నిర్వహించారు. గత తొమ్మిది నెలలుగా కెప్టెన్ బంజర, బాసిత్ నగర్ గ్రామాలలో అయ్యప్ప స్వామి పూజలతో పాటు, ముత్యాలమ్మ జాతరను భోగ లక్ష్మీనారాయణ స్వామి సొంత ఖర్చుతో నిర్వహించాడు.

ఇదే సమయంలో కామేపల్లి మండలంలోని లింగాల క్రాస్ రోడ్ వద్ద కోట మైసమ్మకు గుడి కట్టిస్తానని స్థలాన్ని కూడా కొన్నాడు బోగా లక్ష్మీనారాయణ. ఏడు లక్షల విలువలు చేసే స్థలాన్ని కొని నాలుగు లక్షల రూపాయలు కూడా చెల్లించారు. దీంతో ప్రజలు ఇతడు ఏది చెప్పినా నమ్మారు. ప్రజలలో ఒక నమ్మకం కలిగించిన తర్వాత బిస్కెట్ బంగారం తక్కువ ధరకు ఇస్తానని నమ్మించాడు.

గత తొమ్మిది నెలలుగా తమ గ్రామంలో నమ్మకం ఉంటూ అనేక పూజలు పండుగ కార్యక్రమంలో నిర్వహించినందున లక్ష్మీనారాయణ మాటలను నమ్మారు. తక్కువ ధరకు వస్తుందంటే ఆశతో లక్ష్మీనారాయణకు లక్షల రూపాయలు చెల్లించారు. కెప్టెన్ బంజర, బాసిత్ నగర్ గ్రామాలలోఅధికారికంగా 50 లక్షలు అంచనా తేలింది. కానీ గ్రామస్తులు కోటి రూపాయలు దాకా వసూలు చేశారని చెబుతున్నారు. అయితే ప్రజల నుంచి డబ్బు ముట్టగానే భోగా లక్ష్మీనారాయణతో పాటు సాయి కుమార్ కూడా అడ్రస్ లేరు. తమకు జరిగిన మోసంపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Pawan Kalyan: అమిత్ షాతో అలాంటి విషయాలు ఎందుకు మాట్లాడతాను

వైసీపీ నాయకుడు గురించి అమిత్ షా దగ్గర ఏమీ మాట్లాడలేదని.. అయినా...

Hardik Pandya: MI వీడి చెన్నై సూపర్ కింగ్స్‌లోకి హార్దిక్ పాండ్యా.. 07:07 టైమ్‌పై సోషల్ మీడియాలో చర్చ..

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్, ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా సోషల్...

Vaibhav Sooryavanshi: క్రిస్ గేల్ రికార్డు నాకు లెక్క కాదు.. టీ20ల్లో 200 కొట్టి చూపిస్తా: వైభవ్ సూర్యవంశీ

క్రికెట్ ప్రపంచంలో రికార్డులు సృష్టించడం ఒక ఎత్తైతే, వాటిని తిరగరాయడం మరో...

Nara Lokesh: మహానాడుపై క్లస్టర్‌ ఇంఛార్జ్‌లకు నారా లోకేష్ దిశానిర్దేశం

Nara Lokesh: క్లస్టర్ స్థాయిలో మహానాడు విజయవంతానికి అందరం కలిసికట్టుగా పనిచేయాలని...