22
August, 2026

A News 365Times Venture

22
Saturday
August, 2026

A News 365Times Venture

144Hz AMOLED డిస్‌ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?

Date:

iQOO Z11: భారత మార్కెట్లో ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఐక్యూ (iQOO) కొత్త Z సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. iQOO Z11 పేరుతో వచ్చిన ఈ ఫోన్‌ను “Faster, Smarter with AI” అనే ట్యాగ్‌లైన్‌తో లాంచ్ చేసింది. ముఖ్యంగా విద్యార్థులు, యువ ప్రొఫెషనల్స్‌ను టార్గెట్ చేస్తూ ఏఐ ఆధారిత ప్రొడక్టివిటీ, స్టడీ ఫీచర్లను ఇందులో అందించారు.

డైమెన్సిటీ 7500 టర్బో ప్రాసెసర్:

పనితీరు పరంగా iQOO Z11కు మీడియాటెక్ డైమెన్సిటీ 7500 టర్బో ప్రాసెసర్‌ను అందించారు. భారతదేశంలో ఈ చిప్‌సెట్‌తో వచ్చిన తొలి స్మార్ట్‌ఫోన్‌గా iQOO Z11 నిలిచింది. 4nm ప్రాసెస్‌పై తయారైన ఈ ఆక్టాకోర్ ప్రాసెసర్ 2.6GHz వరకు క్లాక్ స్పీడ్‌ను అందిస్తుంది. Mali-G615 MC2 GPU గ్రాఫిక్స్ బాధ్యతలు నిర్వహిస్తుంది. ఆన్-డివైస్ AI టాస్క్‌ల కోసం మీడియాటెక్ 8వ తరం NPUను ఇందులో అందించారు. గేమింగ్, మల్టీటాస్కింగ్ సమయంలో ఉష్ణోగ్రతలను నియంత్రించేందుకు 3,800mm² వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్‌ను కూడా అందించారు.

కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే:

iQOO Z11లో 6.83 అంగుళాల 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే ఉంది. ఇది 2800 × 1260 పిక్సెల్స్ 1.5K రిజల్యూషన్‌తో పాటు 144Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. డిస్‌ప్లే గరిష్ఠంగా 2,000 నిట్స్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. HDR10+ సపోర్ట్ కూడా ఉంది. ఇక ఈ ఫోన్ కు IP68, IP69 రేటింగ్స్‌ను పొందింది. దీంతో దుమ్ము, నీరు వంటి వాటి నుంచి మెరుగైన రక్షణ లభిస్తుంది.

సోనీ కెమెరా:

కెమెరా విభాగం విషయానికి వస్తే.. వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్‌ను అందించారు. ఇందులో OIS సపోర్ట్‌తో 50MP సోనీ IMX882 మెయిన్ కెమెరా ఉంది. దీనికి 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా జత చేశారు. ఆరా లైట్ కూడా ఉంది. 4K వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ లభిస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 32MP కెమెరాను అందించారు. ఈ కెమెరా కూడా 4K వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

Image (3)

భారీ బ్యాటరీ & ఇతర ఫీచర్లు:

ఫోన్‌లో 7,050mAh బ్లూవోల్ట్ బ్యాటరీని అందించారు. ఇది సుదీర్ఘ బ్యాటరీ బ్యాకప్‌ను అందించేలా రూపొందించారు. బ్యాటరీకి 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. iQOO Z11 ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6పై పనిచేస్తుంది. ఇందులో Origin Island అనే ఫీచర్ ఉంది. స్క్రీన్ పైభాగంలోని కెమెరా కటౌట్ చుట్టూ నావిగేషన్, మీడియా ప్లేబ్యాక్, టైమర్లు, అలారాలు వంటి రియల్‌టైమ్ అలర్ట్‌లను చూపిస్తుంది. ఈ ఫోన్‌కు 3 సంవత్సరాల ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌గ్రేడ్స్, 5 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్ అందించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఇన్-డిస్‌ప్లే ఆప్టికల్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, స్టీరియో స్పీకర్లు, యూఎస్‌బీ టైప్-C వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. కనెక్టివిటీ పరంగా 5G SA/NSA, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 6, బ్లూటూత్ 5.4, GPS, BeiDou, GLONASS, Galileo, QZSS వంటి ఫీచర్లు ఉన్నాయి.

AI ఫీచర్లకు ప్రత్యేక ప్రాధాన్యత:

iQOO Z11లో విద్యార్థులు, ఉద్యోగులకు ఉపయోగపడేలా పలు ఏఐ ఆధారిత ఫీచర్లను అందించారు. ఆడియోను రికార్డ్ చేసి ఆటోమేటిక్‌గా ట్రాన్స్‌క్రైబ్ చేయడంతో పాటు ముఖ్యమైన అంశాలను సారాంశంగా రూపొందించే ఫీచర్ ఇందులో ఉంది. లెక్చర్లు, మీటింగ్స్ సమయంలో ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా నోట్ టేకింగ్, డాక్యుమెంట్ తయారీ, డిజిటల్ ఫైళ్లను నిర్వహించడం వంటి పనులను సులభతరం చేసే సాఫ్ట్‌వేర్ టూల్స్‌ను కూడా అందించారు. ఎక్కువ యాప్స్‌ను ఒకేసారి ఉపయోగించే సమయంలో మల్టీటాస్కింగ్‌ను మెరుగుపరిచేలా సాఫ్ట్‌వేర్ ఆప్టిమైజేషన్ చేశారు.

ధరలు:

iQOO Z11ను ఆరొరా గ్రీన్, సెలెస్టియల్ బ్లూ కలర్ ఆప్షన్లలో తీసుకొచ్చారు. ఈ ఫోన్ ఆగస్టు 25 మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్, iQOO అధికారిక వెబ్‌సైట్‌తో పాటు రిలయన్స్ డిజిటల్, వివో ఎక్స్‌క్లూజివ్ స్టోర్లలో విక్రయానికి అందుబాటులోకి రానుంది. లాంచ్ ఆఫర్లలో భాగంగా.. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.3,000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అదనంగా రూ.1,000 కూపన్ డిస్కౌంట్, 6 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయం అందుబాటులో ఉంటుంది. వీటి ధరలు ఇలా ఉన్నాయి.

* 6GB + 128GB: రూ.34,999.
* 8GB + 128GB: రూ.39,999.
* 8GB + 256GB: రూ.44,999.
* 12GB + 256GB: రూ.49,999.

Image (2)



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Punjab: చిక్కుల్లో పంజాబ్ సీఎం మాన్ భార్య.. అత్యాచార కేసు లంచంపై ఎన్‌హెచ్‌ఆర్సీ కీలక ఆదేశం

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ భార్య గుర్‌ప్రీత్ కౌర్ చిక్కుల్లో చిక్కుకున్నారు....

Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?

Blood Donation: మనం చేసే రక్తదానం అత్యవసర పరిస్థితుల్లో ఉన్న ఎంతో...

AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఆగస్టు 31 నుంచే ప్రారంభం..

వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగు వేసింది....

Toxic Censor Report: ‘టాక్సిక్’కు సెన్సార్ బోర్డు షాక్ ఇచ్చిందా.?

Toxic Censor Report: కేజిఎఫ్ వంటి సంచలన విజయం తర్వాత రాకింగ్...