Toxic Censor Report: కేజిఎఫ్ వంటి సంచలన విజయం తర్వాత రాకింగ్ స్టార్ యష్ నటించిన మోస్ట్ ఎవేటెడ్, పాన్ ఇండియా మూవీ టాక్సిక్ పై భారీ అంచనాలు ఉన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డైరెక్టర్ గీతు మోహన్ దాస్ దర్శకత్వంలో భారీ యాక్షన్ అండ్ రివెంజ్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా ఆగస్టు 26 న గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ రిపోర్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకు ఎలాంటి మేజర్ కట్స్ సూచించకుండా ‘A’ సర్టిఫికెట్ జారీ చేసినట్టుగా సమాచారం.
దాదాపు 3 గంటల 12 నిమిషాల రన్ టైంతో రానున్న టాక్సిక్ కన్నడ వర్షన్ లో కేవలం రెండు పదాలను మ్యూట్ చేయడంతో పాటు, పొగ తాగడం మరియు మద్యపానానికి సంబంధించిన సన్నివేశాల్లో తప్పనిసరి హెచ్చరిక లైన్ ను జోడించాలని మాత్రమే బోర్డు సూచించిందట. అసలు ఈ సినిమా ప్రమోషన్ కంటెంట్ చూస్తే.. వైలెన్స్ తో పాటు రొమాంటిక్ సీన్స్ కూడా ఓ రేంజ్ లో ఉన్నట్టుగా కనిపిస్తోంది. పైగా మేకర్స్ ఈ సినిమా కేవలం పెద్దల కోసం మాత్రమేనని ముందే చెప్పేశారు.
అలాంటిది సెన్సార్ బోర్డ్ ఎలాంటి కట్స్ లేకుండా సర్టిఫై చేయడం షాకింగ్ గా మారింది. అయితే ఇక్కడే కొన్ని సందేహాలు కూడా వెలవడుతున్నాయి. టీజర్, ట్రైలర్ సాంగ్స్ లో చూపించిన కంటెంట్ కేవలం ప్రమోషన్స్ కోసమైనా సినిమాలో అలాంటి సీన్స్ లేవా అనే డౌట్స్ మొదలయ్యాయి. అదే జరిగితే యష్ ఫ్యాన్స్ డిసపాయింట్ అయ్యే ఛాన్స్ లేకపోలేదు. మరి టాక్సిక్ ఎలా ఉంటుందో చూడాలి.




