22
August, 2026

A News 365Times Venture

22
Saturday
August, 2026

A News 365Times Venture

Missi Jersey Auction: ఒకే వేలంలో మెస్సీ, రొనాల్డో ఫైట్.. ఊహించని ధరకు అమ్ముడైన దిగ్గజాల జెర్సీలు..

Date:

మాంచెస్టర్ యునైటెడ్ మాజీ మసాజర్ రోడ్ థోర్న్‌లీ సేకరించిన ప్రముఖ ఫుట్‌బాల్ ఆటగాళ్ల జెర్సీలకు సంబంధించిన వేలం పాటలో లియోనెల్ మెస్సీ జెర్సీ సరికొత్త రికార్డు సృష్టించింది. ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరిగిన ఈ వేలంలో క్రిస్టియానో రొనాల్డో జెర్సీ కంటే మెస్సీ జెర్సీ ఆరు రెట్లు ఎక్కువ ధరకు అమ్ముడై అందరినీ ఆశ్చర్యపరిచింది. బార్సిలోనా జట్టులో ఉన్నప్పుడు మెస్సీ ధరించిన ఈ ప్రత్యేకమైన జెర్సీ రూ. 56.4 లక్షలు (66,107 అమెరికన్ డాలర్లు) పలకగా, రొనాల్డోకు చెందిన రియల్ మాడ్రిడ్ జెర్సీ రూ. 9.05 లక్షలకు (10,601 డాలర్లు) మాత్రమే అమ్ముడయ్యాయి.

మెస్సీ జెర్సీకి ఇంత భారీ ధర రావడానికి దాని వెనుక ఉన్న ఒక ఆసక్తికరమైన కథే ప్రధాన కారణం. 2012లో బార్సిలోనా జట్టు ఓల్డ్ ట్రాఫోర్డ్ పర్యటనకు రాకముందే, థోర్న్‌లీ తన స్నేహితుడైన బార్సిలోనా డిఫెండర్ గెరార్డ్ పికెకు సందేశం పంపి మెస్సీ జెర్సీ కావాలని కోరారు. మ్యాచ్ ముగిసిన వెంటనే పికె స్వయంగా థోర్న్‌లీని బార్సిలోనా డ్రెస్సింగ్ రూమ్‌కు తీసుకెళ్లారు. ఆ సమయంలో మెస్సీ తాను తొడుక్కున్న జెర్సీని తీసి, దానిపై స్వయంగా సంతకం చేసి థోర్న్‌లీకి అందించారు. మెస్సీ ప్రత్యక్షంగా ధరించిన జెర్సీ కావడంతో పాటు ఆయన సంతకం కూడా ఉండటంతో దీనికి భారీ వేలం ధర లభించింది.

మరోవైపు రొనాల్డో జెర్సీ 2014-15 సీజన్‌కు చెందిన రియల్ మాడ్రిడ్ మ్యాచ్ కోసం సిద్ధం చేసినది అయినప్పటికీ, దానిని ఆయన మ్యాచ్‌లో ధరించలేదు. కేవలం థోర్న్‌లీ కోసం ఒక సందేశంతో సంతకం చేసి ఇవ్వడం వల్ల దీనికి తక్కువ ధర లభించింది. ఈ వేలంలో మాంచెస్టర్ యునైటెడ్ దిగ్గజాల జెర్సీలు కూడా బాగానే ధర పలికాయి. 2002 ఛాంపియన్స్ లీగ్ మ్యాచ్‌కు చెందిన ర్యాన్ గిగ్స్ జెర్సీ రూ. 8.62 లక్షలకు, పాల్ స్కోల్స్ జెర్సీ రూ. 3.91 లక్షలకు, డేవిడ్ బెక్‌హామ్ జెర్సీ రూ. 3.32 లక్షలకు అమ్ముడయ్యాయి. అలాగే నిక్కీ బట్ జెర్సీ రూ. 2.32 లక్షలు, గ్యారీ నెవిల్లే జెర్సీ రూ. 1.50 లక్షల చొప్పున ధర పలికాయి. ఏది ఏమైనా మెస్సీ క్రేజ్ ముందు మిగిలిన దిగ్గజాల జెర్సీల ధరలు వెలవెలబోయాయి.

 

 



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!

Kitchen Hacks: వంటగదిలో “చాకు” (Knife) ఎంత ముఖ్యమో ఎక్కువగా చెప్పక్కర్లేదు....

Dr Priyanka Murder Case: డాక్టర్ ప్రియాంక హత్య కేసు.. నిందితుల రిమాండ్ పొడిగింపు!

రాజమండ్రిలో సంచలనం సృష్టించిన డాక్టర్ ప్రియాంక హత్య కేసులో నిందితుల రిమాండ్‌ను...

Lingamneni Ramesh Son: ఎంపీ లింగమనేని కుమారుడు సంజూష్‌పై కేసు.. నేడు పోలీసుల విచారణకు హాజరు!

హైదరాబాద్‌లోని మాదాపూర్ ఇనార్బిట్ మాల్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో...

Telangana Congress: కొండా సురేఖ తీరుపై కాంగ్రెస్ నేతల ఆగ్రహం.. మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్..

తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు, రాజకీయ వేడి ఒక్కసారిగా...