22
April, 2026

A News 365Times Venture

22
Wednesday
April, 2026

A News 365Times Venture

YS Jagan: “మీరు భయపడుతున్నారు”.. సీఎం చంద్రబాబుపై జగన్ సంచలన వ్యాఖ్యలు..

Date:

YS Jagan: సీఎం చంద్రబాబు ఇటీవ‌ల మీరు వ్యవ‌హ‌రిస్తున్న తీరు చూస్తుంటే మీరు బాగా భ‌య‌ప‌డిపోతున్నార‌ని అర్థమ‌వుతోందని మాజీ వైఎస్ సీఎం జగన్ అన్నారు. ఎన్నిక‌ల ముందు అధికారం కోసం నోటికి వ‌చ్చిన వాగ్దానాలు ఇచ్చారని.. సూప‌ర్ సిక్స్‌, సూప‌ర్ సెవెన్ అంటూ ప్రతి స‌భ‌లోనూ ఊద‌ర‌గొట్టారన్నారు. బాండ్లు సైతం ప్ర‌తి ఇంటికీ వెళ్లి ఇచ్చి ప్ర‌తి కుటుంబాన్ని మోసం చేశారన్నారు. రెండేళ్లు అవుతున్నా మేనిఫెస్టోలో చెప్పిన‌వి ఏవీ చేయ‌క‌పోగా, సూప‌ర్ సిక్స్, సూప‌ర్ సెవెన్‌ అమ‌లు చేసేశామ‌ని ప‌చ్చి అబ‌ద్ధాలు కూడా చెబుతున్నారని చెప్పారు. ఈ క్ర‌మంలో రాష్ట్ర ప్ర‌జ‌ల నుంచి, ఉద్యోగుల నుంచి వ‌స్తున్న వ్య‌తిరేక‌త‌ను త‌ట్టుకోలేక ప్ర‌శ్నించే గొంతుక‌ల‌పై బ్ర‌హ్మాస్త్రాలు ప్ర‌యోగిస్తున్నారని తెలిపారు. అంటే మీరు భ‌య‌ప‌డుతున్నార‌నే క‌దా దీని అర్థమన్నారు.

READ MORE: Chairman’s Desk : మహిళా బిల్లుకు డీలిమిటేషన్ ఉచ్చు.! అసలు వ్యూహం ఏంటి?

ఈ మేరకు జగన్ ట్వీట్ చేశారు. “ప్ర‌జ‌లు, ఉద్యోగుల నుంచి ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయంటేనే మీ ప‌రిపాల‌న బాగా లేద‌నే క‌దా అర్థం. ఇచ్చిన హామీలు అమ‌లు చేయ‌లేద‌నే క‌దా దాని అర్థం. మ‌రి అవి ఎప్పుడు నెర‌వేరుస్తార‌ని అడ‌గ‌డం త‌ప్పా? రెండేళ్లు అవుతున్నా, మూడో బ‌డ్జెట్ కూడా ప్ర‌వేశ‌పెట్టిన నేప‌థ్యంలో ఇంకెప్పుడు అమ‌లు చేస్తార‌ని ప్ర‌శ్నించ‌డం నేర‌మా? రూ.3.50 ల‌క్ష‌ల కోట్ల‌కు పైగా అప్పులు చేశారు అవేమ‌వుతున్నాయ‌ని నిల‌దీయ‌డం అపరాధమా? వీటికి సమాధానం చెప్పుకోలేక మిమ్మల్ని ప్రశ్నిస్తున్న వారిపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారంటే మీరు భయపడుతున్నారనే కదా, మీరు తప్పు చేశారని ఒప్పుకున్నట్లే కదా? ప్ర‌భుత్వ ఉద్యోగుల స‌మాఖ్య అధ్య‌క్షుడు కాక‌ర్ల వెంక‌ట్రామిరెడ్డి చేసిన త‌ప్పేంటి? ఉద్యోగుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌మ‌ని అడ‌గ‌డ‌మే ఆయ‌న చేసిన నేర‌మా? ఉద్యోగుల‌కు ఇచ్చిన హామీలు ఎప్పుడు అమ‌లు చేస్తార‌ని అడిగితే అత‌నిపై రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్ర‌యోగించి అత‌న్ని డిస్మిస్ చేశారంటే మీరు భ‌య‌ప‌డిపోతున్నార‌నే క‌దా. ఉద్యోగులకు హక్కుగా రావాల్సిన పెండింగ్ డీఏలు, పీఆర్సీ, మీరు వ‌స్తూనే ఇస్తామ‌న్న ఐఆర్ ఇవ్వాలని అడ‌గ‌డంలో త‌ప్పేముంది? అది మీరు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీనే క‌దా. ఉద్యోగుల విష‌యంలో మీరు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు, మీ మోస‌పూరిత వైఖ‌రిని అంద‌రూ గ‌మ‌నిస్తున్నారు.

READ MORE: Abhishek Sharma: 25 ఏళ్లకే దిగ్గజాలను అధిగమించిన అభిషేక్ శర్మ.. రోహిత్ రికార్డ్ బ్రేక్.. కోహ్లీ హిస్టరీ రీ-రైట్!

సీఐ శంక‌ర‌య్య విష‌యంలోనూ మీరు ఇలాగే దుర్మార్గంగా వ్య‌వ‌హ‌రించారు. మా చిన్నాన్న వైయ‌స్ వివేకానంద‌రెడ్డి గారి హ‌త్య కేసులో జ‌ర‌గ‌ని విష‌యాల‌ను జ‌రిగిన‌ట్లుగా సీఎం స్థాయిలో మీరు అసెంబ్లీ సాక్షిగా అబ‌ద్ధాలు చెప్పార‌ని, అది త‌న‌ను బాధించింద‌ని శంక‌ర‌య్య అంటే అత‌న్ని ఏకంగా ఉద్యోగం నుంచి తొల‌గించ‌డం మీ నిరంకుశ పాల‌న‌కు నిద‌ర్శ‌నం కాదా? మిమ్మ‌ల్ని ఎవ‌రైనా ప్ర‌శ్నిస్తే వారిపై క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌కు దిగుతున్నారంటే మీరు భ‌య‌ప‌డుతున్నార‌నీ క‌దా అర్థం. ఎన్నిక‌ల ముందు 20 ల‌క్ష‌ల ఉద్యోగాలు ఇస్తామ‌ని, ఉద్యోగం వ‌చ్చే వ‌ర‌కు నెల‌కు రూ.3వేల చొప్పున‌ భృతి ఇస్తామ‌ని చెప్పింది వాస్త‌వం కాదా? ప్ర‌తి ఇంటికీ బాండ్లు ఇచ్చిన మాట వాస్త‌వం కాదా? రెండేళ్లు అవుతున్నా ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి లేదు. పైగా ఉద్యోగుల‌పై క‌క్ష సాధింపులు ఇది జంగిల్ రాజ్ కాదా? ఉగాది రోజున మీ జీతాలు డ‌బుల్ చేస్తామ‌ని వాలంటీర్లకు మాట ఇచ్చి అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే వారి క‌డుపుకొట్టింది నువ్వు కాదా? 2.60 ల‌క్ష‌ల మందిని రోడ్డున ప‌డేసి, ఆ వ్య‌వ‌స్థే లేకుండా చేసిన అరాచ‌క‌త్వం నీదేక‌దా? మీ క‌క్ష సాధింపుల‌కు, మీరు ఉద్యోగుల‌పై పెట్టే ఒత్తిడుల‌కు ఒక్క స‌చివాలయ‌ ఉద్యోగులే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 250 మందికి పైగా ఆక‌స్మిక మ‌ర‌ణం పొందింది నిజం కాదా? చంద్ర‌బాబు గారూ.. సూటిగా ఒక ప్ర‌శ్న, మీ ప్ర‌భుత్వ హ‌యాంలో ఏపీ ఎన్జీవోస్ అధ్యక్షుడిగా ఉన్న అశోక్ బాబు మీ త‌ర‌ఫున క‌ర్ణాట‌క‌లో ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించ‌లేదా? బీజేపీని ఓడించ‌మ‌ని పిలుపు ఇవ్వ‌లేదా? మ‌రి ఎందుకు అత‌న్ని డిస్మిస్ చేయ‌లేదు? అంటే మీ వాళ్ల‌కు ఒక న్యాయం, ప‌క్క వాళ్ల‌కు మ‌రో న్యాయ‌మా?” అని వైఎస్ జగన్ ప్రశ్నించారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Chairman’s Desk : మహిళా బిల్లుకు డీలిమిటేషన్ ఉచ్చు.! అసలు వ్యూహం ఏంటి?

డీలిమిటేషన్ రాజ్యాంగ బాధ్యత అయితే.. మహిళా రిజర్వేషన్ల అమలు సామాజిక బాధ్యత....

BJP: ఉగ్రవాదుల్ని ‘‘గారు’’ అని పిలిచిన చరిత్ర కాంగ్రెస్‌ది…

BJP: ప్రధాని నరేంద్రమోడీని ‘‘ఉగ్రవాది’’ అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే...

OTR: సీఎం ప్రెస్ మీట్ లో NDSA ఛైర్మన్ ఉండటంపై బీజేపీ అభ్యంతరం

OTR: NDSA ఛైర్మన్‌ విషయంలో ఏదో తేడా కొడుతోందా? ఆయన...

Off The Record : హైలెవల్ బ్రిడ్జిపై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం

హైలెవల్‌ బ్రిడ్జి చుట్టూ హైటెన్షన్ పాలిటిక్స్‌ నడుస్తున్నాయా? శంకుస్థాపన రాయి పడీ...