27
November, 2026

A News 365Times Venture

27
Friday
November, 2026

A News 365Times Venture

YS Jagan: పంచాయతీ ఎన్నికల్లో అక్రమాలు..! జగన్ సంచలన ఆరోపణలు.. రీపోలింగ్‌కు డిమాండ్‌..

Date:

YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల సందడి కొనసాగుతోంది.. ఇక, ఈ రోజు జరిగిన తొలి విడత గ్రామ పంచాయతీ, రెండో విడత మున్సిపల్ ఎన్నికలపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్రంగా స్పందించారు. ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరిగాయని, ఓటర్లను బెదిరించడంతో పాటు పోలింగ్ ఏజెంట్లపై దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదిక ఎక్స్‌ (ట్విట్టర్‌)లో ఆయన వరుస ఆరోపణలు చేస్తూ ట్వీట్ చేశారు. ఎన్నికల్లో గెలవడానికి అక్రమాలే మార్గమా అంటూ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఓటర్లకు బెదిరింపులు.. పోలింగ్ ఏజెంట్లపై దాడులు
రెండో విడత మున్సిపల్, తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో పోలీసులు, ప్రభుత్వ అధికారులను ఉపయోగించుకుని వైసీపీ నేతలు, అభ్యర్థులు, మద్దతుదారులు, ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారని జగన్ ఆరోపించారు. ఓటర్లను చంపేస్తామంటూ బెదిరించారని, వైసీపీ మద్దతు అభ్యర్థులకు ఓటేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారని పేర్కొన్నారు. పోలింగ్ ఏజెంట్లపై దాడులు చేయడంతో పాటు వారి నియామక పత్రాలను చించివేసి, పోలింగ్ బూత్‌లలోకి రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్ష నేతలను కిడ్నాప్‌లు, హౌస్ అరెస్టుల ద్వారా ఎన్నికలకు దూరంగా ఉంచారని విమర్శించారు.

బ్యాలెట్ పేపర్ల చోరీ.. భారీగా రిగ్గింగ్
ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ల చోరీతో పాటు పోలీసుల అండతో భారీగా రిగ్గింగ్‌కు పాల్పడ్డారని జగన్ ఆరోపించారు. టీడీపీ కార్యకర్తలు పోలింగ్ బూత్‌లను స్వాధీనం చేసుకుని నకిలీ ఓటర్ కార్డులతో ఓట్లు వేశారని, ఓటు వేసిన తర్వాత వేలిపై వేసిన సిరా గుర్తులను చెరిపివేశారని పేర్కొన్నారు. అక్రమాలను ప్రశ్నించిన ప్రజలపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారని, ఘటనలను వీడియో తీసిన వారిపై దాడులు చేసి వారి ఫోన్లను లాక్కొని ధ్వంసం చేశారని ఆరోపించారు.

అహోబిలంలో ఎమ్మెల్యే కాన్వాయ్ వాహనంతో ప్రమాదం
అహోబిలంలో టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కాన్వాయ్‌లోని వాహనం వైసీపీ మద్దతుదారులపైకి దూసుకెళ్లిందని జగన్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ఘటనలో ఐదుగురు గాయపడగా, ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. మంగంపేటలో కూటమి మద్దతుదారుల దాడిలో ఓ పోలింగ్ ఏజెంట్ చేయి విరిగిందని ఆరోపించారు. ఇక, ప్రసన్నాయనపల్లిలో అధికారులను బెదిరించి బ్యాలెట్ పేపర్లను ఎత్తుకెళ్లారని జగన్ ఆరోపించారు. నరసాంపల్లిలో ఇద్దరు వ్యక్తులు బ్యాలెట్ బాక్సుల్లో సిరా పోయడంతో రెండు వార్డుల్లో పోలింగ్ నిలిచిపోయిందని పేర్కొన్నారు. వెల్లటూరులో పోలింగ్ బూత్ తలుపులు మూసివేసి, పోలీసుల ఎదుటే బయటి వ్యక్తులతో దొంగ ఓట్లు వేయించారని విమర్శించారు. ఈ ఘటనలన్నింటిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

అక్రమాలు జరిగిన ప్రాంతాల్లో రీపోలింగ్ నిర్వహించాలి
ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటరుకు ఎలాంటి భయం లేకుండా తన ఓటు హక్కును వినియోగించుకునే స్వేచ్ఛ ఉండాలని జగన్ పేర్కొన్నారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగిన ప్రాంతాల్లో వెంటనే రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఘటనలకు బాధ్యులైన టీడీపీ నేతలు, పోలీసు సిబ్బంది, ప్రభుత్వ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బెదిరింపులకు గురైన ప్రతి ఓటరు, దాడులకు గురైన ప్రతి పోలింగ్ ఏజెంట్, చోరీకి గురైన ప్రతి బ్యాలెట్ పేపర్ విషయంలో ప్రభుత్వం సమాధానం చెప్పాలని అన్నారు. ఇక, ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. తన ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రతి ఘటనకు చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో చోటుచేసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఘటనలపై ప్రభుత్వం స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి…

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

OTR: ఇంచార్జ్ Vs లోకల్ లీడర్స్: రాజంపేట టీడీపీలో అసమ్మతి సెగ.. చమర్తికి చెక్ పెడతారా?

OTR: వర్గ విభేదాలకు విరామం లేదు.. ఉన్న నేత విషయంలో అసంతృప్తి...

OTR: బలమున్న చోట కాదు.. బలం లేని చోట సత్తా చాటాలని ఆదేశం.. బీజేపీ యాక్షన్ ప్లాన్ ఏంటి?

OTR: తెలంగాణ మీద స్పెషల్‌ ఫోకస్‌ పెట్టిన బీజేపీ అధిష్టానం కొత్త...

Viral Video: కదులుతున్న రైలులో దీపం వెలిగించి పూజలు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ సీరియస్..

కదులుతున్న రైలు బోగీలో ఒక ప్రయాణికుడు దీపం వెలిగించి, శంఖం ఊదుతూ...

Cabinet Meeting: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల వేళ మోడీ కేబినెట్ కీలక భేటీ..

Cabinet Meeting: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం మధ్యాహ్నం 1...