27
November, 2026

A News 365Times Venture

27
Friday
November, 2026

A News 365Times Venture

OTR: బలమున్న చోట కాదు.. బలం లేని చోట సత్తా చాటాలని ఆదేశం.. బీజేపీ యాక్షన్ ప్లాన్ ఏంటి?

Date:

OTR: తెలంగాణ మీద స్పెషల్‌ ఫోకస్‌ పెట్టిన బీజేపీ అధిష్టానం కొత్త లెక్కలు వేస్తోందా? ఆ దిశగా పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తోందా? ఇన్నాళ్ళు ఒక ఎత్తు, ఇక మీదట మరో ఎత్తు అంటోందా? ఆ దిశగా పార్టీ ప్రజాప్రతినిధులకు కీలక ఆదేశాలిచ్చిందా? అయితే… ఏంటా ఆదేశాలు? పవర్‌ రేస్‌లో కాషాయదళం కేలిక్యులేషన్స్‌ ఎలా ఉన్నాయి? పార్టీకి బలం ఉన్న దగ్గర హంగామా చేయడం కాదు…. లేని చోటికి వెళ్ళండి, మీ సత్తా ఏంటో అక్కడ చూపించండి. హైదరాబాద్, కరీంనగర్ లాంటి చోట కాదు… ఖమ్మం, వరంగల్‌కు వెళ్ళి మీరేంటో చెప్పండి. ఇదీ…. ప్రస్తుతం తెలంగాణ బీజేపీ లీడర్స్‌కు హైకమాండ్‌ నుంచి వచ్చిన ఆదేశం. దాన్ని అమలు చేసే దిశగా పార్టీలో కసరత్తు మొదలైందట. ఆ మేరకు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు త్వరలోనే ఖమ్మం నుంచి యాక్షన్‌ ప్లాన్‌ మొదలు పెట్టబోతున్నట్టు చెబుతున్నాయి కాషాయవర్గాలు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాలని పావులు కదుపుతున్న కమలం పెద్దలు… ఆ దిశగా గట్టి కసరత్తే చేస్తున్నారట. అందుకు సంబంధించిన ప్రణాళికలు కూడా సిద్ధమవుతున్నట్టు చెప్పుకుంటున్నారు. బలహీనంగా ఉన్న జిల్లాల మీద స్పెషల్‌ ఫోకస్‌ పెడితేనే… పార్టీ సంస్థాగతంగా సెట్‌ అవడంతో పాటు పార్టీ అధికారంలోకి వస్తుందని నమ్ముతున్నారు నాయకులు.

అయితే.. కేవలం తాము నమ్మడమే కాకుండా… ఆ విషయమై ప్రజల్లో కూడా విశ్వాసం కల్పించాలన్న భావనలో ఢిల్లీ పెద్దలు ఉన్నట్టు చెప్పుకుంటున్నాయి పార్టీ వర్గాలు. ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం, అరాచకాన్ని అణచివేద్ద్దాం అనే నినాదంతో బీజేపీ మహా పాదయాత్రలు నిర్వహిస్తోంది. హైదరాబాద్‌, కరీంనగర్‌లో ఈ యాత్రలు సక్సెస్‌ఫుల్‌గా నడిచాయి. భారీగా ప్రజలు తరలి రావడంతో కేడర్‌లో కూడా ఉత్సాహం పెరిగింది. స్పందన బాగుందన్న సంతృప్తి వ్యక్తం కావడంతో… ఇక ఇదే ఊపుతో, ఈ టెంపో తగ్గకుండా స్టేట్‌ మొత్తం కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తున్నారట కాషాయ పెద్దలు. అందుకే… పార్టీ ప్రజాప్రతినిధులు ఉన్నచోట ఎలాగూ కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి… వాళ్ళు లేని ఏరియాల మీద స్పెషల్‌ ఫోకస్‌ పెట్టాలనుకుంటున్నట్టు సమాచారం. సంస్థాగతంగా అంతో ఇంతో బలంగా ఉన్న ప్రాంతాలను అలా ఉంచి… బలంలేని చోట కూడా కార్యక్రమాలు చేయాలని కేంద్ర పార్టీ ఆదేశించిందని అంటున్నారు.

ఆ క్రమంలోనే… ఖమ్మం, వరంగల్‌లో మహా పాదయాత్రలకు ప్లాన్‌ చేయమని చెప్పారట ఢిల్లీ పెద్దలు. త్వరలోనే ఈ రెండు చోట్ల కార్యక్రమాలు ఉంటాయని చెబుతున్నారు తెలంగాణ బీజేపీ నాయకులు. అటు మరీ… బలహీనంగా ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కార్యక్రమాలను సక్సెస్ చేయడానికి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఒక వారం పాటు అక్కడే మకాం వేయబోతున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి త్వరలోనే ప్రోగ్రాం ఖరారవుతుందని చెబుతున్నారు తెలంగాణ బీజేపీ లీడర్స్‌. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో బీజేపీ బలహీనంగా ఉంది. గత లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో పార్టీ బలం చూపగలిగినా… ఈ మూడు జిల్లాల పరిధిలోని పలు సెగ్మెంట్స్‌లో డిపాజిట్ కోసం కొట్లాడాల్సిన పరిస్థితి. అందుకే… పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావాలంటే….ఈ మూడు ఉమ్మడి జిల్లాల్లో బలోపేతం అవడం చాలా ముఖ్యమని భావిస్తున్నారట ఢిల్లీ పెద్దలు. అక్కడ సత్తా చాటకుండా… కీలకమైన మూడు ఉమ్మడి జిల్లాలను వదిలేసి వేరే చోట్ల ఎన్ని కబుర్లు చెప్పినా… ఉపయోగం ఉండబోదని, అన్నీ నీటి మీద రాతల్లా మారిపోతాయన్నది ఢిల్లీ పెద్దల అభిప్రాయం. అందుకే… అసెంబ్లీ రేస్‌లో మూడు హర్డిల్స్‌ని దాటడం కీలకమని భావించి ఆ దిశగా ఫోకస్‌ పెడుతున్నట్టు కనిపిస్తోందన్నది రాజకీయవర్గాల మాట.

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

OTR: ఇంచార్జ్ Vs లోకల్ లీడర్స్: రాజంపేట టీడీపీలో అసమ్మతి సెగ.. చమర్తికి చెక్ పెడతారా?

OTR: వర్గ విభేదాలకు విరామం లేదు.. ఉన్న నేత విషయంలో అసంతృప్తి...

YS Jagan: పంచాయతీ ఎన్నికల్లో అక్రమాలు..! జగన్ సంచలన ఆరోపణలు.. రీపోలింగ్‌కు డిమాండ్‌..

YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల సందడి కొనసాగుతోంది.. ఇక, ఈ...

Viral Video: కదులుతున్న రైలులో దీపం వెలిగించి పూజలు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ సీరియస్..

కదులుతున్న రైలు బోగీలో ఒక ప్రయాణికుడు దీపం వెలిగించి, శంఖం ఊదుతూ...

Cabinet Meeting: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల వేళ మోడీ కేబినెట్ కీలక భేటీ..

Cabinet Meeting: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం మధ్యాహ్నం 1...