5
November, 2026

A News 365Times Venture

5
Thursday
November, 2026

A News 365Times Venture

YS Jagan: చంద్రబాబు టీమ్‌కు కంగ్రాట్స్.. వైఎస్‌ జగన్ సంచలన ట్వీట్

Date:

YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరిగాయంటూ వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పోలీసు వ్యవస్థ, రాష్ట్ర ఎన్నికల సంఘం తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షాలకు పోటీ చేసే అవకాశం లేకుండా చేసి కూటమి విజయం సాధించిందని ఆరోపించారు. ఇవి ప్రజాస్వామ్యబద్ధమైన ఎన్నికలు కావని, కేవలం అభ్యర్థులను ఎంపిక చేసుకునే ప్రక్రియగా మారిపోయాయని ధ్వజమెత్తారు.

చంద్రబాబు నాయుడి టీమ్, పోలీసులు, రాష్ట్ర ఎన్నికల సంఘానికి అభినందనలు అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేసిన జగన్.. ప్రతిపక్షాలకు పోటీ చేసే అవకాశమే లేకుండా చేసి ఎన్నికల్లో ఘన విజయం ఎలా సాధించాలో నిరూపించారని విమర్శించారు. దేశంలో ఎన్నికల సంస్కరణల అవసరం ఇంతకంటే స్పష్టంగా మరెప్పుడూ కనిపించలేదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే ఎన్నికల సంస్కరణలు అత్యవసరమని అభిప్రాయపడ్డారు.

ఎన్నికల ప్రక్రియలో ప్రతి దశలోనూ అక్రమాలే..
ఎన్నికల ప్రక్రియలో ప్రతి దశలోనూ అక్రమాలు జరిగాయని జగన్ ఆరోపించారు. నామినేషన్ దశను హైజాక్ చేశారని, నామినేషన్ల పరిశీలనలోనూ అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియను కూడా తమకు అనుకూలంగా మార్చుకున్నారని విమర్శించారు. పోలింగ్ ఏజెంట్లను అడ్డుకోవడమే కాకుండా, కొందరిని బలవంతంగా బయటకు పంపించారని ఆరోపించారు. పోలింగ్ సమయంలో అక్రమాలు జరిగాయని, పోలింగ్ శాతాన్ని తారుమారు చేశారని అన్నారు. చివరకు ఓట్ల లెక్కింపు ప్రక్రియను కూడా హైజాక్ చేశారని తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

ప్రజలు ఎన్నుకోలేదు.. మీరే అభ్యర్థులను ఎంపిక చేశారు
అభ్యర్థులను అధికారంలో ఉన్నవారే ఎంపిక చేసుకున్నారని, ప్రజలు ఎన్నుకోలేదని జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రక్రియలో ప్రతిపక్షాలకు స్వేచ్ఛగా పోటీ చేసే అవకాశం కల్పించకుండా ఫలితాలను తమకు అనుకూలంగా మలుచుకున్నారని ఆరోపించారు. అందుకే ప్రస్తుత ఎన్నికలను ఎన్నికలుగా కాకుండా కేవలం సెలక్షన్లుగా మాత్రమే భావించాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. ఇక, తన ట్వీట్‌కు #CBNJungleRaj అనే హ్యాష్‌ట్యాగ్‌ను జతచేశారు. ఎన్నికల సంస్కరణల అవసరాన్ని మరోసారి ప్రస్తావిస్తూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా ట్యాగ్ చేస్తూ (ట్వీట్‌) ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి..

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Care Health Insurance పాలసీదారులకు షాక్.. ప్రైవేట్ ఆసుపత్రుల్లో క్యాష్‌లెస్ చికిత్స నిలిపివేత.!

Care Health Insurance: తెలంగాణలోని ప్రముఖ ప్రైవేట్, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులలో...

CM Chandrababu: కరువు నుంచి రైతన్న గట్టెక్కేలా ఆదుకోండి.. కేంద్ర బృందానికి సీఎం విజ్ఞప్తి..!

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా వ్యవసాయ రంగానికి...