5
November, 2026

A News 365Times Venture

5
Thursday
November, 2026

A News 365Times Venture

CM Chandrababu: కరువు నుంచి రైతన్న గట్టెక్కేలా ఆదుకోండి.. కేంద్ర బృందానికి సీఎం విజ్ఞప్తి..!

Date:

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా వ్యవసాయ రంగానికి జరిగిన నష్టాన్ని, ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను తీర్చేలా కేంద్ర ప్రభుత్వం అన్నివిధాలా సాయం అందించాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు కేంద్ర బృందానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితుల అంచనా కోసం రాష్ట్రంలో పర్యటించిన ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీం (IMCT) బుధవారం ముఖ్యమంత్రిని కలిసింది.

ఈనెల 2, 3 తేదీల్లో రెండు బృందాలుగా కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో పర్యటించిన సభ్యులు తమ కరువు అధ్యయన వివరాలు సీఎంకి తెలిపారు. రాష్ట్రంలోని తీర ప్రాంతం తుఫాన్ల సమస్యతో ఇబ్బందులు పడుతుంటే.. మరోవైపు తీవ్ర వర్షాభావ పరిస్థితులు, ఎల్ నినో కారణంగా రాయలసీమ సహా ఇంకొన్ని ప్రాంతాలు తీవ్ర కరవుతో అల్లాడుతున్నాయని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆ బృందానికి వివరించారు. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, పంట నష్టాలు, రైతుల సమస్యలు, ప్రభుత్వం చేపడుతున్న ఉపశమన చర్యలపై స్పష్టత లభించిందని వెల్లడించారు. రాష్ట్రంలో ఈ ఏడాది సాధారణం కంటే గణనీయంగా తక్కువ వర్షపాతం నమోదైందని, దీర్ఘకాలిక వర్షాభావ పరిస్థితుల కారణంగా ఖరీఫ్ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని సీఎం ఈ సందర్భంగా కేంద్ర బృందానికి తెలిపారు.

ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, సాగునీటితో పాటు తాగునీరు, పశుగ్రాసం సమస్యలు కూడా తలెత్తాయని వివరించారు. అనంతపురం జిల్లాలో దేశంలోనే రెండో అత్యల్ప వర్షపాతం నమోదైన పరిస్థితిని కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో 21 జిల్లాల్లో 388 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించామని, రైతులకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి కేంద్ర సాయం కోరుతూ ఇప్పటికే మెమొరాండం సమర్పించామన్నారు. వారం రోజుల్లో కరువు పరిస్థితులపై కేంద్రానికి నివేదిక కూడా సమర్పిస్తామని సీఎం చెప్పారు.

ప్రకృతి వ్యవసాయాన్ని మరింత విస్తృతంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని సీఎం పేర్కొన్నారు. అయితే ప్రకృతి వ్యవసాయంలో క్షేత్రస్థాయిలో మానవ వనరుల అవసరం ఎక్కువగా ఉంటుందని వివరించారు. ఈ నేపథ్యంలో వీబీ జీ రామ్ జీ పథకం కింద కనీస పనిదినాలను 200 రోజులకు పెంచి, వ్యవసాయ రంగానికి అవసరమైన పనులకు ఈ పథకాన్ని వినియోగించుకునేలా అవకాశం కల్పించాలని కేంద్ర బృందాన్ని కోరారు. దీంతో రైతులకు మానవ వనరుల సమస్య తీరడంతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు.

కరువు పరిస్థితుల వల్ల రైతుల ఆదాయం గణనీయంగా తగ్గిపోతోందని, వ్యవసాయ రుణాల చెల్లింపులపై కూడా ప్రభావం పడుతోందని సీఎం వివరించారు. గతంలో రాయలసీమలో పది ఎకరాల భూమి ఉన్న రైతులకు సైతం కరువు పరిస్థితుల దృష్ట్యా రేషన్ కార్డులు అందించామని గుర్తుచేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో అర్హులైన కరువు బాధిత కుటుంబాలకు డ్రాట్ కార్డులు జారీ చేసే అంశాన్ని పరిశీలించాలని కోరారు. దీంతో కేంద్ర సహకారంతో నిత్యావసర సరుకుల ధరలు సబ్సిడీపై అందించే వీలుంటుందని చెప్పారు. అలాగే, రైతులకు రుణాల రీషెడ్యూలింగ్ వంటి ఉపశమన చర్యలు అందేలా కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భ జల మట్టాలు గణనీయంగా పడిపోయాయని సీఎం చెప్పుకొచ్చారు. అనేక ప్రాంతాల్లో అదనంగా బోర్లు వేసినా ఆశించిన ఫలితం ఉండటం లేదని వివరించారు. అందువల్ల తాత్కాలిక నీటి సరఫరా చర్యలతో పాటు శాశ్వత పరిష్కారాలపై దృష్టి పెట్టాలని సూచించారు. జల్ జీవన్ మిషన్ (JJM) పథకాన్ని మరింత విస్తరించి, గ్రామీణ ప్రాంతాల్లో నీటి వనరులను అభివృద్ధి చేయడం, అనుసంధానించడం వంటి సమర్ధ నీటి నిర్వహణ పనులకు కేంద్రం సహకరించాలని కోరారు. కరువు కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు పంటల బీమా పరిహారంతో పాటు ఇన్‌పుట్ సబ్సిడీ కూడా అందేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి తెలిపారు. అయితే, పంటల బీమా క్లెయిమ్‌ల పరిష్కారంలో జాప్యం లేకుండా త్వరితగతిన రైతుల ఖాతాల్లో పరిహారం జమయ్యేలా కేంద్రం చొరవ తీసుకోవాలని కోరారు. రైతులకు సకాలంలో పరిహారం అందితే తదుపరి పంటల సాగుకు ఆర్థికంగా కొంత వెసులుబాటు కలుగుతుందని వివరించారు. కరువు ప్రభావం వ్యవసాయానికే పరిమితం కాకుండా పశుసంపద, గ్రామీణ జీవనోపాధిపై కూడా పడుతున్నందున పశుగ్రాసం, తాగునీటి సరఫరా వంటి అంశాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

రాష్ట్రంలోని కరువు ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాలను, రైతుల సమస్యలను పరిశీలించింది. రైతులతో నేరుగా మాట్లాడి పరిస్థితులను తెలుసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం అందించిన వివరాలు, క్షేత్రస్థాయి పరిశీలనల ఆధారంగా 15 రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని బృందం తెలిపింది. ఆ నివేదిక ఆధారంగా రాష్ట్రానికి అవసరమైన కేంద్ర సహాయంపై తదుపరి చర్యలు తీసుకోనున్నారు. అలాగే రాష్ట్రంలో ఒకవైపు తీవ్ర కరువు పరిస్థితులు నెలకొంటే, మరోవైపు కోస్తాంధ్ర జిల్లాల్లో తుపాను కారణంగా పంటలు, ఇతర రంగాలకు నష్టం వాటిల్లిందని సీఎం కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లారు. ఈ విభిన్న ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో రాష్ట్రాన్ని ఆదుకునేందుకు కేంద్రం ప్రత్యేకంగా స్పందించి తగిన సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

CM Chandrababu Aerial Survey: మురసు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం ఏరియల్ వ్యూ..

CM Chandrababu Aerial Survey: ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర వర్షాభావ పరిస్థితులతో రైతులు...

Anshul Kamboj: అతని బౌలింగ్ నిజంగా అద్భుతం.. అరుదైన క్లబ్‌లో చోటు..!

Anshul Kamboj: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్న...

ICC ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. టాప్ ప్లేస్‌కు మిచెల్ స్టార్క్.. ఏడో స్థానానికి శ్రేయస్ అయ్యర్..!

ICC Rankings: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) తాజాగా ప్రకటించిన పురుషుల...

Diwali Firecracker Smoke: బాణసంచా పొగతో తలనొప్పి వస్తోందా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!

దీపావళి పండుగ అనగానే వెలుగులు, స్వీట్లు, కాకరపువ్వులు, బాణసంచా సందడే గుర్తుకొస్తుంది....