27
April, 2026

A News 365Times Venture

27
Monday
April, 2026

A News 365Times Venture

WHCD Shooter: నిందితుడి హిట్‌ లిస్ట్‌ నుంచి అతనొక్కడే మినహాయింపు.. కారణమేంటో..! సర్వత్రా చర్చ

Date:

అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలోని ట్రంప్ ఇచ్చిన వైట్‌హౌస్‌ కరస్పాండెంట్స్ డిన్నర్ సందర్భంగా జరిగిన కాల్పులు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపాయి. హిల్టన్ హోటల్‌లో గ్రాండ్‌గా విందు జరుగుతుండగా 31 ఏళ్ల కోల్ థామాస్ అలెన్ తుపాకులతో విరుచుకుపడ్డాడు. ఈ ఘటనతో విందు ఒక్కసారిగా గందరగోళానికి గురైంది. అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ను భద్రతా సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఇక వెంటనే నిందితుడిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకుంది. అతడి దగ్గర నుంచి షాట్‌గన్, హ్యాండ్‌గన్, పలు కత్తులు స్వాధీనం చేసుకున్నారు.

అయితే విచారణలో తాజాగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాల్పులకు ముందు నిందితుడు కోల్ థామాస్ అలెన్ తన టార్గెట్‌కు సంబంధించిన విషయాలను ముందుగానే కుటుంబ సభ్యులకు పంపించాడు. ట్రంప్ పరిపాలనలో ఉన్న ఉన్నతాధికారులే తన లక్ష్యమని కుటుంబ సభ్యులకు సందేశం పంపించాడు. ఇందులో ఆశ్చర్యమేంటంటే.. అమెరికాలో అత్యున్నత పదవిలో ఉన్న ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ కాష్ పటేల్‌ను మాత్రం తప్పించాడు. కాష్ పటేల్ మినహా మిగతా అధికారులంతా తన లక్ష్యమని నిందితుడు కుటుంబ సభ్యులకు తెలియజేసినట్లుగా అమెరికా మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ‘‘ది న్యూయార్క్ పోస్ట్’’ తన నివేదికలో పేర్కొంది. అయితే ఇప్పుడు కాష్ పటేల్‌ను ఎందుకు మినహాయించాడన్న దానిపై సర్వత్రా చర్చ నడుస్తోంది.

ఇక నిందితుడు ‘‘కోల్.’’ ‘‘కోల్డ్‌ఫోర్స్’’, ‘‘ఫ్రెండ్లీ ఫెడరల్ అసాసిన్’’ పేరుతో తన మేనిఫెస్టో లక్ష్యాన్ని రూపొందించుకున్నట్లు తెలుస్తోంది. ఈ టార్గెట్‌లో అధ్యక్షుడిని లక్ష్యంగా చేసుకుని దాడి చేయాలన్న ఉద్దేశాన్ని వ్యక్తం చేశాడు. అధ్యక్షుడితో పాటు ఉన్నతాధికారులే తన లక్ష్యమని కుటుంబ సభ్యులకు ముందుగానే సమాచారం అందించాడు. సాధ్యమైనంత మట్టుకు ప్రాణ నష్టం తక్కువగా జరగాలని.. అవసరమైతేనే తప్ప సీక్రెట్ సర్వీస్‌పై దాడి చేస్తానని.. లేదంటే చేయబోనని పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. ఇక కాల్పుల తర్వాత కాష్ పటేల్‌ను అక్కడ నుంచి భద్రతా సిబ్బంది తీసుకెళ్లిపోయారు. అనంతరం వైట్‌‌హౌస్‌లో జరిగిన ప్రెస్ బ్రీఫింగ్‌లో పాల్గొన్నారు.

Kdke

ఇక నిందితుడు కాలిఫోర్నియా నుంచి రైలులో వాషింగ్టన్‌కు వచ్చినట్లుగా గుర్తించారు. అతడు మంచి విద్యావంతుడు. ఇంజనీరింగ్ నేపథ్యం ఉండి.. టీచర్‌గా గేమ్ డెవలప్‌గా కూడా పని చేసినట్లుగా కనిపెట్టారు. అయితే ఇటీవల ఇతగాడి ప్రవర్తనలో మార్పులు వచ్చాయని.. సమాజ సమస్యలపై చర్యలు తీసుకోవాలని మాట్లాడేవాడని కుటుంబ సభ్యులు విచారణలో వెల్లడించారు. ప్రస్తుతం నిందితుడిపై ఎఫ్‌బీఐ, యూఎస్ సీక్రెట్ సర్వీస్ సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నాయి. నిందితుడిపై ఆయుధాలతో దాడి యత్నం, ఫెడరల్ అధికారిపై దాడి కింద కేసులు నమోదు చేసే అవకాశం ఉంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

IPL 2026లో కొంపముంచుతున్న క్యాచ్ డ్రాప్‌లు.. మారిపోతున్న మ్యాచ్‌ల లెక్కలు..

IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్‌లో ఒక...

Dhanush : వెంకీ అట్లూరితో ధనుష్ సినిమా.. ఓపెన్ ఆఫర్ ఇచ్చిన సార్

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి...

Hero Splendor: సేల్స్ లో గర్జిస్తున్న స్ల్పెండర్ ప్లస్.. FY26 బెస్ట్ సెల్లింగ్ బైక్స్ టాప్ 5 లిస్ట్ ఇదే

హీరో స్ల్పెండర్ ప్లస్ కు దేశ వ్యాప్తంగా ఎలాంటి క్రేజ్ ఉంటుందో...

Renault Bridger: పెట్రోల్ నుంచి CNG, EV వరకు.. భారీ ప్లాన్‌తో వస్తున్న రెనాల్ట్ బ్రిడ్జర్‌

Renault Bridger: భారత కార్ల మార్కెట్ విస్తరిస్తోంది. దేశ విదేశీ కంపెనీలు...