20
July, 2026

A News 365Times Venture

20
Monday
July, 2026

A News 365Times Venture

Vikram-1 Launch: చరిత్ర సృష్టించిన విక్రమ్-1.. భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విజయవంతం

Date:

Vikram-1 Launch Success: భారత ప్రైవేట్ అంతరిక్ష రంగంలో శనివారం ఒక సరికొత్త చరిత్ర లిఖించబడింది. ప్రైవేట్ రంగంలో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసిన దేశపు మొట్టమొదటి ఆర్బిటల్-క్లాస్ రాకెట్ ‘విక్రమ్-1’ (Vikram-1) శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (SDSC-SHAR) నుంచి విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఈ చారిత్రాత్మక ప్రయోగానికి ‘మిషన్ ఆగమన్’ (Mission Aagaman) అని పేరు పెట్టారు. ఈ విజయంతో వాణిజ్యపరంగా సొంతంగా రాకెట్లను తయారు చేసి కక్ష్యలోకి పంపగల సామర్థ్యం ఉన్న ప్రపంచంలోని కొన్ని ఎంపిక చేసిన దేశాల సరసన భారతదేశం నిలిచింది.

నిప్పులు చిమ్ముతూ విక్రమ్-1 రాకెట్ ఆకాశంలోకి దూసుకెళ్తున్న దృశ్యం, గత కొన్నేళ్లుగా మన ఇంజనీర్లు పడ్డ కష్టానికి, వారి నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచింది. ప్రయోగానికి కొన్ని నిమిషాల ముందు చిన్న అంతర్గత సాంకేతిక కారణం (Internal Hold) వల్ల కొంత సమయం ఆలస్యమైనప్పటికీ, ఆ తర్వాత రాకెట్‌లోని అన్ని దశలు అనుకున్నట్లుగా, అత్యంత ఖచ్చితత్వంతో పనిచేశాయి. సుమారు ఏడు అంతస్తుల ఎత్తు ఉండే ఈ విక్రమ్-1 రాకెట్‌ను పూర్తిగా తేలికపాటి కార్బన్ కంపోజిట్ మెటీరియల్‌తో తయారు చేశారు. ఇది భూమికి దగ్గరగా ఉండే దిగువ కక్ష్యలోకి (Low Earth Orbit) దాదాపు 350 కిలోల బరువున్న ఉపగ్రహాలను మోసుకెళ్లగలదు. ఈ రాకెట్ ఇంజన్‌లను సరికొత్త 3D-ప్రింటింగ్ టెక్నాలజీతో, పూర్తి స్వదేశీ సాంకేతికతతో రూపొందించడం విశేషం.

ఈ తొలి ప్రయోగంలో భాగంగా గృహా స్పేస్ (Grahaa Space), కాస్మోసెర్వ్ (Cosmoserve), డి-క్యూబ్డ్ (DCubed) వంటి సంస్థలకు చెందిన సాంకేతిక ప్రదర్శన ఉపగ్రహాలతో పాటు, స్కైరూట్ సంస్థకు చెందిన ‘స్కోప్’ (SCOPE) అనే ఎక్స్‌పెరిమెంట్‌ను కూడా అంతరిక్షంలోకి పంపారు. సాంకేతిక పరికరాలతో పాటు ఎంతో ప్రత్యేకమైన భావోద్వేగ వస్తువులను కూడా ఈ రాకెట్ ద్వారా నింగిలోకి పంపించారు. వాటిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వహస్తాలతో రాసిన వందేమాతరం పోస్ట్‌కార్డ్‌తో పాటు, ఇస్రో ప్రస్తుత, మాజీ ఛైర్మన్లు, భారతీయ వ్యోమగాములు, ఇన్వెస్టర్లు పంపిన రాతపూర్వక సందేశాలు ఉన్నాయి. ఈ ప్రయోగం ద్వారా లభించే కీలకమైన ఇంజనీరింగ్ డేటా ఆధారంగా స్కైరూట్ సంస్థ భవిష్యత్తులో మరిన్ని వాణిజ్య ప్రయోగాలను మరింత వేగంగా చేయగలుగుతుంది.

మన దేశ అంతరిక్ష రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలకు ఈ విజయం ఒక పెద్ద మైలురాయిగా నిలిచింది. ఇస్రోకు చెందిన మాజీ శాస్త్రవేత్తలు పవన్ కుమార్ చందన, నాగ భరత్ డాకా కలిసి 2018లో ఈ ‘స్కైరూట్ ఏరోస్పేస్’ (Skyroot Aerospace) సంస్థను స్థాపించారు. చిన్న ఉపగ్రహాల మార్కెట్‌లో తక్కువ ఖర్చుతో, నమ్మకమైన సేవలను అందించాలనే లక్ష్యంతో వారు ప్రయాణాన్ని ప్రారంభించారు. అంతకుముందు 2022లో వీరు ప్రయోగించిన ‘విక్రమ్-ఎస్’ (Vikram-S) దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ సబ్-ఆర్బిటల్ రాకెట్‌గా రికార్డు సృష్టించగా, ఇప్పుడు ‘విక్రమ్-1’తో ప్రైవేట్ ఆర్బిటల్ ప్రయోగాన్ని కూడా విజయవంతం చేసి భారత కీర్తిపతాకాన్ని విశ్వవీధిలో ఎగురవేశారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్‌కార్ లాంచ్.. ధర ఎంతంటే?

Ferrari Amalfi Spider: ఇటాలియన్ లగ్జరీ స్పోర్ట్స్ కార్ల తయారీ సంస్థ...

CJP Protest: ‘ఛలో పార్లమెంట్‌’ ఉద్యమంలో కీలక పరిణామం..

CJP Protest: ఢిల్లీలో జరుగుతున్న ‘ఛలో సంసద్’ ఉద్యమం మధ్య కీలక...

CJP Parliament March: ఢిల్లీలో టెన్షన్‌.. టెన్షన్‌.. పార్లమెంట్‌ వరకు దూసుకెళ్లిన CJP కార్యకర్తలు..

CJP Parliament March: ఢిల్లీ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలి రోజే...

SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?

SAIL Recruitment: ప్రభుత్వ రంగ సంస్థలో అప్రెంటిస్‌షిప్ చేయాలనుకునే ఐటీఐ, డిప్లొమా,...