19
July, 2026

A News 365Times Venture

19
Sunday
July, 2026

A News 365Times Venture

Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ

Date:

E20 పెట్రోల్ గురించి సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు. 100 శాతం స్వచ్ఛమైన పెట్రోల్ మాత్రమే కావాలనుకునే వారు, ఎక్కువ ధర చెల్లించి దానిని కొనుగోలు చేయవచ్చని ఆయన స్పష్టం చేశారు. దేశంలోని అన్ని పెట్రోల్ బంకుల్లో E20 ఇంధనం అందుబాటులోకి వచ్చిన తర్వాత వేరే ప్రత్యామ్నాయాలు సాధ్యం కాదని, అయితే ఇథనాల్ లేని పెట్రోల్ కోరుకునే వారి కోసం ప్రీమియం ధరలో అది లభిస్తుందని చెప్పారు. ఇథనాల్ కలపడం వల్ల వాహనాలు పాడవుతాయనే వార్తల్లో నిజం లేదని, ఇప్పటివరకు ఎలాంటి సమస్యలు రాలేదని ఆయన స్పష్టం చేశారు.

సోషల్ మీడియాలో వస్తున్న పుకార్ల వల్ల వాహనదారుల్లో ఉన్న ఆందోళనలను తొలగించడానికి ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి ప్రభుత్వ రంగ చమురు సంస్థలు దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో ఇంధన నాణ్యత తనిఖీలను మరింత ముమ్మరం చేశాయి. ఇంధన నాణ్యతపై ఏవైనా ఫిర్యాదులు ఉంటే నేరుగా బంకుల్లో లేదా కస్టమర్ కేర్‌లో నమోదు చేయాలని, సోషల్ మీడియా పోస్టులను నమ్మవద్దని చమురు సంస్థలు కోరాయి.

మరోవైపు.. ఐఐటీ కాన్పూర్ పరిశోధకులు కూడా E20 ఇంధనంపై కీలక విషయాలను వెల్లడించారు. E20 పెట్రోల్ వల్ల వాహనాల ఇంజన్లకు ఎలాంటి నష్టం వాటిల్లదని, తుప్పు పట్టడం లేదా ఇతర సాంకేతిక సమస్యలు తలెత్తుతాయనడానికి ఎలాంటి ఆధారాలు లేవని ఐఐటీ కాన్పూర్ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన పరిశోధకుడు ధృవ రాజ్ కర్ణా స్పష్టం చేశారు. విస్తృత పరిశోధనల తర్వాతే ఈ విషయాన్ని నిర్ధారించినట్లు ఆయన తెలిపారు.

అలాగే.. చాలా మంది భయపడుతున్నట్లుగా E20 పెట్రోల్ వల్ల వాహనాల మైలేజీలో ఎలాంటి పెద్ద మార్పులు లేదా తగ్గుదల కనిపించలేదని పేర్కొన్నారు. నిజానికి మైలేజీ అనేది ఇంధనం కంటే కూడా వాహనం నడిపే విధానం, రోడ్ల పరిస్థితి, వాహనం యొక్క సకాలంలో మెయింటెనెన్స్ (రహదారి రక్షణ)పైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుందని వివరించారు. ఇప్పటివరకు జరిపిన అన్ని పరీక్షల్లో ఇంజన్ మన్నికపై గానీ, వాహన వేగంపై గానీ E20 ఇంధనం వల్ల ఎలాంటి ప్రతికూల ప్రభావం పడలేదని పరిశోధకులు తేల్చి చెప్పారు. కాబట్టి వాహనదారులు ఎలాంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని స్పష్టమవుతోంది.

 

 

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్‌.. చర్యలకు ఆదేశాలు..

CM Chandrababu: గుంటూరు కృష్ణబాబు కాలనీలో మహిళపై దాడి ఘటన తనను...

Aamir Khan: ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్..అమీర్ ఖాన్‌ను టార్గెట్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌!

Aamir Khan: బాలీవుడ్‌లో వరుస బెదిరింపుల పర్వం కలకలం రేపుతోంది. ప్రముఖ...

Vikram-1 Launch: చరిత్ర సృష్టించిన విక్రమ్-1.. భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విజయవంతం

Vikram-1 Launch Success: భారత ప్రైవేట్ అంతరిక్ష రంగంలో శనివారం ఒక...

Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!

Messi vs Ronaldo Luxury Phones: స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో ఎప్పటినుంచో కొనసాగుతున్న...