28
May, 2026

A News 365Times Venture

28
Thursday
May, 2026

A News 365Times Venture

Vaibhav Sooryavanshi: క్రిస్ గేల్ ఆల్‌టైమ్ ఐపీఎల్ రికార్డుకు ఎసరు.. గురి తప్పదంటున్న వైభవ్ సూర్యవంశీ..

Date:

టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యంత విధ్వంసకర బ్యాటర్‌గా పేరొందిన వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ నెలకొల్పిన ఒక అద్భుతమైన ఐపీఎల్ రికార్డు ఇప్పుడు ప్రమాదంలో పడింది. రాజస్థాన్ రాయల్స్ జట్టుకు చెందిన 15 ఏళ్ల సంచలన బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఈ రికార్డును బద్దలు కొట్టడానికి కేవలం అడుగు దూరంలో ఉన్నాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో ఈ యువ ఓపెనర్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినప్పటికీ, బుధవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరగనున్న ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఎలాగైనా సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నాడు. యశస్వి జైస్వాల్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించనున్న సూర్యవంశీ.. జట్టుకు మెరుపు ఆరంభాన్ని ఇవ్వడమే కాకుండా, గేల్ పేరిట ఉన్న మోస్ట్ సిక్సర్ల రికార్డును దాటాలని చూస్తున్నాడు.

ప్రమాదంలో క్రిస్ గేల్ ‘సిక్సర్ల’ రికార్డు
2012 ఐపీఎల్ ఎడిషన్‌లో క్రిస్ గేల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరఫున ఆడుతూ ఒకే సీజన్‌లో ఏకంగా 59 సిక్సర్లు బాది రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఒకే ఐపీఎల్ సీజన్‌లో లేదా ఒకే టీ20 టోర్నమెంట్‌లో నమోదైన అత్యధిక సిక్సర్ల రికార్డు ఇదే. ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ ఈ సీజన్‌లో 53 సిక్సర్లతో గేల్ రికార్డుకు అత్యంత సమీపంలో ఉన్నాడు. క్రిస్ గేల్ రికార్డును అధిగమించాలంటే సూర్యవంశీకి ఇంకా 7 సిక్సర్లు కావాలి. అయితే, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే ఎలిమినేటర్ మ్యాచ్ నాకౌట్ కావడంతో.. ఒకవేళ రాజస్థాన్ రాయల్స్ ఓడిపోతే సూర్యవంశీకి గేల్ రికార్డును బద్దలు కొట్టేందుకు ఇదే చివరి అవకాశం అవుతుంది. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన గత రెండు లీగ్ మ్యాచ్‌ల్లోనూ రాజస్థాన్ ఓడిపోవడంతో, పాట్ కమిన్స్ నేతృత్వంలోని హైదరాబాద్ జట్టుపై గెలవడం రాజస్థాన్‌కు చావో రేవో లాంటిదే.

వైభవ్ సూర్యవంశీ అద్భుత గణాంకాలు..
బీహార్‌కు చెందిన ఈ అద్భుత బాలేంద్రుడు ఈ ఐపీఎల్ సీజన్‌లో దిగ్గజ ఆటగాళ్లను సైతం ఆశ్చర్యపరిచేలా బ్యాటింగ్ చేశాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 14 మ్యాచ్‌ల్లో సూర్యవంశీ 41.64 సగటుతో, అలాగే 232.67 భారీ స్ట్రైక్ రేట్‌తో మొత్తం 583 పరుగులు సాధించాడు. ఇందులో ఒక అద్భుత శతకంతో పాటు మూడు అర్ధశతకాలు కూడా ఉన్నాయి. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ వంటి సీనియర్ ఆటగాళ్లలా నిలకడ ప్రదర్శిస్తూనే.. క్రిస్ గేల్ తరహాలో విధ్వంసకర బ్యాటింగ్‌తో అలరిస్తున్నాడు.

సూర్యవంశీ ఈ సీజన్‌లో సాధించిన పరుగులలో 54 శాతానికి పైగా పరుగులు కేవలం సిక్సర్ల ద్వారానే రావడం విశేషం. ప్రతి 4.7 బంతులకు ఒక సిక్స్ చొప్పున బాదుతున్న ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ ఫామ్‌లో ఉంటే, ఒకే మ్యాచ్‌లో 7 సిక్సర్లు కొట్టడం అతనికి పెద్ద కష్టమేమీ కాదు. ఒకవేళ ఆ ఏడు సిక్సర్లు కొడితే గేల్ రికార్డు బద్దలవుతుంది.

డబుల్ సెంచరీపై కన్ను
కేవలం ఒకే సీజన్‌లో అత్యధిక సిక్సర్ల రికార్డే కాకుండా, క్రిస్ గేల్ పేరిట ఉన్న మరో అజేయ రికార్డుపై కూడా ఈ 15 ఏళ్ల కుర్రాడు కన్నేశాడు. టీ20 క్రికెట్ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు (175 నాటౌట్) చేసిన రికార్డు కూడా క్రిస్ గేల్ పేరిటే ఉంది. అయితే, తాను టీ20 ఫార్మాట్‌లో ఏకంగా డబుల్ సెంచరీ (200 పరుగులు) సాధించి ఆ రికార్డును కూడా తుడిచిపెట్టేయడమే తన ఆశయమని సూర్యవంశీ ఇటీవలే బహిరంగంగా ప్రకటించాడు. మరి బుధవారం జరిగే హై-వోల్టేజ్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఈ వండర్‌కిడ్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Trinamool congress: బెంగాల్‌లో టీఎంసీ పతనానికి నాంది.. బీజేపీలోకి 20 మంది ఎంపీలు..?

Trinamool congress: పశ్చిమ బెంగాల్లో సీఎం సువేందు అధికారి దూకుడుకు మమతా...

Terror Plot: ఢిల్లీ, పంజాబ్‌లో భారీ దాడులకు కుట్ర.. పాక్‌ పన్నాగం విఫలం..

ఢిల్లీ, పంజాబ్ లలో భారీ దాడులు చేసేందుకు ప్రయత్నిస్తున్న ఉగ్ర ముఠాను...

Siddaramaiah: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఎగ్జిట్.. హైకమాండ్ ఫోర్స్ చేసిందా? ఆయనే లొంగిపోయారా?

కర్ణాటక రాజకీయాల్లో ఒక శకం ముగిసింది. దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయ యవనికపై...

Motkupalli Narasimhulu: ఎన్టీఆర్‌ను గుర్తుచేసుకుంటూ మోత్కుపల్లి భావోద్వేగం.. “మనసున్న నాయకుడిని మళ్లీ చూడలేం”

Motkupalli Narasimhulu: స్వర్గీయ ఎన్టీఆర్‌ను గుర్తుచేసుకుంటూ మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు,...