24
June, 2026

A News 365Times Venture

24
Wednesday
June, 2026

A News 365Times Venture

Vaibhav: అది సార్ ‘వైభవ్ సూర్యవంశీ’ అంటే.. తిట్టిన నోళ్లే జేజేలు కొట్టాయి.. ఫిదా అయిన లంక ఆటగాళ్లు..

Date:

శ్రీలంక ఏ జట్టుతో జరిగిన ట్రై-నేషన్ సిరీస్ ఫైనల్లో భారత యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ప్రపంచ రికార్డు సృష్టించాడు. లీగ్ దశలో పేలవ ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొన్న 15 ఏళ్ల బీహార్ సంచలనం.. తుది పోరులో కేవలం 29 బంతుల్లో 94 పరుగులు చేసి భారత్ ఏ జట్టు 377/9 భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. గత మ్యాచ్‌లో లంక ఆటగాళ్లతో గొడవ జరిగినప్పటికీ, ఈ మ్యాచ్‌లో అతని అద్భుత ఆటతీరును చూసి ప్రత్యర్థి ఆటగాళ్లు సైతం వెన్నుతట్టి అభినందించడం క్రీడాస్ఫూర్తికి నిదర్శనంగా నిలిచింది. దీనిపై సోషల్ మీడియాలో అతడి అభిమానులు సైతం.. వైభవ్ సూర్యవంశీ అంటే అది.. తిట్టిన నోళ్లే జైజైలు కొట్టేలా చేసుకున్నాడు అంటూ పోస్టులు చేస్తున్నారు.

ప్రపంచ రికార్డు బద్దలు..
సూర్యవంశీ కేవలం 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి, లిస్ట్-ఎ క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన అర్ధశతకం నమోదు చేశాడు. దీనితో 2005లో శ్రీలంక ఆటగాడు కౌశల్య వీరరత్నే (12 బంతుల్లో) నెలకొల్పిన 21 ఏళ్ల నాటి రికార్డు స్క్రీన్ నుంచి చెరిగిపోయింది. సూర్యవంశీ ఎదుర్కొన్న మొదటి 11 బంతుల స్కోరు ఇలా ఉంది.. 4, 4, 4, 6, 6, 0, 6, 4, 4, 6, 6.

విధ్వంసకర ఇన్నింగ్స్ హైలైట్స్
ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య (39)తో కలిసి సూర్యవంశీ మొదటి వికెట్‌కు కేవలం 9 ఓవర్లలోనే 132 పరుగులు జోడించాడు. పేసర్లను లక్ష్యంగా చేసుకుంటూ లెగ్ సైడ్, ఆపై ఆఫ్ సైడ్‌లో మైదానం నలుమూలలా బౌండరీలు బాదాడు. ఎక్స్‌ట్రా కవర్ మీదుగా అతను కొట్టిన మూడు సిక్సర్లు మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచాయి. అత్యంత వేగవంతమైన సెంచరీ వైపు దూసుకెళ్తున్న సూర్యవంశీ.. సహన్ అరాచ్చిగే బౌలింగ్‌లో మిడ్-ఆఫ్‌లో క్యాచ్ ఇచ్చి తృటిలో శతకం చేజార్చుకున్నాడు.

లంక పునరాగమనం ..
ఓపెనర్లు అవుటయ్యాక శ్రీలంక బౌలర్లు మ్యాచ్‌ను నియంత్రించారు. కెప్టెన్ తిలక్ వర్మ (67), రుతురాజ్ గైక్వాడ్ (40) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఆఖర్లో అనుకుల్ రాయ్ (39), విప్రాజ్ నిగమ్ (27) మెరుపులు మెరిపించడంతో భారత్ 350 మార్కును దాటి భారీ స్కోరును బోర్డుపై ఉంచగలిగింది. అయినా, ఈ మ్యాచ్ మొత్తం సూర్యవంశీ విశ్వరూపంతోనే గుర్తుండిపోతుంది.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

6.39mm స్లిమ్ డిజైన్‌, 144Hz AMOLED డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీతో TECNO CAMON Slim లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

TECNO CAMON Slim Launched: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో కొత్త ట్రెండ్‌ను సృష్టించేలా...

Saikrishna Custodial Death Case: సీఐ నాగరాజు రిమాండ్ రిపోర్టు.. వెలుగులోకి సంచనల విషయాలు!

విజయవాడలో సంచలనం రేపిన సాయికృష్ణ అదృశ్యం, మృతి కేసులో ప్రత్యేక దర్యాప్తు...

CBSE రీవాల్యుయేషన్‌లో అద్భుతం.. 500కు 500 మార్కులు సాధించిన ‘అవ్ని కేజ్రీవాల్’.!

CBSE Revaluation: సీబీఎస్ఈ 12వ తరగతి రీవాల్యుయేషన్ ఫలితాల్లో రాంచీకి చెందిన...

TMC Crisis: మమతా బెనర్జీపైనే వేటు వేసిన టీఎంసీ తిరుగుబాటు వర్గం.. కొత్త బాస్‌గా అరూప్ రాయ్ ప్రకటన!

TMC Crisis: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. అధికార...