23
June, 2026

A News 365Times Venture

23
Tuesday
June, 2026

A News 365Times Venture

NEET Exam: “నాకు నీట్ కాదు, బురఖానే ముఖ్యం”.. పరీక్ష రాయనన్న ముస్లిం విద్యార్థిని.

Date:

NEET Exam: రాజస్థాన్ అజ్మీర్‌లో 18 ఏళ్ల ముస్లిం విద్యార్థిని కుల్సుమ్ బానో, బురఖా తీయమన్నందుకు నీట్ పరీక్ష రాయనని చెప్పింది.  కుల్సుమ్ బురఖా, దుపట్టా ధరించి ఉంది, ఆమె పరీక్ష కేంద్రానికి చేరుకున్న తర్వాత భద్రతా సిబ్బంది, స్క్రీనింగ్ సిబ్బంది బురఖాతో లోపలికి అనుమతించేందుకు నిరాకరించారు. అయితే, మతపరమైన దుస్తులు ధరించడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) అనుమతిస్తుందని, అయినా తనను పరీక్షకు అనుమతించలేదని విద్యార్థిని మీడియాతో అన్నారు. మే 3న పరీక్ష రాసినప్పుడు ఎలా బురఖా, దుపట్టా ధరించి వెళ్లాలో, ఇప్పుడు కూడా నేను అలాగే పరీక్షకు హాజరయ్యానని, ఆ సమయంలో మమ్మల్ని ఎవరూ ఆపలేదని ఇప్పుడు మాత్రం నిరాకరించారని కుల్సుమ్ ఆవేదన వ్యక్తం చేసింది.

ఒక ముస్లింగా తన గుర్తింపు కోల్పోవడం కన్నా పరీక్ష వదులుకోవడానికే తాను సిద్ధంగా ఉన్నానని బానో చెప్పారు. ఒక వేళ నేను పరీక్ష రాయాల్సి ఉండి, ఈ దుస్తుల్లో తనను అనుమతించకపోతే, నేను అస్సలు పరీక్ష రాయనని, 18 ఏళ్ల వాళ్లతో ఇలా వ్యవహరించడం సిగ్గుచేటు అని, నాకు పరీక్ష కన్నా బురఖానే ముఖ్యమని ఆమె చెప్పింది. అయితే, ఈ వివాదం తర్వాత విద్యార్థిని అనుమతించినట్లు అధికారులు తెలిపారు.

విద్యార్థిని తండ్రి మహమ్మద్ అలీమ్ మాట్లాడుతూ.. ‘‘ఎన్టీఏ బురఖాను అనుమతించింది, నా కూతురు బురఖా లేకుండా పరీక్ష రాయదు, ఆమె మూడేళ్లుగా దీని కోసం సిద్ధమవుతోంది, నా మే 3వ తేదీన పరీక్ష రాసింది, అప్పుడు కూడా ఆమె బురఖా ధరించే ఉంది. నియమం 18 ప్రకారం, మీరు మీ మతపరమైన దుస్తులను ధరించి పరీక్షకు హాజరు కావచ్చు… ఒక మహిళా సిబ్బందిని పిలిచి, క్షుణ్ణంగా తనిఖీ చేయించి, ఒక తెర వెనుక ఏకాంత ప్రదేశంలో ఆమె బురఖాను తీయించమని మేము వారిని కోరాము, కానీ వారు నిరాకరించారు.’’ అని అన్నారు.

నియమాలు ఏం చెబుతున్నాయి.?

నీట్ ఎగ్జామ్ వ్యవహారంలో మతపరమైన వివాదాలు ఎదురవ్వడం కొత్త కాదు. జాతీయ పరీక్షల సంస్థ (NTA) మార్గదర్శకాల ప్రకారం, విద్యార్థులు మత సంప్రదాయాలకు అనుగుణంగా నిర్దిష్ట వస్త్రధారణ (బురఖా, హిజాబ్, కిర్పాన్ లేదా తలపాగా వంటివి) ధరించి పరీక్షలకు హాజరు కావొచ్చు. అయితే, అటువంటి విద్యార్థులు సాధారణంగా రిపోర్ట్ చేయాల్సిన సమయానికి సుమారు ఒకటి నుండి గంటన్నర ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి, తద్వారా వారిని క్షుణ్ణంగా తనిఖీ చేయవచ్చు. ఈ వివాదంలో పరీక్షా కేంద్రంలో సిబ్బందికి, విద్యార్థినికి మధ్య సమన్వయం లోపమే కారణమని తెలుస్తోంది.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Vaibhav: అది సార్ ‘వైభవ్ సూర్యవంశీ’ అంటే.. తిట్టిన నోళ్లే జేజేలు కొట్టాయి.. ఫిదా అయిన లంక ఆటగాళ్లు..

శ్రీలంక ఏ జట్టుతో జరిగిన ట్రై-నేషన్ సిరీస్ ఫైనల్లో భారత యువ...

Rahul Gandhi: అయ్యా రాహుల్ గాంధీ.. ఇటలీని చూసి నేర్చుకోండి

Rahul Gandhi:  అంతర్జాతీయంగా ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇటలీ...

US-Iran peace deal: మేము అణు బాంబు తయారు చేయం.. ఇరాన్ సంచలన ప్రకటన..

US-Iran peace deal:  స్విట్జర్లాండ్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం కుదిరేందుకు...

INDA Vs SLA: టీమిండియా ఘన విజయం.. ట్రోఫీ కైవసం..

శ్రీలంక వేదికగా జరిగిన ట్రై-నేషన్ ఎ సిరీస్ ఫైనల్ సమరంలో భారత్...