15
May, 2026

A News 365Times Venture

15
Friday
May, 2026

A News 365Times Venture

Uttam Kumar Reddy: రాష్ట్ర వ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాలు.. ధాన్యం కొనుగోళ్లపై మంత్రి కీలక వ్యాఖ్యలు..

Date:

ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధాన్యం కొనుగోళ్లపై కీలక ప్రకటనలు చేశారు. తెలంగాణ చరిత్రలోనే కాకుండా, దేశంలోనే రికార్డు స్థాయిలో పంట పండిందని, రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని, ధాన్యం తరలింపు ప్రక్రియకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.

ధాన్యం కొనుగోళ్ల కోసం సివిల్ సప్లై శాఖకు ప్రభుత్వం 22 వేల కోట్ల రూపాయల ఆర్థిక వనరులను కల్పించిందని, అందులో ఇప్పటికే 4,800 కోట్ల రూపాయలను విడుదల చేశామని మంత్రి వివరించారు. వరి రెండు పంటలకు కలిపి రైతులకు సుమారు 45 వేల కోట్ల రూపాయలు అందుతున్నాయని పేర్కొన్నారు. తన సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ప్యాడీ ప్రొక్యూర్‌మెంట్‌లో తెలంగాణ సాధించిన స్థాయిలో కొనుగోళ్లు మరెక్కడా జరగలేదని ఆయన గుర్తు చేశారు.

ముఖ్యంగా రైతులను ఇబ్బంది పెట్టే మిల్లర్ల విషయంలో మంత్రి హెచ్చరికలు జారీ చేశారు. ధాన్యం తూకంలో గానీ, మరే ఇతర కారణాలతో గానీ మిల్లర్లు కటింగ్ పెడితే సహించేది లేదని, అటువంటి వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. బాయిల్డ్ రైస్ లక్ష్యాన్ని కూడా సకాలంలో చేరుకుంటున్నామని, కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి భరోసా ఇచ్చారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..

ఇజ్రాయెల్ దేశంలో స్థిరపడాలనుకునే నిరుద్యోగ యువతకు ఒక అద్భుతమైన అవకాశం లభించింది....

Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్‌కు నిలిచిపోనున్న రష్యా చమురు..

Russia Oil: మరో రెండు రోజుల్లో రష్యా నుంచి భారత్ దిగుమతి...

Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్‌దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..

టీమ్ ఇండియా బౌలర్, పంజాబ్ కింగ్స్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ తాజాగా...

Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!

పశ్చిమాసియా యుద్ధం ప్రపంచ దేశాలను సంక్షోభంలోకి నెట్టింది. అన్ని రకాలుగా ప్రపంచ...