14
May, 2026

A News 365Times Venture

14
Thursday
May, 2026

A News 365Times Venture

Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్‌కు నిలిచిపోనున్న రష్యా చమురు..

Date:

Russia Oil: మరో రెండు రోజుల్లో రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకుంటున్న ముడి చమురు ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. రష్యా ఆయిల్ కొనుగోలుకు అమెరికా ఇచ్చిన మినహాయిపులు మే 16వ తేదీతో ముగుస్తుంది. మరోసారి అమెరికా రష్యా ఆయిల్ కొనుగోలుకు మినహాయింపులు ఇవ్వకపోతే భారత్ తీవ్ర ఇబ్బందుల్లోకి వెళ్లే అవకాశం ఉంది. ఇరాన్ యుద్ధం, హార్ముజ్ జలసంధి సంక్షోభంతో దేశ ఇంధన భద్రత తీవ్ర ఒత్తిడికి గురవుతోంది. భారత్‌తో పాటు ఇతర దేశాలకు రష్యా చమురు కొనుగోలు విషయంలో అమెరికా అనుమతులు ఇస్తుందా? లేదా? అనే దానిపై స్పష్టత లేదు.

ఒక వేళ అమెరికా మినహాయింపుల్ని పొడగించకపోతే భారత రిఫైనరీలు ఇతర దేశాల నుంచి ఖరీదైన చమురును దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. దీంతో చమురు సేకరణ ఖర్చలు పెరుగొచ్చని బ్లూమ్‌బర్గ్ నివేదించింది. మే నెలలో ఇప్పటి వరకు భారత్ రష్యా నుంచి చమురు దిగుమతులు రోజుకు 2.3 మిలియన్ బ్యారెళ్ల రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. ఒక వేళ రష్యా నుంచి చమురు నౌకలు రాకపోతే మొత్తం నెల సగటు దిగుమతులు రోజుకు 1.9 మిలియన్ బ్యారెళ్లకు తగ్గే అవకాశం ఉంది.

Read Also: PBSK Vs MI: ఐపీఎల్‌లో పంజాబ్ అరుదైన రికార్డు.. ఒక్క ఇన్నింగ్స్‌తో ఆ రికార్డులన్నీ పటాపంచల్..

ప్రపంచంలో మూడో అతిపెద్ద చమురు దిగుమతిదారుగా ఉన్న భారత్, ఇరాన్ యుద్ధం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. పర్షియన్ గల్ఫ్ నుంచి భారత్ వచ్చే చమురు తీవ్రంగా దెబ్బతింది. పెరుగుతున్న చమురు ధరల్ని నియంత్రించేందుకు మార్చి 5న భారత్ దేశానికి అమెరికా ప్రత్యేక మినహాయింపు ఇచ్చింది. దీని ప్రకారం, భారత్ సముద్రం మార్గం ద్వారా రష్యా చమురును కొనుగోలు చేసే అవకాశం లభించింది. ఆ తర్వాత మే 16 వరకు పొడగించారు.

ఇదిలా ఉంటే గడువుకు ముందే దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ రిఫైనరీలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL)లు ఈ వారం పశ్చిమాఫ్రికా, అమెరికా నుంచి ముడి చమురును కొనుగోలు చేస్తున్నాయి. ఇదే కాకుండా పర్షియన్ గల్ఫ్‌పై ఎక్కువగా ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి అజర్‌బైజాన్, ఆఫ్రికా నుంచి చమురు కొనుగోలుకు ఒప్పందాలు కుదుర్చుకునే ప్రయత్నంలో ఉన్నాయి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..

ఇజ్రాయెల్ దేశంలో స్థిరపడాలనుకునే నిరుద్యోగ యువతకు ఒక అద్భుతమైన అవకాశం లభించింది....

Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్‌దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..

టీమ్ ఇండియా బౌలర్, పంజాబ్ కింగ్స్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ తాజాగా...

Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!

పశ్చిమాసియా యుద్ధం ప్రపంచ దేశాలను సంక్షోభంలోకి నెట్టింది. అన్ని రకాలుగా ప్రపంచ...

Kejriwal: కేజ్రీవాల్‌, సిసోడియాకు ఢిల్లీ హైకోర్టు షాక్.. ధిక్కార కేసు నమోదు చేయాలని ఆదేశం

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు మరోసారి ముదురుతోంది. తాజాగా మాజీ సీఎం...