26
August, 2026

A News 365Times Venture

26
Wednesday
August, 2026

A News 365Times Venture

US-Russia: రష్యాలో ల్యాండ్ అయిన అమెరికా మిలిటరీ విమానం.. ఏం జరుగుతోంది.?

Date:

US-Russia: అమెరికాకు చెందిన ఒక సైనిక విమానం మంగళవారం రష్యాలోని వృుకోవో ఎయిర్‌పోర్టులో ల్యాండ్ కావడం చర్చనీయాంశంగా మారింది. ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్న వేళ యూఎస్ విమానం రష్యాకు ఎందుకు వెళ్లిందనే ప్రశ్నలు వస్తున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అమెరికా, రష్యాల మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా ఉన్న సంతతి తెలిసిందే.

ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్ ఫ్లైట్‌రాడార్ ప్రకారం.. ఈ విమానం బోయింగ్ సీ-17 గ్లోబ్‌మాస్టర్ 3 అయి ఉండొచ్చని తెలుస్తోంది. ఈ విమానం ప్రత్యేకంగా యూఎస్ వైమానికదళం ఉపయోగించే భారీ సైనిక రవాణా విమానం. సైనిక సిబ్బంది, సైనిక పరికరాలు, వాహనాలను సుదూర ప్రాంతాలకు తరలించేందుకు దీనిని ఉపయోగిస్తారు. ఇది లాట్వియా రాజధాని రిగా నుంచి మాస్కో వెళ్లింది. విమానం ఉదయం సుమారు 8:50 గంటలకు రిగా నుంచి బయలుదేరి, 10 గంటల తర్వాత మాస్కోలో ల్యాండ్ అయింది.

అయితే, ఈ విమానంలో ఎవరు వెళ్లారనే దానిపై స్పష్టత లేదు. అమెరికా, రష్యా ప్రభుత్వాలు ఈ విమానంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ విమానం ఆగస్టు 23న రిగాకు చేరుకుంది. అంతకుముందు ఇది అమెరికాలోని క్యాంప్ స్ప్రింగ్‌ నుంచి బయలుదేరినట్లు తెలుస్తోంది. ఇక్కడే అమెరికా కీలక సైనిక స్థావరమైన ఆండ్రూ ఎయిర్ ఫోర్స్ బేస్ ఉంది. దీనిక అమెరికా అధ్యక్షుడు ఉపయోగించే ఎయిర్‌ఫోర్స్ వన్‌తో ఈ స్థావరానికి సంబంధం ఉంది.

ఈ విమానం రష్యాకు వెళ్లడం చూస్తే అమెరికాకు చెందిన ఉన్నతాధికారి పర్యటన అయి ఉండొచ్చనే అనుమానాలు వస్తున్నాయి. ప్రస్తుతం, రెండు దేశాల మధ్య సంబంధాలు సున్నితంగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఒక అమెరికా సైనిక విమానం రష్యా రాజధానిలో ల్యాండ్ కావడం చూస్తే అంతర్జాతీయంగా ఆసక్తి పెరుగుతోంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Asim Munir: ఇరాన్‌ ముందు కీలక ప్రతిపాదనలు.. హార్ముజ్‌పై అమెరికా ఆఫర్ ఇదేనా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తరఫున పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్...

Telangana Exhibitors : ఆ ‘జీవో 77’ రద్దు చేయకుంటే 400 థియేటర్లు మూత.. సీఎం రేవంత్ రెడ్డికి ఎగ్జిబిటర్ల లేఖ

సినిమా టికెట్ ధరల స్థిరీకరణ, థియేటర్ల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన...

Renukaswamy Case: రేణుకాస్వామి మర్డర్ కేసులో దర్శన్‌కు భారీ ఎదురుదెబ్బ..

Renukaswamy Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రేణుకా స్వామి హత్య కేసులో...

Modi Cabinet: కేంద్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం.. కొత్త ముఖాలకు చోటు!

త్వరలో కేంద్ర కేబినెట్ విస్తరణ జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలో ఏడు...