26
August, 2026

A News 365Times Venture

26
Wednesday
August, 2026

A News 365Times Venture

Earthquake: 7 రోజుల్లో 187 భూకంపాలు.. “రింగ్ ఆఫ్ ఫైర్‌”లో ఏం జరుగుతోంది?

Date:

Earthquake: పసిఫిక్ మహాసముద్రంలోని ‘‘రింగ్ ఆఫ్ ఫైర్’’లో అసలేం జరుగుతోంది. కేవలం 7 రోజుల్లో 187 భూకంపాలు సంభవించడం శాస్త్రవేత్తల్ని ఆందోళనకు గురిచేస్తోంది. గత వారం జపాన్, ఇండోనేషియా, అలస్కా, అమెరికాలోని పలు ప్రాంతాల్లో భూకంపాలు నమోదయ్యాయి. 4.5 తీవ్రత లేదా అంతకన్నా ఎక్కువగా ఉన్న 187 భూకంపాలు వచ్చాయి. వీటిలో ఇండోనేషియాలో సంభవించిన 7.7 తీవ్రత భూకంపం అతిపెద్దది.

రింగ్ ఆఫ్ ఫైర్ అంటే ఏమిటి..?

రింగ్ ఆఫ్ ఫైర్ అనేది పసిఫిక్ మహాసముద్రం చుట్టూ ఉన్న 40,000 కిలోమీటర్ల ప్రాంతం. ఈ ప్రాంతంలో భూఅంతర్భాగంలో అనేక ‘‘టెక్టానిక్ ప్లేట్ల’’ కదలికలు ఎక్కువగా ఉంటాయి. ఈ ఫలకాలు నిరంతరం కదలికలు, ఒత్తిడికి గురవుతుంటాయి. దీంతోనే భూకంపాలు, సునామీ, అగ్ని పర్వతాల పేలుళ్లు సంభవిస్తుంటాయి. ప్రపంచంలోని 90 శాతం భూకంపాలు ఈ ప్రాంతం చుట్టూనే జరుగుతాయి.

గత వారంలో సంభవించిన అతిపెద్ద భూకంపం ఇండోనేషియాలో 7.7 తీవ్రతతో సంభవించింది. దీని తర్వాత ఉత్తర ఇండోనేషియాలో 6.9 తీవ్రతతో, దక్షిణ పెరూలో 6.7 తీవ్రతతో భూకంపాలు సంభవించాయి. జపాన్, అలాస్కా, పశ్చిమ యునైటెడ్ స్టేట్స్‌లో కూడా 4.5 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రత గల అనేక భూకంపాలు సంభవించాయి. ఒక పెద్ద భూకంపం తర్వాత చిన్న ప్రకంపనలు రావడం సాధారణం. వీటిని ఆఫ్టర్ షాక్‌లు అంటారు.

ప్రమాదమా..?

కేవలం భూకంపాల సంఖ్య ఆధారంగా సైంటిస్టులు పెద్ద ప్రళయం రాబోతోందని ఖచ్చితంగా చెప్పలేరు. భూకంపాలు ఖచ్చితమైన తేదీ, తీవ్రతను అంచనా వేయలేరు. కాలిఫోర్నియా, టర్కీ ప్రాంతాలు చురుకైన భూకంప మండలాల్లో ఉండటం వల్ల అవి ఖచ్చితంగా ప్రమాదంలో ఉన్నాయని చెబుతున్నారు. ఇలా వరసగా భూకంపాలు పెద్ద భూకంపాలనికి కారణమయ్యే శాస్త్రీయ ఆధారాలు లేవు. కానీ ఇలా వరస భూకంపాలు మాత్రం అందర్లో ఆందోళనకు కారణమవుతున్నాయి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Modi Cabinet: కేంద్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం.. కొత్త ముఖాలకు చోటు!

త్వరలో కేంద్ర కేబినెట్ విస్తరణ జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలో ఏడు...

BJP: ‘‘మనుస్మృతి’’పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ‘‘హిజాబ్‌’’ వీడియోతో బీజేపీ కౌంటర్..

BJP:  ఇటీవల పూణేలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ నిర్వహించిన  కార్యక్రమంలో...

Arvind Kejriwal: ఆప్ గెలిస్తే 5 రోజుల్లో E20 పెట్రోల్ బ్యాన్.. కేజ్రీవాల్ హామీ..

Arvind Kejriwal: ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అధికారంలోకి వస్తే గోవాలో...

IISc Study: ఆవు ఎంజైమ్‌తో ప్రమాదకర బ్యాక్టీరియాకు చెక్.. IISc సంచలన పరిశోధన

IISc Study:  ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) శాస్త్రవేత్తలు పరిశోధన...