10
June, 2026

A News 365Times Venture

10
Wednesday
June, 2026

A News 365Times Venture

US-Iran: తాజా దాడులతో శాంతి చర్చలపై నీలినీడలు.. రగిలిపోతున్న ఇరాన్

Date:

పశ్చిమాసియాలో మంగళవారం మరోసారి ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. శాంతి చర్చలు జరుగుతున్న వేళ హార్ముజ్ దగ్గర ఆత్మ రక్షణ దాడులు చేసినట్లుగా అమెరికా తెలిపింది.  ఇరాన్ దళాల నుంచి తమ సైన్యానికి పొంచి ఉన్న ముప్పును తిప్పికొట్టడానికి, తమ బలగాలను రక్షించుకోవడానికే దక్షిణ ఇరాన్‌లో ఆత్మరక్షణ దాడులు చేసినట్లు యూఎస్ వెల్లడించింది. దీంతో ప్రశాంతంగా ఉన్న మధ్యప్రాచ్యం ఒక్కసారిగా భగ్గుమంది. దీంతో ఇరాన్ మరోసారి ప్రతీకారంతో రగిలిపోతుంది.

అమెరికా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఇరాన్ తీవ్ర ఆరోపణలు చేసింది. ముఖ్యంగా దక్షిణ హార్మోజ్‌గాన్ ప్రాంతంలో అమెరికా సైన్యం దూకుడు చర్యలకు పాల్పడిందని, ఇరాన్ వాణిజ్య నౌకలపై సముద్ర దోపిడీ చర్యలు చేపట్టిందని ఇరాన్ విదేశాంగ శాఖ మండిపడింది. 2026 ఏప్రిల్ 19న కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత కూడా అమెరికా అక్రమ, అన్యాయ చర్యలను కొనసాగిస్తోందని ఇరాన్ ఆరోపించింది. గత 48 గంటల్లో హార్మోజ్‌ ప్రాంతంలో జరిగిన చర్యలు కాల్పుల విరమణ ఒప్పందానికి ఘోర ఉల్లంఘన అని పేర్కొంది. ముఖ్యంగా ఇరాన్ వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని అమెరికా సముద్ర దోపిడీ చర్యలకు పాల్పడిందని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

ఇదే సమయంలో పాకిస్థాన్ మధ్యవర్తిత్వంలో దౌత్య చర్చలు కొనసాగుతుండగా అమెరికా ఇలాంటి చర్యలకు దిగడం.. వాషింగ్టన్ పాలకుల ద్వంద్వ వైఖరిని మరోసారి బయటపెట్టిందని ఇరాన్ విమర్శించింది. “అమెరికా ఇచ్చిన హామీలకు విలువ లేదని, ఇరాన్ ప్రజలపై ప్రతీకార ధోరణితో వ్యవహరిస్తోందని ఈ ఘటనలు నిరూపించాయి” అని పేర్కొంది. అమెరికా చర్యలు ఐక్యరాజ్యసమితి చార్టర్‌లోని ఆర్టికల్ 2, ప్యారాగ్రాఫ్ 4కు స్పష్టమైన ఉల్లంఘన అని ఇరాన్ పేర్కొంది. ఈ దాడుల వల్ల కలిగే పరిణామాలకు అమెరికానే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది.

“ఇరాన్‌పై జరిగే ఏ దుష్ట చర్యనూ మేము ఉపేక్షించము. దేశ రక్షణ విషయంలో ఎలాంటి వెనుకడుగు వేయము” అంటూ ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఇదిలా ఉండగా అణు చర్చల్లో కూడా ప్రతిష్టంభన కొనసాగుతోంది. తాజా శాంతి చర్చల్లో భాగంగా యురేనియంను విదేశాలకు తరలించే ప్రతిపాదనను ఇరాన్ తిరస్కరించినట్లు సెమీ-అధికారిక తస్నీమ్ వార్తా సంస్థ వెల్లడించింది. దీంతో ఇరాన్-అమెరికా మధ్య ఒప్పందం ఇంకా సంక్లిష్ట దశలోనే కొనసాగుతోంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Vaibhav Sooryavanshi Next Match: వైభవ్ సూర్యవంశీకి మరో అవకాశం.. ఇప్పుడైనా బ్యాట్‌తో చెలరేగుతాడా..?

Vaibhav Sooryavanshi Next Match: భారత క్రికెట్‌లో కొత్త సంచలనంగా ఎదుగుతున్న...

Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ఎందుకు విఫలమయ్యాడు? ఒక షాట్.. ఒక తప్పిదం.. వైభవ్‌కు విలువైన పాఠం..!

Vaibhav Sooryavanshi: శ్రీలంకలో జరుగుతున్న ట్రై-సిరీస్‌లో ఇండియా ‘ఎ’ జట్టుకు ప్రాతినిధ్యం...

Modi-Meloni: ఇటీవల రోమ్‌లో కలవడం ఆనందంగా ఉంది.. మోడీ రికార్డ్‌పై మెలోని అభినందనలు

ప్రధాని మోడీ చరిత్ర సృష్టించారు. ఏకధాటిగా దేశాన్ని 12 ఏళ్ల పాటు...

రూ.18,999లకే 144Hz డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..

Realme P4R 5G Launch: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో యువతను లక్ష్యంగా చేసుకుని...