24
September, 2026

A News 365Times Venture

24
Thursday
September, 2026

A News 365Times Venture

Trump: ఒప్పందం కుదుర్చుకోండి.. లేదంటే నరకానికి పంపిస్తాం.. ప్రపంచ నేతల ముందు ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్

Date:

ఐక్యరాజ్యసమితి వేదికగా ఇరాన్‌కు ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఒప్పందం కుదుర్చుకోండి.. లేదంటే నరకానికి పంపిస్తామంటూ ప్రపంచ నేతల ముందు టెహ్రాన్‌కు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ట్రంప్ కీలక ప్రసంగం చేశారు.

‘‘వారికి బతికే అవకాశం లేకుండా, భవిష్యత్తు వైభవం లేదా తరాలపై ఆశ లేకుండా నేను వారిని నరకంలోకి నెట్టేస్తానా?’’ అని అన్నారు. నవంబర్‌లో జరిగే అమెరికా మధ్యంతర ఎన్నికల తర్వాత ఒక ఇరాన్‌తో ఒప్పందం సాధ్యమవుతుందని తాను నమ్ముతున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశాల్లో ఇరాన్ మొదటి స్థానంలో ఉందని చెప్పారు. గత 51 ఏళ్లుగా ఇరాన్ ఛాందసవాద ప్రభుత్వం రక్తపాతం, హత్యల ద్వారా పరిపాలిస్తోందని పేర్కొన్నారు. ఇరాన్ మధ్యప్రాచ్యం అంతటా.. దాని వెలుపల కూడా మరణం, విధ్వంసం, గందరగోళాన్ని సృష్టించిందన్నారు. ఒకప్పుడు ఇరాన్ మధ్యప్రాచ్యాన్ని బెదిరించేదని.. కానీ ఇప్పుడు అలా చేయడం దానికి సాధ్యం కాదని పేర్కొన్నారు. ఇరాన్ ఇకపై పెత్తందారు కాదని.. టెహ్రాన్‌కు అణ్వాయుధం సమకూర్చడానికి ఎప్పటికీ అనుమతించబోమని ట్రంప్ ప్రతిజ్ఞ చేశారు.

ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల సందర్భంగా ఇరాన్‌తో సమావేశానికి తాను సిద్ధంగా ఉన్నానని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు. సమావేశం ఇంకా ఖరారు కానప్పటికీ ట్రంప్ మాత్రం హెచ్చరిక జారీ చేశారు. ఇదిలా ఉంటే ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశానికి హాజరయ్యేందుకు మంగళవారం బయలుదేరి వెళ్లారు. బుధవారం సమావేశంలో కీలక ప్రసంగం చేయనున్నారు. ఫిబ్రవరి చివరిలో ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులతో ప్రారంభమైన మధ్యప్రాచ్య యుద్ధం మొదలైనప్పటి నుంచి అమెరికా గడ్డపై అడుగుపెట్టనున్న అత్యున్నత స్థాయి ఇరాన్ అధికారి పెజెష్కియన్ కానున్నారు.

ఇక ట్రంప్ బుధవారమే న్యూయార్క్ నుంచి బయల్దేరి వైట్‌హౌస్‌కు వెళ్లనున్నారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు స్వాగతం పలకనున్నారు. అంతేకాకుండా ప్రత్యేక విందు కూడా ఇవ్వనున్నారు. అలాగే తాను టెహ్రాన్‌తో చర్చలకు సిద్ధంగా ఉన్నానని కూడా ట్రంప్ చెప్పారు.

 

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు

AP Severe Depression Landfall: తీవ్ర వాయుగుండం ఆంధ్రప్రదేశ్‌ తీరాన్ని తాకడం...

RBI New FD Rules: FD నిబంధనల్లో కీలక మార్పులు.. వడ్డీపై ప్రభావం ఎంత..?

RBI New FD Rules: ఇవాళ్టి పొదుపే.. రేపు మీకు తోడుగా...

Trump: ‘మీరు ఇక్కడ ఉండకూడదు’.. యూఎన్‌లో ఓ రిపోర్టర్‌పై ట్రంప్ ఫైర్

ప్రస్తుతం అమెరికాలో ట్రంప్ వర్సెస్ మీడియా యుద్ధం సాగుతోంది. ఇప్పటికే కొన్ని...

Meloni: యూఎన్‌కు మెలోనీ దూరం.. ట్రంప్‌ను కలవడం ఇష్టం లేకనేనా?

ఐక్యరాజ్యసమితి వేదికగా ప్రపంచ నేతలంతా సమావేశం కాబోతున్నారు. నేతలంతా న్యూయార్క్‌కు తరలివెళ్తున్నారు....