16
July, 2026

A News 365Times Venture

16
Thursday
July, 2026

A News 365Times Venture

Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?

Date:

Tollywood: ఇటీవల కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ‘క’ సినిమా కలెక్షన్స్ పోస్టర్లకే కానీ తమ చేతి వరకు రాలేదు అంటూ ఆ సినిమాకి నిర్మాతగా వ్యవహరించిన చింతా గోపాలకృష్ణారెడ్డి చేసిన కొన్ని కామెంట్లు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే హీరో కిరణ్ కూడా నిన్న మాట్లాడుతూ.. తాము ముందే ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లకు అమ్మి వేయడం జరిగిందని, ఆ లాభాలు తమకు వరకు రావని చెప్పడం జరిగింది. అయితే ఈ విషయం మీద కామన్ ఆడియన్స్ కి చాలా అనుమానాలు ఉంటాయి. అయితే అసలు సినిమా రిలీజ్ చేసేటప్పుడు ఎలాంటి పద్ధతులు ఉంటాయి. ఏ పద్ధతిలో రిలీజ్ చేస్తే ఎలాంటి పరిణామాలుంటాయి అనే విషయాన్ని కాస్త కూలంకషంగా వివరించే ప్రయత్నం చేస్తున్నాం.

నిజానికి సినిమాని నిర్మాతలు రెండు రకాలుగా రిలీజ్ చేయవచ్చు. అదేంటంటే.. సినిమాకి ఉన్న క్రేజ్ ని బట్టి ముందుగానే డిస్ట్రిబ్యూటర్లకు అవుట్‌రైట్ గా అమ్మేయడం. లేదంటే, ఇంకా ఎక్కువ లాభాలు వస్తాయి అనుకున్నప్పుడు తామే తమ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ద్వారా రిలీజ్ చేస్తామన్నారు.

అవుట్‌రైట్ (Outright Sale / NRA) పద్ధతి:

అవుట్‌రైట్ పద్ధతిలో నిర్మాత సినిమా హక్కులను ఒక డిస్ట్రిబ్యూటర్‌కు నిర్ణీత మొత్తానికి (ఉదాహరణకు 10 కోట్లకు) పూర్తిగా అమ్మేస్తారు. అలా అమ్మివేసిన తర్వాత నిర్మాతకు కలెక్షన్స్‌తో సంబంధం ఉంటుందా.? అంటే కచ్చితంగా ఉండదు. సినిమా విడుదలయ్యాక థియేటర్ల వద్దకు ప్రేక్షకులు వచ్చినా రాకపోయినా నిర్మాతకు రూపాయి లాభం లేదా నష్టం ఉండదు. తనకి రావాల్సిన 10 కోట్లు ముందే వచ్చేసాయి కాబట్టి ఆయన సేఫ్. అయితే ఈ పద్ధతిలో ఒకవేళ లాభాలు వస్తే ఎవరు తీసుకుంటారు.? అంటే ఒకవేళ ఆ సినిమా సూపర్ హిట్ అయి 20 కోట్ల కలెక్షన్లు సాధిస్తే, ఆ అదనపు 10 కోట్ల లాభం మొత్తం సదరు డిస్ట్రిబ్యూటర్‌కే వెళ్తుంది. నిర్మాత అందులో వాటా అడగలేరు. మరి ఇందులో నష్టాలు వస్తే పరిస్థితి ఏంటి.? అని మీకు అనుమానం కలిగితే ఒకవేళ సినిమా ఫ్లాప్ అయి కేవలం 4 కోట్లే వసూలు చేస్తే, మిగిలిన 6 కోట్ల నష్టాన్ని డిస్ట్రిబ్యూటరే భరించాలి. అయితే ఇక్కడ మన టాలీవుడ్ లో జరిగే ఒక రియాలిటీ విషయానికి వస్తే.. చట్టపరంగా నిర్మాతకు సంబంధం లేకపోయినా, టాలీవుడ్‌లో ఒక పెద్ద హీరో సినిమా ఘోరంగా ఫ్లాప్ అయి డిస్ట్రిబ్యూటర్లు మునిగిపోతే.. మానవతా దృక్పథంతోనో లేదా తదుపరి సినిమా బిజినెస్ కోసమో నిర్మాత లేదా హీరో కొంత మొత్తాన్ని వెనక్కి ఇవ్వడం అంటే ఒక రకంగా కాంపెన్సేట్ చేయడం మనం చూస్తూనే ఉంటాం.

సొంతంగా డిస్ట్రిబ్యూషన్:

ఇప్పుడు టాలీవుడ్‌లో చాలా మంది పెద్ద నిర్మాతలు ఈ పద్ధతినే వాడుతున్నారు. ఈ పద్ధతిలో నిర్మాత ఎవరికీ సినిమా హక్కులను అమ్మరు. తామే నేరుగా థియేటర్ల యజమానులతో (ఎగ్జిబిటర్లతో) మాట్లాడుకుని సినిమాను విడుదల చేస్తారు. కొంతమంది నిర్మాతలు తమకు డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ లేకపోతే డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఉన్న నిర్మాతలతో మాట్లాడుకుని వారి ద్వారా సినిమాని రిలీజ్ చేసుకుంటారు. ఈ పద్ధతిలో నిర్మాతకు కలెక్షన్స్‌తో సంబంధం ఉంటుందా.? అని అడిగితే వందకు 100% ఉంటుంది. ప్రతి థియేటర్ నుంచి వచ్చే ప్రతి రూపాయి కలెక్షన్ నేరుగా నిర్మాత ఖాతాకే వెళ్తుంది. లాభాలు వస్తే పరిస్థితి ఏంటి..? అని అడిగితే సినిమా బ్లాక్‌బస్టర్ అయితే థియేటర్ రెంట్లు పోను వచ్చే లాభాలన్నీ (100% షేర్) నిర్మాతకే దక్కుతాయి. మధ్యలో డిస్ట్రిబ్యూటర్లు ఎవరూ ఉండరు కాబట్టి లాభాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ నష్టాలు వస్తే పరిస్థితి ఏంటి.? అని అడిగితే రిస్క్ కూడా అంతే స్థాయిలో ఉంటుంది. సినిమా డిజాస్టర్ అయితే థియేటర్ల రెంట్లు, పబ్లిసిటీ ఖర్చులు కూడా రాక భారీ నష్టాన్ని నిర్మాత ఒక్కడే భరించాల్సి ఉంటుంది.

అయితే అసలు సినిమా అమ్మేసాక నిర్మాతకు కలెక్షన్స్‌తో అస్సలు సంబంధం ఉండదా.? అనే విషయాన్ని పరిశీలిస్తే మాత్రం సినిమాను అవుట్‌రైట్‌గా కాకుండా “అడ్వాన్స్ బేసిస్” లేదా “కమిషన్ బేసిస్” మీద అమ్మినప్పుడు మాత్రం నిర్మాతకు కలెక్షన్లతో ఖచ్చితంగా సంబంధం ఉంటుంది.

అడ్వాన్స్ బేసిస్:

ఒకవేళ సినిమాను “అడ్వాన్స్ బేసిస్” తరహాలో రిలీజ్ చేయాలి అంటే డిస్ట్రిబ్యూటర్ నిర్మాతకు కొంత డబ్బు అడ్వాన్స్ ఇస్తాడు. సినిమా ఆడాక వచ్చే వసూళ్లలో ఆ అడ్వాన్స్ డబ్బును డిస్ట్రిబ్యూటర్ మినహాయించుకుంటాడు. ఆ తర్వాత వచ్చే లాభాలను (Overflows) ఒప్పందం ప్రకారం నిర్మాతకు, డిస్ట్రిబ్యూటర్‌కు మధ్య పంచుకుంటారు. ఒకవేళ కలెక్షన్లు రాకపోతే నిర్మాత ఆ అడ్వాన్స్ డబ్బును డిస్ట్రిబ్యూటర్‌కు తిరిగి ఇచ్చేయాలి.

కమిషన్ బేసిస్:

ఒకవేళ కమిషన్ బేసిస్ లో కనుక సినిమా రిలీజ్ చెయ్యాలి అనుకుంటే డిస్ట్రిబ్యూటర్ కేవలం సినిమాను థియేటర్లలో వేయడానికి సహాయం చేస్తాడు. కలెక్షన్లు అన్నీ నిర్మాతవే, అందులోంచి 5% నుండి 10% కమిషన్ మాత్రం డిస్ట్రిబ్యూటర్ ఫీజుగా తీసుకుంటాడు. అయితే చివరిగా అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే సినిమా అవుట్‌రైట్ సేల్ అయితే నిర్మాత సేఫ్, కలెక్షన్లతో సంబంధం లేదు (రిస్క్ లేదు, అదనపు లాభాలు రావు). సొంతంగా రిలీజ్ చేసుకుంటే థియేటర్ కలెక్షన్లే నిర్మాతకు ఆధారం (హై రిస్క్ – హై ప్రాఫిట్). ఇక్కడ కిరణ్ అబ్బవరం చెబుతున్న దాని ప్రకారం ‘క’ సినిమాని ముందుగానే డిస్ట్రిబ్యూటర్లకు ఒక అవుట్ రైట్ రేటుకు అమ్మి వేశారు. అలా అమ్మి వేయడం వల్ల కలెక్షన్స్ కనిపిస్తాయి కానీ అవి నిర్మాత వరకు చేరవు. అదన్నమాట ఈ సినిమా రిలీజ్ కథా కమామిషు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్‌ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!

Motorola Edge 70 Max: మోటరోలా (Motorola) భారత మార్కెట్లో కొత్త ప్రీమియం...

TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!

TGEAPCET 2026: తెలంగాణ రాష్ట్ర ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్...

Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!

Chilli Egg Recipe: ఎగ్స్‌తో ఎప్పుడూ ఒకేలాంటి కూరలు, ఫ్రైలు తిని...

AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం.. ముగ్గురు నిందితులకు 3 రోజుల ఈడీ కస్టడీ..!

AP Liquor Transport Scam: ఆంధ్రప్రదేశ్ లిక్కర్ ట్రాన్స్‌పోర్ట్ స్కాం కేసులో...