Motorola Edge 70 Max: మోటరోలా (Motorola) భారత మార్కెట్లో కొత్త ప్రీమియం ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ మోటోరోలా ఎడ్జ్ 70 మాక్స్ (Motorola Edge 70 Max) ను లాంచ్ చేసింది. గేమింగ్, హై-పర్ఫార్మెన్స్ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ ఫోన్లో Snapdragon 8 Gen 5 చిప్సెట్, 6.8 అంగుళాల 2K 144Hz LTPO AMOLED డిస్ప్లే, 7100mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP Sony LYTIA కెమెరా వంటి అత్యాధునిక ఫీచర్లను అందించింది.
ఫ్లాగ్షిప్ ప్రాసెసర్:
Motorola Edge 70 Maxలో 3nm ప్రాసెస్‌పై తయారైన Qualcomm Snapdragon 8 Gen 5 మొబైల్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించారు. ఇందులో 3.8GHz ప్రైమ్ కోర్తో పాటు Adreno 829 GPU ఉండటంతో గేమింగ్, మల్టీటాస్కింగ్, AI పనితీరు మరింత మెరుగ్గా ఉంటుంది. AnTuTuలో 3.2 మిలియన్లకు పైగా స్కోర్ సాధించినట్లు కంపెనీ వెల్లడించింది. ఫోన్లో 12GB వరకు LPDDR5X RAM, 256GB UFS 4.1 స్టోరేజ్ అందించారు. అధిక వినియోగ సమయంలో వేడెక్కకుండా ఉండేందుకు ArcticMesh కూలింగ్ సిస్టం, 5,500mm² వేపర్ ఛాంబర్, మొత్తం 29,550mm² థర్మల్ కూలింగ్ మెటీరియల్ ను ఉపయోగించారు.
2K LTPO AMOLED డిస్ప్లే:
ఈ ఫోన్లో 6.8 అంగుళాల Quad HD+ (1440×3168 పిక్సెల్స్) ఎక్స్ట్రీమ్ LTPO AMOLED డిస్ప్లేను అందించారు. 144Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 360Hz టచ్ శాంప్లింగ్ రేట్, గరిష్టంగా 7000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉండటంతో ఎండలో కూడా స్పష్టమైన విజువల్స్ కనిపిస్తాయి. పాన్టోన్ వాలిడేటెడ్, పాన్టోన్ స్కిన్ టోన్ వాలిడేటెడ్, డాల్బీ విజన్, HDR10+ వంటి టెక్నాలజీలకు కూడా ఇది మద్దతు ఇస్తుంది. డిస్ప్లే రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7iను అందించారు.
7100mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్:
Motorola Edge 70 Maxలో 7100mAh 4వ తరం సిలికాన్-కార్బన్ బ్యాటరీను అందించారు. కంపెనీ ప్రకారం ఇది 25 గంటల గేమింగ్, 42 గంటల వీడియో ప్లేబ్యాక్, 58 గంటల వరకు సాధారణ వినియోగం అందిస్తుంది. 90W టర్బో పవర్ ఫాస్ట్ ఛార్జింగ్ తో కేవలం 21 నిమిషాల్లో 50% వరకు ఛార్జ్ అవుతుంది. అలాగే 25W Qi2.2 మాగ్నెటిక్ వైర్ లెస్ ఛార్జింగ్, 5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. MagSafe యాక్సెసరీలతో కూడా ఇది పనిచేస్తుంది.
50MP సోనీ కెమెరా:
ఫోటోగ్రఫీ కోసం వెనుక భాగంలో 50MP సోనీ LYTIA-710 ప్రధాన కెమెరా (OIS), 8MP అల్ట్రా-వైడ్ + మాక్రో కెమెరాను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఉంది. అన్ని కెమెరాలతో 4K వీడియో రికార్డింగ్ చేయవచ్చు. AI యాక్షన్ షాట్, AI అడాప్టివ్ స్టెబిలైజషన్, 360° హారిజన్ లాక్, ఆడియో జూమ్, ఫ్రేమ్ మ్యాచ్ వంటి అధునాతన వీడియో ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.
మోటో AI ఫీచర్లు:
ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత Hello UXపై పనిచేస్తుంది. కంపెనీ 3 ప్రధాన ఆండ్రాయిడ్ అప్డేట్లు, 5 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్లు అందించనున్నట్లు ప్రకటించింది. గూగుల్ జెమినీ, మైక్రోసాఫ్ట్ కోపైలట్, పెర్ప్లేక్సిటీ AIతో పాటు మోటోరోలా సొంత Qira AI కూడా ఇందులో అందుబాటులో ఉంది. వీటితోపాటు Catch Me Up, Recall, Creator Zone, Scribble to Image, Create Avatar, Style Sync వంటి AI టూల్స్ వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి.
ప్రీమియం డిజైన్:
Motorola Edge 70 Maxలో ఎయిర్‌క్రాఫ్ట్-గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్, ముందు, వెనుక భాగంలో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7iను ఉపయోగించారు. MIL-STD-810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, IP66 + IP68 + IP69 డస్ట్ & వాటర్ రెసిస్టెన్స్ తో పాటు ఈ ఫోన్ అత్యంత బలమైన నిర్మాణాన్ని కలిగి ఉంది. Wi-Fi 7, బ్లూటూత్ 5.4, NFC, డాల్బీ ఆటమ్స్ స్టీరియో స్పీకర్లు, థింక్ షీల్డ్ సెక్యూరిటీ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
ధరలు:
మోటోరోలా ఎడ్జ్ 70 మాక్స్ 8GB + 256GB వేరియంట్ ధర రూ.54,999, 12GB + 256GB వేరియంట్ ధర రూ.59,999గా నిర్ణయించారు. జూలై 20 నుంచి ఫ్లిప్‌కార్ట్, motorola.in, అలాగే దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ స్టోర్లలో ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. ప్రారంభ ఆఫర్లో HDFC, Axis బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.5,000 ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేసినా రూ.5,000 వరకు అదనపు తగ్గింపు పొందే అవకాశం ఉంది.




