2
September, 2026

A News 365Times Venture

2
Wednesday
September, 2026

A News 365Times Venture

Telangana Health Department: ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాలు.. 1,931 పోస్టులకు మెరిట్ లిస్ట్ విడుదల

Date:

Telangana Health Department: తెలంగాణ ఆరోగ్యశాఖలో మరో భారీ నియామక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. 1,931 మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఫిమేల్) పోస్టులకు సంబంధించి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (MHSRB) మంగళవారం ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌ను విడుదల చేసింది. 1:1.25 నిష్పత్తిలో అభ్యర్థులను తదుపరి దశకు షార్ట్‌లిస్ట్ చేసినట్లు బోర్డు వెల్లడించింది. షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు సెప్టెంబర్ 16 నుంచి 26వ తేదీ వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. హైదరాబాద్ వెంగల్‌రావ్‌నగర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్లో ఈ ప్రక్రియ జరగనుంది.

అభ్యర్థులు తమకు కేటాయించిన తేదీ, సమయంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. ఇందుకోసం అవసరమైన అసలు సర్టిఫికెట్లతో పాటు ప్రతి సర్టిఫికెట్‌కు రెండు సెట్ల ఫొటోకాపీలు తీసుకురావాలని MHSRB సూచించింది. ఇక, నిర్ణీత తేదీల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరుకాలేని అభ్యర్థులు లేదా అవసరమైన సర్టిఫికెట్లను సమర్పించలేకపోయిన వారి కోసం సెప్టెంబర్ 28వ తేదీని రిజర్వ్ డేగా నిర్ణయించారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని బోర్డు సూచించింది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్, సెలక్షన్ లిస్ట్‌ను విడుదల చేయనున్నట్లు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు వెల్లడించింది. దీంతో 1,931 పోస్టుల భర్తీ ప్రక్రియ తుది దశకు చేరుకోనుంది.

రెండున్నరేళ్లలో 15 వేలకు పైగా పోస్టుల భర్తీ
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో డాక్టర్లు, నర్సింగ్ ఆఫీసర్లు, ఇతర వైద్య సిబ్బంది పాత్ర కీలకమని ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో ఆరోగ్యశాఖలో నియామకాలకు ప్రాధాన్యం ఇస్తోంది. గత రెండున్నర సంవత్సరాల్లోనే ఆరోగ్యశాఖలో 15 వేలకు పైగా పోస్టులను భర్తీ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. మరోవైపు సుమారు 2 వేల పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. తాజా 1,931 మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టుల నియామకం పూర్తయితే వైద్య, ఆరోగ్య సేవల్లో సిబ్బంది కొరతను కొంతమేర తగ్గించే అవకాశం ఉంది.

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Extra Marital Affair: భార్య అక్రమ సంబంధాన్ని రోబో వాక్యూమ్ కెమెరాతో పట్టుకున్న భర్త.. చివరికిలా..!

ఓ భర్త టెక్నాలజీని ఉపయోగించి భార్య అక్రమ సంబంధాన్ని పట్టుకున్నాడు. మూడో...

Reliance Ice Cream: ఇక నుంచి మార్కెట్లో రిలయన్స్ ఐస్ క్రీం.. కేవలం రూ.10 లకే..

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL)కి చెందిన ఎఫ్‌ఎంసీజీ సంస్థ అయిన ‘రిలయన్స్...

US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్‌పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్

ఇరాన్‌పై కఠిన ఆంక్షలు విధించేందుకు అమెరికా రంగం సిద్ధం చేస్తుందా? హార్ముజ్...

Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?

Off The Record: ఆంధ్రప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికల కోసం వైసీపీ...